ఇప్పుడంటే అన్నీ రిఫైన్డ్ నూనెలు వచ్చాయి కానీ ఒకప్పుడు మన వాళ్లు గానుగల్లో ఆడించిన నూనెలనే ఎక్కువగా వాడేవారు. అలాంటి నూనెల్లో నువ్వుల నూనె కూడా ఒకటి. తెల్లనివి, నల్లనివి అని రెండు రకాలుగా ఈ నువ్వులు ఉంటాయి. వీటి నుంచి తీసే నూనెలో ఎన్నో రకాల పోషక పదార్థాలు ఉంటాయి. మన శరీరానికి అవసరమైన విటమిన్ ఇ, కాల్షియం, జింక్, ఐరన్, థయామిన్, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు నువ్వుల నూనెలో మనకు పుష్కలంగా లభిస్తాయి. ఈ క్రమంలో నువ్వుల నూనెను నిత్యం మన ఆహారంలో భాగం చేసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. నువ్వుల నూనెలో విటమిన్ ఇ, బిలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని సంరక్షించడమే కాదు, అన్ని రకాల చర్మ సమస్యలను దూరం చేస్తాయి. నువ్వుల నూనెను తరచూ వాడడం వల్ల ముఖం కాంతివంతమవుతుంది. చర్మం మృదువుగా మారుతుంది.
2. నిత్యం స్నానం చేసే ముందు చిన్న పిల్లలకు నువ్వుల నూనెతో మర్దనా చేస్తే వారి శరీరం బాగా ఎదుగుతుంది. మెదడు పదునుగా మారుతుంది. చిన్నారుల్లో ఉండే కొవ్వు కరిగిపోతుంది. ఈ నూనెలో ఉండే పోషకాలన్నీ పిల్లలకు లభిస్తాయి. అయితే పెద్దలు కూడా స్నానానికి ముందు నువ్వుల నూనెతో మర్దనా చేసుకోవచ్చు.
3. నువ్వుల నూనెలో ఒమెగా-3,6 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి బీపీని తగ్గిస్తాయి. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గిస్తాయి.
4. కాపర్, ఇతర పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు నువ్వుల నూనెలో ఉంటాయి. దీంతో ఇవి కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. కొద్దిగా నువ్వుల నూనెను తీసుకుని కొంచెం వేడి చేసి మోకాళ్లపై రాసుకుంటే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి.
5. పైన చెప్పిన విధంగా నువ్వుల నూనెను శరీరంపై కొవ్వు ఉన్న ప్రాంతాల్లో రాస్తే అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది.
6. నువ్వుల నూనెలో ఉండే పోషకాలు ఎముకలకు దృఢత్వాన్ని ఇస్తాయి. రక్తనాళాలను శుభ్రం చేస్తాయి. శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తాయి.
7. మధుమేహ వ్యాధి గ్రస్తులు నిత్యం 2 టేబుల్ స్పూన్ల మోతాదులో నువ్వుల నూనెను ఏవిధంగానైనా తీసుకుంటే వారి శరీరంలోని రక్తంలో ఉండే చక్కెర స్థాయిలు తగ్గుముఖం పడతాయి. దీని వల్ల షుగర్ నియంత్రణలో ఉంటుంది.
8. నువ్వుల నూనెతో తలకు మర్దనా చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది. వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. చుండ్రు సమస్య పోతుంది.
No comments:
Post a Comment