ఎండబెట్టి డ్రై ఫ్రూట్స్ రూపంలోకి మార్చిన అంజీర్ పండ్లు మార్కెట్‌లో మనకు లభ్యమవుతున్నాయి. వీటిని అందరూ చూసే ఉంటారు. అయితే డ్రై ఫ్రూట్స్ రూపంలో దొరికే అంజీర్ పండ్లే కాదు, సాధారణ పండు రూపంలోనూ అంజీర్‌ను తింటే దాంతో మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ పండును రెండు పూటలా భోజనానికి ముందు తింటే దాంతో అనేక అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. అంజీర్ పండ్లలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారాన్ని సులువుగా జీర్ణం చేసేందుకు ఉపయోగపడుతుంది. జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి జీర్ణ సంబంధ సమస్యలన్నీ దూరమవుతాయి.
2. అంజీర్‌లో పొటాషియం, సోడియం బాగా లభిస్తాయి. ఇవి రక్తపోటు (బీపీ) సమస్య నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. బీపీని కంట్రోల్‌లో ఉంచుతాయి.
3. రక్తహీనత సమస్య నేడు చాలా మందిని బాధిస్తోంది. అలాంటి వారు నిత్యం రెండు అంజీర్ పండ్లను భోజనానికి ముందు తిన్నట్టయితే వారిలో రక్తం బాగా పడుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి విష జ్వరాల బారిన పడి ప్లేట్‌లెట్లు తగ్గిన వారికి ఈ పండ్లను తినిపిస్తే వెంటనే ప్లేట్‌లెట్లు పెరుగుతాయి.
4. అధిక బరువు సమస్య కూడా ఇప్పుడు అధికమైంది. ఈ క్రమంలో అంజీర్ పండ్లను రెండు పూటలా భోజనానికి ముందు తింటే దాంతో పొట్ట నిండిన భావన కలుగుతుంది. దీని వల్ల ఎక్కువగా ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. ఫలితంగా బరువు కూడా తగ్గుతారు. అంతేకాదు అంజీర్‌లో ఉండే పోషకాలు మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తాయి.
5. నిత్యం అంజీర్ పండ్లను తింటుంటే గుండె సంబంధ సమస్యలు కూడా దూరమవుతాయి. అంజీర్ పండ్లలో ఉండే పెక్టిన్ అనే పదార్థం శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
6. అంజీర్ పండ్లలో మెగ్నిషియం, మాంగనీస్, జింక్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి సంతానం కావాలనుకునే వారికి మేలు చేస్తాయి.
7. శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థాలు నాశనమవుతాయి.
8. అంజీర్ పండ్లు మధుమేహం ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. భోజనానికి ముందు వీటిని తింటే అనంతరం రక్తంలో షుగర్ స్థాయిలు అంతగా పెరగవు.
9. ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు అంజీర్ పండ్లను తింటే ఆ అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
10. అంజీర్ పండ్లలో కాల్షియం కూడా పుష్కలంగానే ఉంటుంది. వీటిని తినడం వల్ల ఎముకలు దృఢమవుతాయి. ఎముకలు విరిగి ఉన్న వారికి వీటిని పెడితే ఎముకలు త్వరగా అతుక్కుంటాయి.
11. గొంతు నొప్పి ఉన్నవారు అంజీర్ పండ్లను తింటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. దగ్గు కూడా తగ్గుతుంది.
12. జ్వరం, చెవి నొప్పి, కడుపు నొప్పి వంటి సమస్యలు ఉంటే అంజీర్ పండ్లను తినాలి. దీంతో ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
0 comments:
Post a Comment