మీరు బరువు తగ్గాలని అనుకుంటున్నారా? అయితే ఇక వెచ్చగా పడుకోవడం మానేయండి అని చెబుతున్నారు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్ ఆష్లే గ్రోస్‌మ్యాన్. నిద్రకు ఉపక్రమించే ముందు పడకగది కిటికి తెరచి పెట్టి పడుకుంటే గది చల్లగా మారుతుంది. చల్లగా ఉండడం వల్ల కొవ్వు దానంతటదే కరిగిపోతుందట.
మన శరీరంలో రెండు రకాల కొవ్వు ఉంటుంది. ఎక్కువ సమస్యగా అనిపించే తెల్లని కొవ్వులో ఎక్కువ కెలరీలు నిలువ ఉంటాయి. ఈ రకమైన కొవ్వు పొట్ట, నడుము, తొడల వంటి భాగాల్లో నిల్వ ఉంటుంది. అది కాక గోధుమ రంగులో ఉండే ఆరోగ్యవంతమైన కొవ్వు కూడా మన శరీరంలో ఉంటుంది. ఇది కరిగి కెలరీలు తగ్గిస్తుంది. శరీరంలో వేడి పుట్టిస్తుంది. అదృష్టవశాత్తు శరీరానికి అవసరమున్నపుడు తెల్లని కొవ్వు కూడా గోధుమరంగు కొవ్వుగా మారుతుంది. అంటే చల్లని వాతావరణంలో తెల్లని కొవ్వు గోధుమ రంగులోకి మారి శరీరపు ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచి వేడిపుట్టిస్తుంది. అందుకోసం కొంత కొవ్వు కరిగి శరీరంలో వేడి పుడుతుంది. అందుకు కొన్ని కెలరీల శక్తి కూడా వినియోగం అవుతుంది కాబట్టి ఎలాంటి ప్రయత్నం లేకుండానే కొంత బరువుతగ్గొచ్చు అనేది ఆష్లే పరిశోధనా సారాంశం.
అన్ని మూసిన వెచ్చని గదిలో కాకుండా కిటికీలు తెరచిన చల్లని గదిలో పడుకొని శరీర బరువు నియంత్రణలో ఉంచుకోవచ్చన్న మాట.
0 comments:
Post a Comment