Gum Problems |
నిత్యం బ్రష్ చేసుకుంటూ దంతాలను మనం ఏవిధంగానైతే శుభ్రం చేసుకుంటామో, అలాగే చిగుళ్లను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. లేదంటే చిగుళ్ల వాపు, నొప్పి వస్తుంది. దీంతో దంతాలతో ఏదైనా తిందామన్నా ఇబ్బందిగానే ఉంటుంది. ఈ క్రమంలో కింద ఇచ్చిన పలు టిప్స్‌ను పాటిస్తే చిగుళ్ల సమస్య నుంచి బయట పడవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
1. కొద్దిగా నువ్వుల నూనెను తీసుకుని వేడి చేసి దాన్ని నోట్లో వేసుకుని ఆయిల్ పుల్లింగ్ చేసినట్టు పుక్కిలించాలి. దీంతో కొద్ది రోజుల్లోనే చిగుళ్ల సమస్య నుంచి బయట పడవచ్చు. అంతేకాదు ఇలా చేయడం వల్ల దంత క్షయం రాకుండా ఉంటుంది.
2. గ్రీన్ టీని నిత్యం తాగుతున్నా దంతాలు, చిగుళ్ల సమస్య నుంచి బయట పడవచ్చు. ఇలా తాగడం వల్ల వాపుకు గురైన చిగుళ్ల సమస్య తగ్గుతుంది. చెడు బాక్టీరియా పోతుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
3. అలోవెరా (కలబంద)లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది దంతాలు, చిగుళ్ల సమస్య నుంచి రక్షిస్తుంది. నిత్యం కొద్దిగా అలోవెరా జెల్ లేదా జ్యూస్‌ను నోటిలో పోసుకుని పుక్కిలిస్తున్నట్టయితే దంతాలు, చిగుళ్ల సమస్యలన్నీ తొలగిపోతాయి.
4. నోటిలో పేరుకుపోయిన చెడు బాక్టీరియాను నిర్మూలించడంలో యూకలిప్టస్ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉన్నాయి. ఇది చిగుళ్ల సమస్యను తగ్గిస్తుంది. కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్‌ను తీసుకుని కొంత నీటిలో వేసి బాగా కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని బాగా పుక్కిలించాలి. రోజూ ఇలా చేస్తే త్వరలోనే దంతాలు, చిగుళ్ల సమస్యలు పోతాయి.
0 comments:
Post a Comment