Breaking News
Loading...

Info Post

andariki-ayurvedam-cold

లంఖణం దివ్యౌషధం జ్వరానికి.. జలుబు చేస్తే మాత్రం ఇందుకు విరుద్ధంగా ఎక్కువ పోషకాలు కలిగిన పానీయాలు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయట. నీళ్లు, డీకాఫీనేటెడ్ టీ, తాజా పండ్ల రసాలు, నిమ్మకాయ, అల్లం రసం కలిపిన వేడి నీరు తరచుగా తీసుకోవాలి. ఎందుకంటే జలుబు వైరస్ వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్. వైరస్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. చికెన్‌లో సిస్టీన్ అనే ఆమైనో ఆసిడ్ ఉంటుంది. ఇది మ్యూకస్ డైల్యూట్ కావడానికి తోడ్పడుతుంది. మసాలాలు ఎక్కువగా కలిగిన ఆహారం వల్ల ముక్కుమూసుకు పోయే సమస్య నుంచి బయటపడొచ్చు. కాబట్టి జలుబు వంక పెట్టుకొని స్పైసీగా ఉండే చికెన్ లాగించేయ్యొచ్చని కొత్త పరిశోధన సారాంశం.
మన శరీరానికి సహజంగానే అనారోగ్యం నుంచి కోలుకోవడానికి కావల్సిన మెకానిజమ్స్ ఉంటాయి. అందుకే జ్వరం వచ్చిన వారికి తిండి సహించదు. నోరు చేదుగా మారిపోతుంది. శరీరం అందించే ఇలాంటి సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని పరిశోధనలు సైతం రుజువు చేస్తున్నాయి. జ్వరంగా ఉన్నపుడు గ్లూకోజ్ ఎక్కువగా ఉండే స్వీట్స్ వంటి పదార్థాలు అస్సలు తీసుకోకూడదు. శుభ్రమైన మంచి నీళ్లు వీలైనంత ఎక్కువగా తాగాలి. కేవలం ప్రొటీన్, కొవ్వు కలిగిన పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. వీలైనంత వరకు పెరుగు, తాజా పండ్ల వంటి ప్రోబయోటిక్స్ మాత్రమే తీసుకుంటే మరీ మంచిది. 

0 comments:

Post a Comment