పొట్టు తీసిన శనగపప్పును మనం అనేక వంటకాల్లో వాడుతుంటాం. కానీ పొట్టు తీయకుండానే లభించే శనగలను లేదా లావుగా ఉండే మరో రకమైన కాబూలీ శనగలను తింటే మనకు ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ శనగలను నానబెట్టి లేదా ఉడకబెట్టి లేదంటే మొలకల రూపంలో నిత్యం తీసుకుంటే దాంతో ఎన్నో లాభాలు కలుగుతాయి. పలు అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. ఈ క్రమంలో శనగల వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. శనగల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్‌ను తగ్గించి వేస్తుంది. దీంతో గుండె సంబంధ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
2. నాన్‌వెజ్ తినలేని వారికి శనగలను ఒక వరమని చెప్పవచ్చు. ఎందుకంటే మాంసంలో ఉండే ప్రోటీన్లన్నీ శనగలలో లభిస్తాయి.
3. పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం వంటి ఎన్నో రకాల మినరల్స్ శనగల్లో ఉంటాయి. ఇవి బీపీని కంట్రోల్ చేస్తాయి. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా చేస్తాయి. దీంతో బరువు తగ్గాలనుకునే వారికి శనగలు బాగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు.
4. శనగలను తరచూ తింటుంటే రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. దీంతో రక్తం బాగా పడుతుంది. ఇది రక్తహీనత ఉన్న వారికి ఎంతగానో మేలు చేస్తుంది.
5. శనగల్లో అమైనో యాసిడ్లు, ట్రిప్టోఫాన్, సెరొటోనిన్ వంటి ఉపయోగకరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చక్కగా నిద్ర పట్టేలా చేస్తాయి. దీంతో నిద్రలేమి దూరమవుతుంది. అంతేకాదు ఒత్తిడి, ఆందోళన వంటివి కూడా తగ్గిపోతాయి.
6. శనగల్లో ఆల్ఫా లినోలినిక్ యాసిడ్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.
7. ఐరన్, ప్రోటీన్లు, మినరల్స్‌సమృద్ధిగా ఉండడం వల్ల శనగలు శరీరానికి మంచి శక్తిని ఇస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు బాగా ఉండడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది.
8. పాలలో ఉండే కాల్షియంకు దాదాపు సమానమైన కాల్షియం శనగల్లో లభిస్తుంది. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. ఎముకలకు పుష్టి కలుగుతుంది.
9. పాస్ఫరస్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో ఎక్కువగా ఉన్న ఉప్పును బయటికి పంపుతుంది. కిడ్నీల పనితనం మెరుగు పడుతుంది. పచ్చ కామెర్లు ఉన్న వారు శనగలను తింటే త్వరగా కోలుకుంటారు.
10. మాంగనీస్, పాస్ఫరస్ సమృద్ధిగా ఉండడం వల్ల చర్మ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. దురద, గజ్జి వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది.
No comments:
Post a Comment