ఉద‌యాన్నే వెల్లుల్లి, తేనె మిశ్ర‌మం తీసుకుంటే..?


andariki-ayurvedam-honey-garlic-mix

వెల్లుల్లిని నిత్యం మ‌నం వంట‌ల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటాం. అదేవిధంగా తేనెను కూడా ప‌లు ర‌కాల స‌లాడ్స్‌లో, టీ, కాఫీ, పాలు వంటి డ్రింక్స్‌లో కొంద‌రు తీసుకుంటారు. అయితే ఈ రెండింటిలోనూ మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో ర‌కాల పోష‌కాలు సమృద్ధిగా ఉన్నాయి, కాబ‌ట్టి ఈ రెండింటినీ క‌లిపి ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తీసుకుంటే దాంతో మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

కొన్ని వెల్లుల్లి రేకుల్ని తీసుకుని బాగా న‌లిపి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దీంతో వాటిలో ఉండే పోష‌కాలు రెట్టింపు అవుతాయి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని తేనెతో క‌లిపి ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తీసుకోవాలి. ఇలా చేస్తే ఏయే లాభాలు క‌లుగుతాయంటే... 

1. వెల్లుల్లి, తేనెల‌ను క‌లిపి మిశ్ర‌మంగా చేసి ఉద‌యాన్నే ప‌ర‌గడుపున తీసుకుంటే శ‌రీరంలో వ్యాధి నిరోధ‌క శ్య‌క్తి పెరుగుతుంది. ఎలాంటి ఇన్‌ఫెక్ష‌న్ల‌నైనా త‌ట్టుకునే శ‌క్తి వ‌స్తుంది. దీంతోపాటు ఈ రెండింటిలో ఉండే ప‌వ‌ర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు శ‌రీరంలోని ఫ్రీ ర్యాడిక‌ల్స్ ప్ర‌భావాన్ని త‌గ్గిస్తాయి. దీంతో చ‌ర్మంపై ముడ‌త‌లు త‌గ్గుతాయి. 

2. వెల్లుల్లి, తేనె మిశ్రమం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చూస్తుంది. ఆయా ప్రాంతాల్లో పేరుకుపోయే కొవ్వును కూడా తొలగిస్తుంది. దీంతో వివిధ రకాల గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.

3. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా వెల్లుల్లి, తేనె మిశ్రమంలో ఉన్నాయి. దీంతో ఇది శరీరంలో ఏర్పడే నొప్పులు, వాపులను తగ్గిస్తుంది. గొంతు నొప్పి, మంట వంటివి తగ్గిపోతాయి.

4. జీర్ణాశయ సంబంధ సమస్యలు దూరమవుతాయి. డయేరియా, అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను నయం చేసుకోవచ్చు. పెద్ద పేగులో ఏర్పడే ఇన్‌ఫెక్షన్లకు అడ్డుకట్ట వేయవచ్చు.

5. జలుబు, ఫ్లూ జ్వరం, సైనస్ వంటి అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు తగ్గిపోతాయి.

6. శరీరంలోని విష పదార్థాలను, క్రిములను బయటకి పంపే శక్తి ఈ మిశ్రమానికి ఉంది. ఆర్యోగానికి పూర్తి సంరక్షణను ఇస్తుంది.

7. దెబ్బలు, కాలిన గాయాలు, పుండ్లు వంటివి వెంటనే తగ్గిపోతాయి. శ్వాస కోశ సమస్యలతో బాధ పడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది.

8. శరీరంలోని అవయవాల పనితీరు మెరుగు పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది.

No comments:

Post a Comment