గుండె పోటుతో మరణించే మహిళల సంఖ్య మాత్రం పురుషుల కంటే ఎక్కువని మరో పరిశోధన తెలుపుతోంది. అయితే మహిళల్లో గుండెపోటును గుర్తించడంలో డాక్టర్లే ఎక్కువగా పొరబడుతున్నారట. ఫలితంగా గుండెపోటు చాలా మంది మహిళల ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమిస్తోందని ఈ పరిశోధన సారాంశం. చాలా సార్లు మహిళల్లో గుండెపోటును కూడా ఏదో జీర్ణవ్యవస్థలో సమస్యగా భావించడం వల్ల చికిత్స త్వరగా అందక ప్రాణాల మీదకు వస్తోందని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ కార్డియాలజి డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ గేల్ అన్నారు. ఇలా హార్ట్ఎటాక్ను స్త్రీలలో గుర్తించడంలో విఫలమవడానికి కారణం చాలా వరకు మెనోపాజ్‌కు ముందు స్త్రీలలో గుండెపోటు రాదన్న ఒక ఆలోచనలో ఉండటమే. హార్ట్ ఎటాక్ స్త్రీ, పురుషులలో ఎవరికైనా రావచ్చు అనే విషయాన్ని మనం ముందుగా నమ్మాలని ఆయన సూచిస్తున్నారు. కాబట్టి పొట్ట పై భాగంలో ఎక్కడ ఏర్పడిన అసౌకర్యాన్నైనా గుండెపోటుగా అనుమానించాల్సిందేనని ఆయన సూచిస్తున్నారు.
మహిళల్లోనూ ఎక్కువే!
Info Post

0 comments:
Post a Comment