ఉసిరి కాయల్లో, తేనెలో ఎంతటి పోషకాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ వంటి గుణాలతోపాటు శరీర వ్యాధినిరోధక వ్యవస్థను పటిష్టం చేసే ఎన్నో గుణాలు ఈ రెండింటిలోనూ ఉన్నాయి. అయితే వీటిని కలిపి మిశ్రమంగా తీసుకుంటే మనకు కలిగే పలు అనారోగ్య సమస్యలను సులభంగా దూరం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక టేబుల్ స్పూన్ ఉసిరికాయ జ్యూస్‌లో ఒక టీస్పూన్ తేనెను కలిపి ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. దీంతో కింద చెప్పిన పలు అనారోగ్యాలు దూరమవుతాయి.
1. పైన చెప్పిన ఉసిరి జ్యూస్, తేనె మిశ్రమం వల్ల ఊపిరితిత్తుల్లో ఉండే బాక్టీరియా పోతుంది.
2. జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరం త్వరగా తగ్గుతుంది. వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది.
3. జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. అసిడిటీ, గ్యాస్, అజీర్ణం వంటివి తగ్గిపోతాయి. మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది.
4. సైనస్, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
5. దృష్టి సంబంధ సమస్యలు దూరమవుతాయి. జుట్టుకు మేలు జరుగుతుంది. వెంట్రుకలు దృఢంగా పెరుగుతాయి.
6. చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మానికి మృదుత్వం చేకూరుతుంది.
0 comments:
Post a Comment