Breaking News
Loading...

Info Post

andariki-ayurvedam-fennel-seeds

నాటి జంక్ ఫుడ్ యుగంలో మ‌నం మానేశాం కానీ, ఒక‌ప్పుడంటే చాలా మంది భోజ‌నం చేశాక సోంపు తినేవారు. దీంతో వారు అనేక అనారోగ్యాల నుంచి దూరంగా కూడా ఉన్నారు. అయితే ఇప్పుడీ అల‌వాటు చాలా మందికి లేదు. కానీ నిత్యం భోజ‌నం చేశాక ఒక టీస్పూన్ మోతాదులో సోంపును తింటే దాంతో మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


జీర్ణాశ‌య స‌మ‌స్య‌ల‌కు…
అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌ల‌తో నేటి త‌రుణంలో చాలా మంది ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ క్రమంలో అలాంటి స‌మ‌స్య‌లు ఉన్నవారు భోజ‌నం చేసిన వెంట‌నే 1 టీస్పూన్ సోంపు గింజ‌ల‌ను తింటే దాని వ‌ల్ల జీర్ణాశ‌య స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోతాయి. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.

అధిక బ‌రువుకు…
వాత దోషాల‌ను హ‌రించే గుణం ఉన్నందున సోంపుతో అధిక బ‌రువు స‌మ‌స్య ఇట్టే తొల‌గిపోతుంది. ఎందుకంటే భోజ‌నం చేశాక సోంపు తిన‌డం వ‌ల్ల ఒంట్లో ఉన్న నీరంతా బ‌య‌టికి పోతుంది. త‌ద్వారా బ‌రువు త‌గ్గుతారు.

దంత సమ‌స్య‌ల‌కు…
భోజ‌నం చేసిన వెంట‌నే సోంపును తింటే దాంతో నోరు తాజాగా మారుతుంది. నోటిలో ఉండే బాక్టీరియా, ఇత‌ర క్రిములు న‌శించ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ క్ర‌మంలో దంతాలు, చిగుళ్లు శుభ్రంగా మారుతాయి. వాటిలో ఉన్న స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోతాయి.

రుతు స‌మ‌స్య‌ల‌కు...
రుతుస్రావం అయ్యే స‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు నొప్పి ఉండ‌డం స‌హ‌జ‌మే. అయితే అలాంటి వారు భోజ‌నం చేసిన వెంట‌నే కొన్ని సోంపు గింజ‌ల‌ను తింటే దాంతో రుతుక్ర‌మ నొప్పి త‌గ్గుతుంది. ఇత‌ర రుతు సంబంధ స‌మ‌స్య‌లు కూడా త‌గ్గిపోతాయి.

క్యాన్స‌ర్‌…
సోంపులో మాంగ‌నీస్, జింక్‌, కాప‌ర్‌, ఐర‌న్‌, కాల్షియం, పొటాషియం, సెలీనియం, మెగ్నిష‌యం వంటి ఖ‌నిజ ల‌వణాలు ఎన్నో ఉన్నాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. దీంతో ప‌లు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా అడ్డుకోవ‌చ్చు. శ‌రీరంలో జ‌రిగే ఫ్రీ ర్యాడిక‌ల్స్ న‌ష్టాన్ని నివారించ‌వ‌చ్చు.

ర‌క్త‌హీన‌త‌కు…
ఐర‌న్‌, కాపర్ వంటి పోష‌కాలు ఉండ‌డం వ‌ల్ల సోంపు గింజ‌ల‌తో ర‌క్తం బాగా ప‌డుతుంది. ఇది ర‌క్త‌హీన‌త ఉన్న వారికి మేలు చేస్తుంది. ఎర్ర ర‌క్త క‌ణాల‌ను ఎక్కువ‌గా త‌యారు చేసేలా చూస్తుంది. గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఇది ఎంత‌గానో మేలు చేసే అంశం.

మ‌ధుమేహానికి…
మ‌ధుమేహం ఉన్న వారు భోజ‌నం చేసిన వెంట‌నే సోంపును తింటే దాని వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. సోంపు గింజ‌లు ఇన్సులిన్ సెన్సిటీవిటీని పెంచుతాయి. కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి. మెట‌బాలిజం ప్ర‌క్రియ‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తాయి. ఇది బ‌రువు త‌గ్గేందుకు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.

బీపీ, గుండె స‌మ‌స్య‌ల‌కు…
పొటాషియం అధికంగా ఉండ‌డం వ‌ల్ల సోంపు గింజ‌లు బీపీని నియంత్రిస్తాయి. గుండె సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా చూస్తాయి. ర‌క్త‌నాళాలు వెడ‌ల్పుగా మారేందుకు స‌హ‌క‌రిస్తాయి. దీంతో ర‌క్త‌నాళాల్లో కొవ్వు కూడా చేర‌కుండా ఉంటుంది.

చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు…
సోంపు గింజ‌ల్లో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఇవి చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాయి. వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా వ‌చ్చే ముడ‌త‌లు త‌గ్గిపోతాయి. చ‌ర్మం మృదువుగా మారుతుంది.

0 comments:

Post a Comment