సైనస్ సమస్య బాధిస్తుంటే..?


andariki-ayurvedam-sinus

సైనస్... వాతావ‌ర‌ణం మారిన‌ప్పుడ‌ల్లా చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ప్ర‌ధానంగా చ‌లికాలంలో, చ‌లిగా ఉన్న వాతావ‌ర‌ణంలో సైన‌స్ ఇంకా ముప్పు తిప్ప‌లు పెడుతుంది. త‌ల‌నొప్పి ఎక్కువ‌గా ఉండ‌డం, క‌ళ్ల ద‌గ్గ‌ర దుర‌ద‌గా ఉండ‌డం, ముక్కుకు ఇరువైపులా ప‌ట్టుకుంటే నొప్పి… ఇవ‌న్నీ సైన‌స్ ల‌క్ష‌ణాలు. అయితే కింద ఇచ్చిన కొన్ని టిప్స్‌ను పాటిస్తే సైన‌స్ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. అవేమిటంటే... 

1. నిత్యం మ‌నం తినే ఆహారంలో కారం పొడిని ఎక్కువ‌గా వాడాలి. దీని వ‌ల్ల ముక్కు నుంచి ఎక్కువ‌గా నీరు రాకుండా ఉంటుంది. సైన‌స్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 

2. సైనస్ స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో వెల్లుల్లి కూడా బాగానే ఉప‌యోగ‌ప‌డుతుంది. దీంట్లో యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉన్నాయి. రోజుకు 2, 3 వెల్లుల్లి రేకుల్ని తింటున్నా సైన‌స్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. 

3. ఒక టీస్పూన్ వాము తీసుకుని నూనె లేకుండా పెనం మీద కొద్దిగా వేయించాలి. దాన్ని బాగా న‌లిపి ఒక శుభ్ర‌మైన వ‌స్త్రంలో పెట్టి బాగా వాస‌న పీల్చాలి. దీంతో ముక్కు లోపలి రంధ్రాలు బాగా తెరుచుకుంటాయి. ఈ క్ర‌మంలో త‌ల‌నొప్పి త‌గ్గిపోతుంది. సైన‌స్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 

4. ప్రాణాయామం వంటి శ్వాస‌క్రియ వ్యాయామాల‌ను చేసిన‌ట్టియ‌తే సైన‌స్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 

5. ఒక టీస్పూన్ జీల‌క‌ర్ర‌ను బాగా వేయించి పొడి చేయాలి. దాంట్లో రెండు టీస్పూన్ల తేనె క‌లిపి రోజుకు 2 సార్లు తీసుకుంటే సైన‌స్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 

6. క్యారెట్ జ్యూస్ 300 ఎంఎల్‌, పాల‌కూర ర‌సం 200 ఎంఎల్ మోతాదులో తీసుకుని రోజుకు ఒక సారి తాగాలి. దీని వ‌ల్ల సైన‌స్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. 

7. ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని బాగా మరిగించాలి. దాంట్లో కొన్ని చుక్క‌ల యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ వేసి ఆ నీటి నుంచి వ‌చ్చే ఆవిరిని పీల్చాలి. దీంతో ముక్కులోని రంధ్రాలు తెరుచుకుని గాలి బాగా ఆడుతుంది. స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 

8. విట‌మిస్ సి ఎక్కువ‌గా ఉండే నిమ్మ‌, ఉసిరి, కివీ పండ్లను త‌ర‌చూ తీసుకుంటుంటే సైన‌స్ నుంచి విముక్తి పొంద‌వచ్చు. 

9. ట‌మాటా ర‌సంతో చేసిన టీ తాగుతున్నా సైన‌స్ త‌గ్గిపోతుంది.

అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను మ‌టుమాయం చేసే నువ్వుల నూనె...


andariki-ayurvedam-sesame-oil

ప్పుడంటే అన్నీ రిఫైన్డ్ నూనెలు వచ్చాయి కానీ ఒక‌ప్పుడు మ‌న వాళ్లు గానుగ‌ల్లో ఆడించిన నూనెల‌నే ఎక్కువ‌గా వాడేవారు. అలాంటి నూనెల్లో నువ్వుల నూనె కూడా ఒక‌టి. తెల్ల‌నివి, న‌ల్ల‌నివి అని రెండు ర‌కాలుగా ఈ నువ్వులు ఉంటాయి. వీటి నుంచి తీసే నూనెలో ఎన్నో ర‌కాల పోష‌క ప‌దార్థాలు ఉంటాయి. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన విట‌మిన్ ఇ, కాల్షియం, జింక్‌, ఐర‌న్‌, థ‌యామిన్, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు నువ్వుల నూనెలో మ‌న‌కు పుష్క‌లంగా ల‌భిస్తాయి. ఈ క్ర‌మంలో నువ్వుల నూనెను నిత్యం మ‌న ఆహారంలో భాగం చేసుకుంటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

1. నువ్వుల నూనెలో విట‌మిన్ ఇ, బిలు పుష్క‌లంగా ఉన్నాయి. ఇవి చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డ‌మే కాదు, అన్ని ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తాయి. నువ్వుల నూనెను త‌ర‌చూ వాడ‌డం వ‌ల్ల ముఖం కాంతివంత‌మ‌వుతుంది. చ‌ర్మం మృదువుగా మారుతుంది. 

2. నిత్యం స్నానం చేసే ముందు చిన్న పిల్ల‌ల‌కు నువ్వుల నూనెతో మ‌ర్ద‌నా చేస్తే వారి శ‌రీరం బాగా ఎదుగుతుంది. మెద‌డు ప‌దునుగా మారుతుంది. చిన్నారుల్లో ఉండే కొవ్వు క‌రిగిపోతుంది. ఈ నూనెలో ఉండే పోష‌కాల‌న్నీ పిల్ల‌ల‌కు ల‌భిస్తాయి. అయితే పెద్ద‌లు కూడా స్నానానికి ముందు నువ్వుల నూనెతో మ‌ర్ద‌నా చేసుకోవ‌చ్చు. 

3. నువ్వుల నూనెలో ఒమెగా-3,6 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి బీపీని త‌గ్గిస్తాయి. శ‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ నిల్వ‌ల‌ను త‌గ్గిస్తాయి. 

4. కాప‌ర్‌, ఇత‌ర ప‌వ‌ర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు నువ్వుల నూనెలో ఉంటాయి. దీంతో ఇవి కీళ్ల నొప్పుల‌ను త‌గ్గిస్తాయి. కొద్దిగా నువ్వుల నూనెను తీసుకుని కొంచెం వేడి చేసి మోకాళ్ల‌పై రాసుకుంటే నొప్పులు, వాపులు త‌గ్గిపోతాయి. 

5. పైన చెప్పిన విధంగా నువ్వుల నూనెను శ‌రీరంపై కొవ్వు ఉన్న ప్రాంతాల్లో రాస్తే అధికంగా ఉన్న కొవ్వు క‌రిగిపోతుంది. 

6. నువ్వుల నూనెలో ఉండే పోష‌కాలు ఎముక‌ల‌కు దృఢ‌త్వాన్ని ఇస్తాయి. ర‌క్త‌నాళాల‌ను శుభ్రం చేస్తాయి. శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తాయి. 

7. మ‌ధుమేహ వ్యాధి గ్ర‌స్తులు నిత్యం 2 టేబుల్ స్పూన్ల మోతాదులో నువ్వుల నూనెను ఏవిధంగానైనా తీసుకుంటే వారి శ‌రీరంలోని ర‌క్తంలో ఉండే చ‌క్కెర స్థాయిలు త‌గ్గుముఖం ప‌డ‌తాయి. దీని వ‌ల్ల షుగ‌ర్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. 

8. నువ్వుల నూనెతో త‌ల‌కు మ‌ర్ద‌నా చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది. వెంట్రుక‌లు రాల‌డం త‌గ్గుతుంది. చుండ్రు స‌మ‌స్య పోతుంది.

ఉద‌యాన్నే వెల్లుల్లి, తేనె మిశ్ర‌మం తీసుకుంటే..?


andariki-ayurvedam-honey-garlic-mix

వెల్లుల్లిని నిత్యం మ‌నం వంట‌ల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటాం. అదేవిధంగా తేనెను కూడా ప‌లు ర‌కాల స‌లాడ్స్‌లో, టీ, కాఫీ, పాలు వంటి డ్రింక్స్‌లో కొంద‌రు తీసుకుంటారు. అయితే ఈ రెండింటిలోనూ మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో ర‌కాల పోష‌కాలు సమృద్ధిగా ఉన్నాయి, కాబ‌ట్టి ఈ రెండింటినీ క‌లిపి ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తీసుకుంటే దాంతో మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

కొన్ని వెల్లుల్లి రేకుల్ని తీసుకుని బాగా న‌లిపి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దీంతో వాటిలో ఉండే పోష‌కాలు రెట్టింపు అవుతాయి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని తేనెతో క‌లిపి ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తీసుకోవాలి. ఇలా చేస్తే ఏయే లాభాలు క‌లుగుతాయంటే... 

1. వెల్లుల్లి, తేనెల‌ను క‌లిపి మిశ్ర‌మంగా చేసి ఉద‌యాన్నే ప‌ర‌గడుపున తీసుకుంటే శ‌రీరంలో వ్యాధి నిరోధ‌క శ్య‌క్తి పెరుగుతుంది. ఎలాంటి ఇన్‌ఫెక్ష‌న్ల‌నైనా త‌ట్టుకునే శ‌క్తి వ‌స్తుంది. దీంతోపాటు ఈ రెండింటిలో ఉండే ప‌వ‌ర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు శ‌రీరంలోని ఫ్రీ ర్యాడిక‌ల్స్ ప్ర‌భావాన్ని త‌గ్గిస్తాయి. దీంతో చ‌ర్మంపై ముడ‌త‌లు త‌గ్గుతాయి. 

2. వెల్లుల్లి, తేనె మిశ్రమం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చూస్తుంది. ఆయా ప్రాంతాల్లో పేరుకుపోయే కొవ్వును కూడా తొలగిస్తుంది. దీంతో వివిధ రకాల గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.

3. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా వెల్లుల్లి, తేనె మిశ్రమంలో ఉన్నాయి. దీంతో ఇది శరీరంలో ఏర్పడే నొప్పులు, వాపులను తగ్గిస్తుంది. గొంతు నొప్పి, మంట వంటివి తగ్గిపోతాయి.

4. జీర్ణాశయ సంబంధ సమస్యలు దూరమవుతాయి. డయేరియా, అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను నయం చేసుకోవచ్చు. పెద్ద పేగులో ఏర్పడే ఇన్‌ఫెక్షన్లకు అడ్డుకట్ట వేయవచ్చు.

5. జలుబు, ఫ్లూ జ్వరం, సైనస్ వంటి అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు తగ్గిపోతాయి.

6. శరీరంలోని విష పదార్థాలను, క్రిములను బయటకి పంపే శక్తి ఈ మిశ్రమానికి ఉంది. ఆర్యోగానికి పూర్తి సంరక్షణను ఇస్తుంది.

7. దెబ్బలు, కాలిన గాయాలు, పుండ్లు వంటివి వెంటనే తగ్గిపోతాయి. శ్వాస కోశ సమస్యలతో బాధ పడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది.

8. శరీరంలోని అవయవాల పనితీరు మెరుగు పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది.

ఈ లాభాలు తెలిస్తే శ‌న‌గ‌ల‌ను అస్స‌లు వ‌ద‌ల‌రు..!


andariki-ayurvedam-chana

పొట్టు తీసిన శ‌న‌గ‌పప్పును మ‌నం అనేక వంట‌కాల్లో వాడుతుంటాం. కానీ పొట్టు తీయ‌కుండానే ల‌భించే శ‌న‌గ‌ల‌ను లేదా లావుగా ఉండే మ‌రో ర‌క‌మైన కాబూలీ శ‌న‌గ‌ల‌ను తింటే మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా ఈ శ‌న‌గ‌ల‌ను నాన‌బెట్టి లేదా ఉడ‌క‌బెట్టి లేదంటే మొల‌కల రూపంలో నిత్యం తీసుకుంటే దాంతో ఎన్నో లాభాలు క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా దూర‌మ‌వుతాయి. ఈ క్ర‌మంలో శ‌న‌గ‌ల వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఉప‌యోగాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

1. శ‌న‌గ‌ల్లో పీచు ప‌దార్థం ఎక్కువ‌గా ఉంటుంది. ఇది శ‌రీరంలో ఉన్న కొలెస్ట్రాల్‌ను త‌గ్గించి వేస్తుంది. దీంతో గుండె సంబంధ స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు.

2. నాన్‌వెజ్ తిన‌లేని వారికి శ‌న‌గ‌ల‌ను ఒక వ‌ర‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే మాంసంలో ఉండే ప్రోటీన్ల‌న్నీ శ‌న‌గ‌ల‌లో లభిస్తాయి.

3. పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం వంటి ఎన్నో ర‌కాల మిన‌ర‌ల్స్ శ‌న‌గల్లో ఉంటాయి. ఇవి బీపీని కంట్రోల్ చేస్తాయి. ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌కుండా చేస్తాయి. దీంతో బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి శ‌న‌గ‌లు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

4. శ‌న‌గ‌ల‌ను త‌ర‌చూ తింటుంటే ర‌క్తంలో ఎర్ర ర‌క్త క‌ణాల సంఖ్య పెరుగుతుంది. దీంతో ర‌క్తం బాగా ప‌డుతుంది. ఇది ర‌క్త‌హీన‌త ఉన్న వారికి ఎంత‌గానో మేలు చేస్తుంది.

5. శ‌న‌గ‌ల్లో అమైనో యాసిడ్లు, ట్రిప్టోఫాన్‌, సెరొటోనిన్ వంటి ఉప‌యోగ‌క‌ర‌మైన పోష‌కాలు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి చ‌క్క‌గా నిద్ర ప‌ట్టేలా చేస్తాయి. దీంతో నిద్ర‌లేమి దూర‌మ‌వుతుంది. అంతేకాదు ఒత్తిడి, ఆందోళ‌న వంటివి కూడా త‌గ్గిపోతాయి.

6. శ‌న‌గ‌ల్లో ఆల్ఫా లినోలినిక్ యాసిడ్‌, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను త‌గ్గించ‌డంతోపాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి.

7. ఐర‌న్‌, ప్రోటీన్లు, మిన‌ర‌ల్స్‌స‌మృద్ధిగా ఉండ‌డం వ‌ల్ల శ‌న‌గ‌లు శరీరానికి మంచి శ‌క్తిని ఇస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు బాగా ఉండ‌డం వ‌ల్ల రోగ నిరోధక వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది.

8. పాల‌లో ఉండే కాల్షియంకు దాదాపు స‌మానమైన కాల్షియం శ‌న‌గ‌ల్లో ల‌భిస్తుంది. దీంతో ఎముక‌లు దృఢంగా మారుతాయి. ఎముక‌లకు పుష్టి క‌లుగుతుంది.

9. పాస్ఫ‌ర‌స్ ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎక్కువ‌గా ఉన్న ఉప్పును బ‌య‌టికి పంపుతుంది. కిడ్నీల ప‌నితనం మెరుగు ప‌డుతుంది. ప‌చ్చ కామెర్లు ఉన్న వారు శ‌న‌గ‌ల‌ను తింటే త్వ‌ర‌గా కోలుకుంటారు.

10. మాంగ‌నీస్‌, పాస్ఫ‌ర‌స్ స‌మృద్ధిగా ఉండ‌డం వ‌ల్ల చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. దుర‌ద‌, గ‌జ్జి వంటి వాటి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

డెంగీతో... జ‌ర జాగ్ర‌త్త‌..!


andariki-ayurvedam-dengue-sympotms

డెంగీ... ఇప్పుడు మ‌న ద‌గ్గ‌ర ఎక్క‌డ చూసినా దీని బారిన ప‌డి చాలా మంది హాస్పిట‌ల్స్‌కు ప‌రుగులు పెడుతున్నారు. కొంద‌రు జ్వ‌రం రాగానే రక్త ప‌రీక్ష‌లు చేయించుకుని డెంగీ అని తేలితే వెంట‌నే చికిత్స తీసుకుంటున్నారు. కాగా ఇంకొంద‌రిలో మాత్రం వ్యాధి వ‌చ్చిన 5, 6 రోజుల వ‌ర‌కు గానీ జ్వ‌రం, ఇత‌ర ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డం లేదు. ఈ క్ర‌మంలో అలాంటి వారిలో కొంద‌రు ప్లేట్‌లెట్ల‌ను బాగా కోల్పోతుండ‌డంతో వారు ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. కొన్ని చోట్ల డెంగీతో మృతి చెందిన‌వారి వార్త‌ల‌ను కూడా వింటున్నాం. క‌నుక ఏ చిన్న అనారోగ్య సూచ‌న, ల‌క్ష‌ణం క‌నిపించినా అశ్ర‌ద్ధ చేయ‌కుండా వెంట‌నే త‌గిన జాగ్ర‌త్త తీసుకుని వైద్యుని వ‌ద్ద‌కు వెళ్ల‌డం ఉత్త‌మం. ఈ క్ర‌మంలో అస‌లు డెంగీ ఎలా వ‌స్తుంది, దాని దోమ‌లు ఎలా ఉంటాయి, అవి ఎక్క‌డ‌, ఎలా పెరుగుతాయి, డెంగీ వ‌చ్చాక క‌నిపించే ల‌క్ష‌ణాలు, ఆ వ్యాధి ప‌ట్ల మ‌నం తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను గురించి ఇప్పుడు మ‌నం వివ‌రంగా తెలుసుకుందాం. 

నాలుగు ర‌కాల వైర‌స్‌ల‌తో డెంగీ వ్యాప్తి...
డీఈఎన్‌వీ 1,2,3,4 అనే నాలుగు ర‌కాల వైర‌స్‌ల వ‌ల్ల డెంగీ వ్యాప్తి చెందుతుంది. ఈ వైర‌స్ ఉన్న వ్య‌క్తిని AEDES అనే పేరున్న దోమ కుడితే అప్పుడు ఆ వైర‌స్ స‌ద‌రు దోమ‌లోకి ప్ర‌వేశిస్తుంది. కానీ వారం రోజుల వ‌ర‌కు ఆ దోమ‌లో వైర‌స్ ప్ర‌భావం ఉండ‌దు. అనంత‌రం వైర‌స్ వృద్ధి చెందుతుంది. అప్పుడు ఆ వైర‌స్‌తో ఇన్‌ఫెక్ట్ అయిన‌ దోమ‌లు మ‌ళ్లీ ఎవ‌రినైనా కుడితే వారికి డెంగీ వ‌స్తుంది. 

andariki-ayurvedam-dengue-source


నీరు ఎక్కువ‌గా నిల్వ ఉన్న చోటే...
ఈ AEDES దోమ‌లు నీరు ఎక్కువ‌గా ఉన్న‌చోటే గుడ్ల‌ను పెట్టి త‌మ సంతానాన్ని వృద్ధి చెందిస్తాయి. వీటిలో కేవ‌లం ఆడ‌దోమ‌లు మాత్ర‌మే మ‌న‌ల్ని కుడ‌తాయి. ఎందుకంటే వాటికి గుడ్లు త‌యారు అయ్యేందుకు త‌గిన ప్రోటీన్ అవ‌స‌రం. అందుకు అవి మ‌నిషి ర‌క్తం మీద ఆధార ప‌డ‌తాయి. అందుకే మ‌నల్ని అవి కుడ‌తాయి. అలా మ‌న‌ల్ని కుట్టి పీల్చిన ర‌క్తంతో AEDES ఆడ‌దోమ‌లు గుడ్ల‌ను ఉత్ప‌న్నం చేసి నీరు ఎక్కువ‌గా నిల్వ ఉన్న చోట వాటిని పెడ‌తాయి. ఆ నీటిలో ఉన్న గుడ్లు 8 రోజుల త‌రువాత పిల్ల‌లుగా మారుతాయి. అయితే AEDES దోమ‌ల గుడ్లు ఎంత‌టి ఉష్ణోగ్ర‌త‌ల‌నైనా త‌ట్టుకుని కొన్ని నెల‌ల పాటు అలాగే ఉంటాయి. మ‌ళ్లీ నీరు వాటి వ‌ద్ద‌కు రాగానే అప్పుడ‌వి పిల్ల‌లుగా మారుతాయి. అందుకే వ‌ర్షాకాలంలో ఎక్కువ‌గా ఇవి ఉత్ప‌న్నం అవుతాయి. ఆ స‌మ‌యంలోనే రోగాల‌ను వ్యాప్తి చెందిస్తాయి. 

సైలెంట్‌గా వ‌చ్చి కుట్టే టైగ‌ర్ దోమ‌లు...
AEDES జాతికి చెందిన ఆడ‌దోమ‌లు సైలెంట్‌గా వ‌చ్చి కుడ‌తాయి. వీటిని టైగ‌ర్ దోమ‌ల‌ని కూడా పిలుస్తారు. ఈ దోమ‌ల జీవితం కాలం దాదాపుగా 2 వారాలు. ఆ స‌మ‌యంలోనే ఒక్కో దోమ 3 సార్లు 100 గుడ్ల చొప్పున పెడుతుంది. అలా పెట్ట‌బ‌డిన గుడ్లు పిల్ల‌లుగా మారుతాయి. వాటిలోనూ డెంగీ వైర‌స్ ఉంటుంది. ఆ వైర‌స్ వాటిలో వాటి జీవిత కాలం వ‌ర‌కు అలాగే ఉంటుంది. ఈ క్ర‌మంలో ఆ దోమ‌లు కూడా గుడ్లు పెట్టి మ‌ళ్లీ పిల్ల‌ల్ని ఉత్ప‌త్తి చేస్తే వాటిలోనూ డెంగీ ఉంటుంది. అలా ఆ వైర‌స్ వాటిలో ఎప్ప‌టికీ నిరంత‌రాయంగా తిరుగుతూనే ఉంటుంది. 

డెంగీ దోమ‌లు ప‌గ‌లే ఎక్కువ‌గా కుడ‌తాయి...
తెల్ల‌వారు జామున సూర్యోద‌యం జ‌రిగేట‌ప్పుడు, సాయంత్రం సూర్యుడు అస్త‌మించేట‌ప్పుడు దాదాపు 2 గంట‌ల స‌మ‌యం పాటు ఈ దోమలు ఎక్కువ‌గా దాడి చేస్తాయి. ప‌గ‌టి పూట కూడా ఇవి కుడ‌తాయి. అన్ని దోమ‌ల్లా కాకుండా డెంగీ దోమ‌లు మ‌న శ‌రీరం కింది భాగంలో ఎక్కువ‌గా కుడ‌తాయి. ఈ దోమ‌లు తాము ఉన్న ప్ర‌దేశాల నుంచి సుమారు 400 మీట‌ర్ల దూరం వ‌ర‌కు మాత్ర‌మే వెళ్తాయి. అందుకే ఆ ప‌రిధిలో నీరు నిల్వ ఉండే ప్రాంతాలను త‌ర‌చూ శుభ్రం చేసుకోవాలి. ఈ దోమ‌లు చీక‌టి ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో నివాసం ఉంటాయి. దుస్తుల‌ను త‌గిలించే హ్యాంగ‌ర్ల వెనుక‌, క‌ప్‌బోర్డులు, మంచాల కింద‌, క‌ర్టెన్ల ద‌గ్గ‌ర ఈ దోమ‌లు ఉండేందుకు అవ‌కాశం ఉంది. కేవ‌లం ఒక‌టి రెండు డెంగీ దోమ‌లు ప‌రిస‌రాల్లో ఉన్నా పెద్ద ఎత్తున డెంగీ విష జ్వ‌రాల‌ను ప్ర‌బ‌లించేందుకు ఆస్కారం ఉంటుంది. 

andariki-ayurvedam-dengue-mosquito


శ‌రీరం, కాళ్ల‌పై గీత‌ల‌తో...
AEDES జాతికి చెందిన దోమ‌లకు శ‌రీరం, కాళ్ల‌పై తెల్ల‌ని గీత‌లు ఉంటాయి. అయితే ఇదే జాతిలో AEDES AEGYPTI అనే మ‌రో దోమ కూడా ఉంది. ఇది కూడా చూసేందుకు AEDES దోమ‌లాగే ఉంటుంది. కానీ ఈ దోమ కుడితే మాత్రం డెంగీ, చికున్‌గున్యా రెండూ ఒకేసారి వ‌స్తాయి. అధిక శాతం మందిలో డెంగీ దోమ కుట్టిన త‌రువాత 5 నుంచి 6 రోజుల‌కు దాని ల‌క్ష‌ణాలు క‌నిపించి జ్వ‌రం వ‌స్తుంది. కానీ కొంద‌రిలో మాత్రం డెంగీ ల‌క్ష‌ణాలేవీ క‌న‌బ‌డ‌వు. అయినా వారు యాక్టివ్‌గానే ఉంటారు. అయితే వారిలోనూ ఒక్కోసారి కొన్నికొన్ని అనారోగ్య ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. క‌నుక వాటిని జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించ‌డం అవ‌స‌రం. 

డెంగీ ల‌క్ష‌ణాలు...
తీవ్ర‌మైన త‌ల‌నొప్పి, కంటి వెనుక భాగాల్లో నొప్పులు, కండ‌రాల నొప్పులు, కీళ్ల నొప్పులు, చ‌ర్మంపై దుర‌ద‌లు, ముక్కు లేదా చిగుళ్ల నుంచి ర‌క్తం కార‌డం, తీవ్ర‌మైన జ్వ‌రం, వాంతులు, క‌డుపులో నొప్పి, వికారంగా ఉండ‌డం వంటి ల‌క్ష‌ణాలు డెంగీలో క‌నిపిస్తాయి. అయితే ఇవే ల‌క్ష‌ణాలు అంద‌రిలో ఉండ‌క‌పోవ‌చ్చు కూడా. కొన్ని ల‌క్ష‌ణాలు లేకుండా కూడా డెంగీ ఉంటుంది. వీటిలో ఏ ల‌క్ష‌ణం కనిపించినా వెంట‌నే త‌గిన జాగ్ర‌త్త తీసుకోవ‌డం ఆవ‌శ్య‌కం. 

ప్లేట్‌లెట్లు కీల‌కం...
డెంగీ వ‌చ్చిన రోగుల్లో వైద్యులు రోజూ ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను ప‌రిశీలిస్తారు. సాధార‌ణంగా జ్వ‌రంతోపాటు ఇత‌ర ల‌క్ష‌ణాలు కూడా ఉంటే ప్లేట్‌లెట్ల సంఖ్య రోజూ త‌గ్గిపోతూనే ఉంటుంది. అదే అనారోగ్య లక్ష‌ణాలు క్ర‌మంగా త‌గ్గుతుంటే ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. ఈ క్రమంలో చాలా మంది డెంగీ పేషెంట్ల‌లో రోజుకు 10వేల నుంచి 30వేల వ‌ర‌కు ప్లేట్‌లెట్లు త‌గ్గుతుంటాయి. ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులకు ఒక మైక్రో లీట‌ర్ ర‌క్తానికి గాను 1.50 ల‌క్ష‌ల నుంచి 4.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ప్లేట్‌లెట్లు ఉండాలి. స‌హ‌జంగా ఇవి అంద‌రిలోనూ 2.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటాయి. కానీ డెంగీ వ‌చ్చాక రోజుకు 30వేల వ‌ర‌కు త‌గ్గే అవ‌కాశం ఉంటుంది. రోగ నిరోధ‌క శక్తి బాగా త‌క్కువ‌గా ఉన్న వారిలో, చిన్నారుల్లో, వృధ్దుల్లో ప్లేట్‌లెట్లు ఇంకా వేగంగా ప‌డిపోయేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే ప్లేట్‌లెట్ కౌంట్ 20వేల వ‌ర‌కు వ‌చ్చే వ‌ర‌కు వారికి బ‌య‌టి నుంచి ప్లేట్‌లెట్ల‌ను ఎక్కించాల్సిన అవ‌స‌రం లేదు. అంత‌కు త‌గ్గితేనే ప్లేట్‌లెట్ల‌ను ఎక్కించాల్సి ఉంటుంది. అయితే కొంద‌రిలో ప్లేట్‌లెట్ల 20వేల వ‌ర‌కు రాకున్నా వారికి ఉన్న అనారోగ్య ల‌క్ష‌ణాల తీవ్ర‌త‌ను బ‌ట్టి ప్లేట్‌లెట్ల‌ను ఎక్కించాల్సి వ‌స్తుంది. 

తీసుకోవాల్సిన జాగ్ర‌త్తలు...

డెంగీ రాకుండా ఉండేందుకు గాను మనం కొన్ని జాగ్ర‌త్త‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాలి. అవేంటంటే... 

1. శ‌రీరాన్ని పూర్తిగా క‌ప్పే దుస్తుల‌ను ధ‌రించాలి. దీని వ‌ల్ల దోమ‌ల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. డెంగీ దోమ‌లు ఎక్కువ‌గా శ‌రీరం కింది భాగంలో కుట్టేందుకు అవ‌కాశం ఉంటుంది కాబ‌ట్టి, ఆ భాగానికి ఇంకా ఎక్కువగా ర‌క్ష‌ణ క‌ల్పించాలి. 

2. డెంగీ దోమ‌లు ప‌గ‌టి పూట ఎక్కువ‌గా కుట్టేందుకు అవ‌కాశం ఉంటుంది క‌నుక‌, ప‌గ‌లు కూడా మ‌స్కిటో రీపెల్లెంట్‌లు, దోమ‌ల కాయిల్స్‌, దోమ తెర‌లు వంటి వాటిని వాడాలి. 

3. ప్ర‌ధానంగా చిన్నారులు, వృద్ధులు డెంగీ ప‌ట్ల ఎంతో అప్ర‌మ‌త్తంగా ఉండ‌డం అవ‌స‌రం. 

4. కిటికీలు, వెంటిలేట‌ర్లు తదిరాల‌కు మ‌స్కిటో నెట్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి. 

డెంగీ వ‌చ్చిన‌వారు ఈ సూచ‌న‌లు పాటిస్తే త్వ‌ర‌గా కోలుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. 

1. డెంగీ నుంచి పూర్తిగా కోలుకునేంత వ‌ర‌కు రోగుల‌కు పూర్తి బెడ్ రెస్ట్ అవ‌స‌రం. 

2. త‌డిగుడ్డ పెట్టి ఒళ్లంతా తుడ‌వ‌డం, నుదుటిపై పెట్ట‌డం వంటి ప‌నులు చేస్తే జ్వ‌ర తీవ్ర‌త త‌గ్గుతుంది. 

3. ఆస్పిరిన్‌, బ్రూఫిన్ వంటి మాత్ర‌ల‌ను వాడ‌కూడ‌దు. ఇవి గ్యాస్‌, క‌డుపులో నొప్పి, వాంతులు వంటి అనారోగ్యాల‌ను కలిగిస్తాయి. ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను కూడా త‌గ్గిస్తాయి. 

4. పారాసిట‌మాల్ సిరప్ గానీ, మాత్ర‌లు ఇవ్వ‌డం వ‌ల్ల జ్వరాన్ని అదుపులోకి తీసుకురావ‌చ్చు. చిన్న పిల్లలకైతే ప్రతి ఆరు గంటల కోసారి ఇవ్వాలి.

5. ఓఆర్ఎస్ లేదా సెలైన్ల ద్వారా ఎల‌క్ట్రోలైట్ల‌ను శ‌రీరంలోకి ఎక్కించాల్సి ఉంటుంది. 

6. వీలైనంత వ‌ర‌కు ద్ర‌వాహారం ఎక్కువగా తీసుకోవాలి. ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు, పండ్లు ఎక్కువ‌గా తినాలి. కొబ్బరి నీళ్లు, బత్తాయి రసం వంటి వాటిని ఎంత ఎక్కవగా ఇస్తే అంత మంచింది. త్వరగా జీర్ణమయి శరీరానికి సత్తువనిస్తాయి. 

7. దానిమ్మ‌, కివీ, బొప్పాయి, యాపిల్ వంటి పండ్ల‌ను ఎక్కువ‌గా తినాలి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తాయి. ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను పెంచుతాయి. 

8. డెంగీ నుంచి కోలుకున్నాక క‌నీసం నెల రోజుల వ‌ర‌కు శాఖాహారం తీసుకోవ‌డం ఉత్త‌మం. లేదంటే జ్వ‌రం మ‌ళ్లీ తిర‌గ‌బెట్టేందుకు అవ‌కాశం ఉంటుంది. 

సాధార‌ణంగా డెంగీ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డం ప్రారంభం అయినాక దాని తీవ్ర‌త 7 రోజుల వ‌ర‌కు ఉంటుంది. కొద్ది మందిలో ఇంకా ఎక్కువ రోజులే ఉండ‌వ‌చ్చు. అయితే ఆ స‌మ‌యంలో స్పందించి త‌గు చికిత్స తీసుకుని, జాగ్ర‌త్త‌లు పాటిస్తే డెంగీ నుంచి త్వ‌ర‌గా కోలుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ క్ర‌మంలో 3 నుంచి 5 రోజుల క‌న్నా ఎక్కువ‌గా జ్వరంతో బాధ‌ప‌డుతూ ఉండి, హాస్పిట‌ల్‌కు వెళ్ల‌క‌పోతే ప్లేట్‌లెట్లు గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయి ప్రాణాపాయ స్థితికి చేరుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక జ్వ‌రం అనిపించ‌గానే వైద్య చికిత్స తీసుకోవ‌డం మంచిది. దీని ప‌ట్ల నిర్ల‌క్ష్యం అస్స‌లు వ‌హించ‌కూడ‌దు.

జ‌లుబు, జ్వ‌రం త‌గ్గాలంటే.. ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవాలి...


andariki-ayurvedam-honey-amla

సిరి కాయ‌ల్లో, తేనెలో ఎంత‌టి పోష‌కాలు ఉంటాయో అంద‌రికీ తెలిసిందే. యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ వంటి గుణాల‌తోపాటు శ‌రీర వ్యాధినిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేసే ఎన్నో గుణాలు ఈ రెండింటిలోనూ ఉన్నాయి. అయితే వీటిని క‌లిపి మిశ్ర‌మంగా తీసుకుంటే మ‌న‌కు క‌లిగే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను సుల‌భంగా దూరం చేసుకోవ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఒక టేబుల్ స్పూన్ ఉసిరికాయ జ్యూస్‌లో ఒక టీస్పూన్ తేనెను క‌లిపి ప్రతి రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తీసుకోవాలి. దీంతో కింద చెప్పిన ప‌లు అనారోగ్యాలు దూర‌మ‌వుతాయి. 

1. పైన చెప్పిన ఉసిరి జ్యూస్‌, తేనె మిశ్ర‌మం వ‌ల్ల ఊపిరితిత్తుల్లో ఉండే బాక్టీరియా పోతుంది. 

2. జ‌లుబు, ద‌గ్గు, ఫ్లూ జ్వ‌రం త్వ‌ర‌గా త‌గ్గుతుంది. వ్యాధి నిరోధ‌క శ‌క్తి బాగా పెరుగుతుంది. 

3. జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. అసిడిటీ, గ్యాస్‌, అజీర్ణం వంటివి త‌గ్గిపోతాయి. మ‌లబ‌ద్ద‌కం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 

4. సైన‌స్‌, ఆస్త‌మా వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. 

5. దృష్టి సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. జుట్టుకు మేలు జ‌రుగుతుంది. వెంట్రుక‌లు దృఢంగా పెరుగుతాయి. 

6. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. చ‌ర్మానికి మృదుత్వం చేకూరుతుంది.

మొల‌కెత్తిన పెస‌ల‌తో కొలెస్ట్రాల్ దూరం..!


andariki-ayurvedam-mung-dal-sprouts

ప‌ప్పు ధాన్యాల జాతికి చెందిన పెస‌ల‌ను మ‌నం అప్పుడ‌ప్పుడూ పెస‌ర ప‌ప్పు రూపంలో వంట‌ల్లో ఉప‌యోగిస్తూనే ఉంటాం. పెస‌ర‌ప‌ప్పుతో ప‌లు కూర‌ల‌ను కూడా మ‌నం తింటుంటాం. అయితే ప‌ప్పే కాదు, పెస‌ల‌ను మొల‌కెత్తిన గింజ‌ల రూపంలో తింటుంటే ప‌ప్పు క‌న్నా ఇంకా ఎన్నో లాభాలు ఉంటాయి. ఆ లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

1. మొల‌కెత్తిన పెస‌ల‌లో డైట‌రీ ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది కొవ్వును క‌రిగించేందుకు, చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. 

2. మొల‌కెత్తిన పెస‌ల‌ను తింటే త్వ‌ర‌గా ఆక‌లి వేయ‌దు. దీంతో ఎక్కువ సేపు క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. త‌ద్వారా ఆహారాన్ని త‌గ్గించి బ‌రువు కూడా త‌గ్గ‌వ‌చ్చు. 

3. డైట‌రీ ఫైబ‌ర్ అధికంగా ఉన్న కార‌ణంగా ఇవి మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌ను పోగొడ‌తాయి. తిన్న‌ది స‌రిగ్గా జీర్ణం అయ్యేలా చూస్తాయి. 

4. శ‌రీరంలోని నొప్పులు, వాపుల‌ను త‌గ్గించే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఈ మొల‌కెత్తిన పెస‌ల‌లో ఉన్నాయి. 

5. విట‌మిన్ ఎ, బి, సి, డి, ఇ, కె, థ‌యామిన్‌, రైబోఫ్లేవిన్‌, ఫోలిక్ యాసిడ్‌, నియాసిన్‌, విట‌మిన్ బి6, ఫాంటోథెనిక్ యాసిడ్ వంటివి మొల‌కెత్తిన పెస‌లలో స‌మృద్ధిగా ల‌భిస్తాయి. కాబ‌ట్టి వీటిని ప‌రిపూర్ణ పౌష్టికాహారంగా చెప్ప‌వ‌చ్చు. 

6. మొల‌కెత్తిన పెస‌ల‌ను తీసుకోవడం వ‌ల్ల దృష్టి సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. ర‌క్త‌హీన‌త తొల‌గిపోతుంది. 

7. ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి. మ‌ధుమేహం ఉన్న వారికి మేలు జ‌రుగుతుంది. 

8. శ‌రీరంలో ఏర్ప‌డే ఇన్‌ఫెక్ష‌న్ల‌ను తొల‌గించే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తాయి. 

9. వృద్ధాప్య ఛాయ‌ల‌ను ద‌రిచేర‌నివ్వ‌వు. గ్యాస్‌, అసిడిటీ వంటి జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.

ఈ ఉప‌యోగాలు తెలిస్తే పెరుగును వదిలిపెట్ట‌రు..!


andariki-ayurvedam-curd-uses

చ‌క్క‌ని రుచి క‌లిగి ఉండే గ‌డ్డ పెరుగు అంటే చాలా మందికి ఇష్ట‌మే. కొంద‌రు భోజ‌నం చివ‌ర్లో పెరుగుతో తినంది అసలు తృప్తి చెంద‌రు. భోజనం అయిపోన‌ట్టుగానే భావిస్తారు. కానీ కొంత‌మందికి పెరుగు కాదు క‌దా, పాలు దాని సంబంధ ప‌దార్థాలు అస్స‌లు న‌చ్చ‌వు. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఉప‌యోగాల గురించి తెలిస్తే పెరుగంటే ఇష్టం లేని వారు కూడా దాన్ని వాడేందుకు ఆస‌క్తి చూపుతారు. ఎందుకంటే దాంతో అన్ని ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి మ‌రి. ఆ ప్ర‌యోజ‌నాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

1. కొద్దిగా జీల‌క‌ర్ర‌ను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో క‌లుపుకుని తింటే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు.

2. కొద్దిగా న‌ల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేయాలి. దాన్ని ఓ క‌ప్పు పెరుగులో క‌లుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. ప్ర‌ధానంగా గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌గ్గుతాయి.

3. కొద్దిగా పెరుగులో చ‌క్కెర క‌లుపుకుని తినాలి. దీంతో శ‌రీరానికి వెంట‌నే శ‌క్తి అందుతుంది. మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు కూడా పోతాయి.

4. కొంత వాము తీసుకుని ఓ క‌ప్పు పెరుగులో క‌లిపి తినాలి. దీని వ‌ల్ల నోటి పూత, దంతాల నొప్పి, ఇత‌ర దంత సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి.

5. ఓ క‌ప్పు పెరుగులో కొంత న‌ల్ల మిరియాల పొడిని క‌లిపి తినాలి. దీని వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం దూర‌మ‌వుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.

6. పెరుగులో కొన్ని ఓట్స్ క‌లిపి తినాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ప్రోబ‌యోటిక్స్‌, ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఇవి కండ‌రాల పుష్టికి దోహ‌దం చేస్తాయి.

7. పెరుగులో వివిధ ర‌కాల పండ్ల‌ను క‌లిపి తింటే శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది. ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు.

8. పెరుగులో కొంత ప‌సుపు, కొంత అల్లం క‌లిపి తినాలి. దీని వ‌ల్ల ఫోలిక్ యాసిడ్ శ‌ర‌రీంలోకి చేరుతుంది. ఇది చిన్నారుల‌కు, గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది.

9. పెరుగులో ఆరెంజ్ జ్యూస్ క‌లిపి తింటే శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ సి ల‌భిస్తుంది. ఇది కీళ్ల నొప్పుల‌ను త‌గ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయ‌ల‌ను దూరం చేస్తుంది.

10. పెరుగులో తేనె క‌లిపి తీసుకుంటే క‌డుపులో ఉన్న అల్స‌ర్లు మటుమాయ‌మైపోతాయి. ఈ మిశ్ర‌మం యాంటీ బయోటిక్‌గా ప‌నిచేస్తుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో ఉన్న ఇన్‌ఫెక్ష‌న్లు వెంట‌నే త‌గ్గుతాయి.

షుగ‌ర్‌, క్యాన్స‌ర్‌ల‌కు విరుగుడు ఆగాక‌ర‌..!


andariki-ayurvedam-spiny-gourd

గాక‌ర‌, ఆకాక‌ర‌, అడ‌వి కాక‌ర‌, బొంతు కాక‌ర‌, బోడ కాక‌ర‌... ఇలా ఈ కూర‌గాయ‌కు చాలా పేర్లే ఉన్నాయి. కాక‌ర‌కాయంత పొడ‌వుగా ఉండ‌దు, దానంత చేదు కూడా ఉండ‌దు. కానీ ఆగాక‌ర‌లో పోష‌కాలు మాత్రం ఎక్కువే ఉంటాయి. వీటిని మ‌న ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

1. ఆగాక‌ర కాయ‌లు మ‌ధుమేహం ఉన్న వారికి ఎంత‌గానో మేలు చేస్తాయి. ఇవి ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిల‌ను త‌గ్గిస్తాయి. ఇన్సులిన్ లెవ‌ల్స్‌ను పెంచుతాయి. మ‌ధుమేహం వ‌ల్ల వ‌చ్చే ఇతర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా దూరం చేస్తాయి. 

2. ఆగాక‌ర కాయ‌ల్లో పైటో న్యూట్రియంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి క్యాన్స‌ర్‌ల‌ను న‌యం చేస్తాయి. క్యాన్స‌ర్ క‌ణ‌తుల‌ను పెర‌గ‌నీయ‌కుండా అడ్డుకుంటాయి. క్యాన్స‌ర్ కార‌కాల‌ను నాశ‌నం చేస్తాయి. 

3. ఆగాక‌ర కాయ‌ల్లో ఫొలేట్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది చిన్న పిల్ల‌ల‌కు, గ‌ర్భిణీ స్త్రీలకు ఎంత‌గానో అవ‌స‌ర‌మైన ముఖ్య‌మైన పోష‌కం. దీంతో గ‌ర్భ‌స్థ శిశువు చ‌క్క‌గా ఎదుగుతుంది. 

4. ఆగాక‌ర కాయ‌ల్లో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. ఇది శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తుంది. ఇన్‌ఫెక్ష‌న్ల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతుంది. ఫ్రీ ర్యాడిక‌ల్స్ వ‌ల్ల క‌లిగే న‌ష్టాన్ని నివారిస్తుంది. 

5. ఆగాక‌ర కాయ‌ల్లో ఫ్లేవ‌నాయిడ్లు కూడా స‌మృద్ధిగానే ఉంటాయి. ఇవి యాంటీ ఏజింగ్ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. ఇందు వ‌ల్ల వృద్ధాప్య ఛాయ‌లు అంత త్వ‌ర‌గా ద‌రి చేర‌వు. 

6. ఆగాక‌ర‌లో విట‌మిన్ ఎ కూడా బాగానే ఉంటుంది. ఇది దృష్టి సంబంధ స‌మ‌స్య‌లను తొల‌గిస్తుంది. 

7. మూత్ర‌పిండాలు, మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు ఉన్న వారు నిత్యం ఆగాక‌ర కాయ‌ల‌ను తింటుంటే ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 

8. జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌ల‌ను తొల‌గించుకోవ‌చ్చు.

భోజ‌నానికి ముందు ఈ పండు తింటే, అనారోగ్యాలు హుష్ కాకి!


andariki-ayurvedam-anjeer1

ఎండ‌బెట్టి డ్రై ఫ్రూట్స్ రూపంలోకి మార్చిన అంజీర్ పండ్లు మార్కెట్‌లో మ‌న‌కు ల‌భ్య‌మ‌వుతున్నాయి. వీటిని అంద‌రూ చూసే ఉంటారు. అయితే డ్రై ఫ్రూట్స్ రూపంలో దొరికే అంజీర్ పండ్లే కాదు, సాధార‌ణ పండు రూపంలోనూ అంజీర్‌ను తింటే దాంతో మ‌న‌కు ఎన్నో ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా ఈ పండును రెండు పూట‌లా భోజనానికి ముందు తింటే దాంతో అనేక అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

1. అంజీర్ పండ్ల‌లో ఫైబ‌ర్ స‌మృద్ధిగా ఉంటుంది. ఇది మ‌నం తిన్న ఆహారాన్ని సులువుగా జీర్ణం చేసేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. జీర్ణ వ్య‌వ‌స్థ బాగా ప‌నిచేస్తుంది. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బద్ద‌కం వంటి జీర్ణ సంబంధ స‌మ‌స్య‌ల‌న్నీ దూర‌మ‌వుతాయి.

2. అంజీర్‌లో పొటాషియం, సోడియం బాగా ల‌భిస్తాయి. ఇవి ర‌క్త‌పోటు (బీపీ) స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మనాన్ని క‌లిగిస్తాయి. బీపీని కంట్రోల్‌లో ఉంచుతాయి.

3. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నేడు చాలా మందిని బాధిస్తోంది. అలాంటి వారు నిత్యం రెండు అంజీర్ పండ్ల‌ను భోజనానికి ముందు తిన్న‌ట్ట‌యితే వారిలో ర‌క్తం బాగా ప‌డుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. మ‌లేరియా, టైఫాయిడ్‌, డెంగీ వంటి విష జ్వ‌రాల బారిన ప‌డి ప్లేట్‌లెట్లు త‌గ్గిన వారికి ఈ పండ్ల‌ను తినిపిస్తే వెంట‌నే ప్లేట్‌లెట్లు పెరుగుతాయి.

4. అధిక బ‌రువు స‌మ‌స్య కూడా ఇప్పుడు అధిక‌మైంది. ఈ క్ర‌మంలో అంజీర్ పండ్ల‌ను రెండు పూట‌లా భోజనానికి ముందు తింటే దాంతో పొట్ట నిండిన భావ‌న క‌లుగుతుంది. దీని వ‌ల్ల ఎక్కువ‌గా ఆహారం తీసుకోవ‌డం త‌గ్గుతుంది. ఫ‌లితంగా బ‌రువు కూడా త‌గ్గుతారు. అంతేకాదు అంజీర్‌లో ఉండే పోష‌కాలు మ‌న శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కూడా త‌గ్గిస్తాయి.

5. నిత్యం అంజీర్ పండ్ల‌ను తింటుంటే గుండె సంబంధ స‌మ‌స్య‌లు కూడా దూర‌మ‌వుతాయి. అంజీర్ పండ్ల‌లో ఉండే పెక్టిన్ అనే ప‌దార్థం శ‌రీరంలోని వ్య‌ర్థ ప‌దార్థాల‌ను తొల‌గిస్తుంది. ర‌క్తాన్ని శుద్ధి చేస్తుంది.

6. అంజీర్ పండ్ల‌లో మెగ్నిషియం, మాంగ‌నీస్‌, జింక్ స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి సంతానం కావాల‌నుకునే వారికి మేలు చేస్తాయి.

andariki-ayurvedam-anjeer2


7. శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది. క్యాన్స‌ర్‌కు కార‌ణ‌మ‌య్యే ప‌దార్థాలు నాశన‌మ‌వుతాయి.

8. అంజీర్ పండ్లు మ‌ధుమేహం ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు చేస్తాయి. భోజనానికి ముందు వీటిని తింటే అనంత‌రం ర‌క్తంలో షుగ‌ర్ స్థాయిలు అంత‌గా పెర‌గ‌వు.

9. ఆస్త‌మా వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అంజీర్ పండ్ల‌ను తింటే ఆ అనారోగ్యాల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

10. అంజీర్ పండ్ల‌లో కాల్షియం కూడా పుష్క‌లంగానే ఉంటుంది. వీటిని తిన‌డం వ‌ల్ల ఎముక‌లు దృఢ‌మ‌వుతాయి. ఎముక‌లు విరిగి ఉన్న వారికి వీటిని పెడితే ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కుంటాయి.

11. గొంతు నొప్పి ఉన్న‌వారు అంజీర్ పండ్ల‌ను తింటే వెంట‌నే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ద‌గ్గు కూడా త‌గ్గుతుంది.

12. జ్వ‌రం, చెవి నొప్పి, క‌డుపు నొప్పి వంటి స‌మ‌స్య‌లు ఉంటే అంజీర్ పండ్ల‌ను తినాలి. దీంతో ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

ప్లేట్‌లెట్స్.. డేంజర్ బెల్స్..!


anadariki-ayurvedam-platlets

అంబర్‌పేట : బాగ్‌అంబర్‌పేట పోచమ్మబస్తీకి చెందిన రచ్చ శ్రీనివాస్ కుమారుడు తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఇటీవల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. రోజులు గడిచినా జ్వరం తగ్గకపోగా ప్లేట్‌లెట్స్ పడిపోతున్నాయని వైద్యులు తెలిపారు. ఓ రక్తనిధి కేంద్రం పర్యవేక్షణలో రక్తదాత సాయంతో(సింగిల్ డోనర్) నేరుగా రక్తకణాలు సేకరించే ప్రక్రియను చేపట్టగా గంటల వ్యవధిలో రూ.25వేలకు పైగా ఖర్చు భరించాల్సి వచ్చింది.
* హైకోర్టు న్యాయవాది కూతురు ఒకరికి డెంగీ వస్తే ఆమెను బర్కత్‌పురలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. రక్తంలో ప్లేట్‌లెట్స్ తగ్గిపోయాయని చెప్పి బెదరగొట్టారు. రూ.70వేల ఖర్చు అవుతుందన్నారు. ప్లేట్‌లెట్స్ గల రక్తం దొరకడం కష్టమని చెప్పారు.
ఇది ఒక్క శ్రీనివాస్, న్యాయవాది సమస్యే కాదు. ఇంలా రక్తకణాలు పడిపోయి ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య వందల్లో ఉంటోంది. ప్రస్తుత సీజన్‌లో జ్వరాలు.. ఒత్తిళ్లతో కూడిన జీవనశైలి ఇలా ఎన్నో కారణాలతో మనిషి శరీరంలో ప్లేట్‌లెట్స్ తగ్గిపోతున్నాయి. ఏటా వర్షాకాలం సీజన్‌లో ప్రజలను వణికిస్తున్న రక్త ఫలకాల సమస్య జనం గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. జ్వరాల బారిన పడి దవాఖానల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అదే సమయంలో నగరంలో ఉన్న రక్తనిధి కేంద్రాల్లో అవసరమైన రక్త ఫలకాలు(ప్లేట్‌లెట్స్) దొరకని పరిస్థితి నెలకొంది. కొన్ని రక్తనిధి కేంద్రాలు రోగుల అవసరాన్ని బట్టి రూ.వేలు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు రక్త ఫలకాలు, ఆరోగ్యంలో వాటి ప్రాధాన్యం, సమస్యలను అధిగమించడానికి తీసుకోవాల్సిన అంశాలపై అవగాహన అవసరమని డాక్టర్లు చెబుతున్నారు. 
కణాలు ఎక్కడ తయారవుతాయంటే..
మనిషి రక్తంలో ఉండే ఎర్ర, తెల్ల రక్త కణాలు అన్ని ఎముకల్లో మూలుగ నుంచి ఉత్పత్తి అవుతాయి. మూలుగపై ప్రభావం చూపే వ్యాధులు సోకిన సమయంలో కణాల ఉత్పత్తి తగ్గడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. 
తెల్ల రక్త కణాలు కీలకమే..
మూలుగలో ఉత్పత్తయిన 7 నుంచి 30 రోజు ల పాటు తెల్లరక్త కణాలు జీవించి ఉం టాయి. రక్తంలో వీటి సంఖ్య తగ్గితే వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఈ సమయంలో ఎలాంటి వ్యాధు లు ముసిరినా.. అవి అదుపులోకి రావడానికి చాలా సమయం పడుతుంది. 
ప్లేట్‌లెట్స్ ఎందుకు తగ్గుతాయి..?
* ఎముకల్లోని మూలుగపై తీవ్ర ప్రభావం చూపే మందులు వాడినప్పుడు.
* వైరల్ ఇన్‌ఫెక్షన్ సోకిన సమయంలో...
* ఆటో ఇమ్యూన్ డిసీజెస్‌తో
* హెచ్‌ఐవీ, పర్వోవైరస్, డెంగీ, హైపటైటిస్-సి, సైటోమోగలో వైరస్ సంక్రమించినప్పుడు
* క్యాన్సర్ చికిత్స కీమో థెరఫీ వల్ల..
* మద్యం దురలవాటుతో
ప్లేట్‌లెట్స్ పెరగాలంటే..
* బొప్పాయి ఆకు, గోధుమ నారు నుంచి తీసే రసం గ్లాసు తాగాలి.
* బీట్‌రూట్, కలబంద రసం తీసుకోవాలి.
* జామ(ఎర్ర) కాయలు తినాలి.
* విటమిన్ సి, కె లభించే పండ్లు, ఆహార పదార్థాలు, గుమ్మడి కాయలు తీసుకోవాలి. ముఖ్యంగా అడవి ఉసిరి మేలు చేస్తుంది. 
* నీళ్లు సరిపడా తీసుకోవాలి.
* పై జాగ్రత్తలకు తోడు సరైన నిద్ర, వ్యాయామం కూడా ఎంతో అవసరం.

లక్షణాలు 
శరీరంపై ఎర్రని మచ్చలు, లాలాజలంలో రక్తం కనిపించడం, ముక్కు నుంచి రక్తం కారడం, మూత్రం ఎరుపు రంగులో రావడం, విపరీతమైన తలనొప్పి, కడుపునొప్పి, విరోచనం నలుపుగా ఉండటం, శరీరం నిస్సత్తువగా మారడం వంటివి జరుగుతాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రక్తంలోని ఎరుపు, తెలుపు రక్తకణాలు కాకుం డా కేవలం ప్లేట్‌లెట్‌లను రోగికి ఎక్కించాల్సి ఉంటుంది.
* రక్తపోటు, చక్కెర వ్యాధులకు, గుండె జబ్బులకు మందులు వాడుతున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి.
* దంతదావనం చేసేటప్పుడు రక్తస్రావం జరగకుండా చూసుకోవాలి.
* మద్యపానం మానేయాలి.
* మహిళలు నెలసరి సమయంలో జాగ్రత్త వహించి వైద్యులను సంప్రదించాలి. కామెర్లు, మూత్రపిండ వ్యాధితో బాధపడేవారు, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ ఉన్నవారికి ప్రమాదం.

20 వేల కన్నా తగ్గొద్దు 
ప్లేట్‌లెట్‌లు రక్తాన్ని గడ్డకట్టిస్తాయి. శరీరానికి గాయమైనప్పుడు వెంటనే రక్తం గడ్డకట్టుకుపోతే తీవ్ర రక్తస్రావం జరగదు. రక్త ఫలకాల సంఖ్య 50 వేల కంటే తగ్గకూడదు. మరీ 20వేల కంటే తగ్గితే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ స్థాయిలో దెబ్బతగలకున్నా శరీర రంధ్రాల నుంచి రక్తం కారే అవకాశం ఉంది.