సైనస్ సమస్య బాధిస్తుంటే..?


andariki-ayurvedam-sinus

సైనస్... వాతావ‌ర‌ణం మారిన‌ప్పుడ‌ల్లా చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ప్ర‌ధానంగా చ‌లికాలంలో, చ‌లిగా ఉన్న వాతావ‌ర‌ణంలో సైన‌స్ ఇంకా ముప్పు తిప్ప‌లు పెడుతుంది. త‌ల‌నొప్పి ఎక్కువ‌గా ఉండ‌డం, క‌ళ్ల ద‌గ్గ‌ర దుర‌ద‌గా ఉండ‌డం, ముక్కుకు ఇరువైపులా ప‌ట్టుకుంటే నొప్పి… ఇవ‌న్నీ సైన‌స్ ల‌క్ష‌ణాలు. అయితే కింద ఇచ్చిన కొన్ని టిప్స్‌ను పాటిస్తే సైన‌స్ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. అవేమిటంటే... 

1. నిత్యం మ‌నం తినే ఆహారంలో కారం పొడిని ఎక్కువ‌గా వాడాలి. దీని వ‌ల్ల ముక్కు నుంచి ఎక్కువ‌గా నీరు రాకుండా ఉంటుంది. సైన‌స్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 

2. సైనస్ స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో వెల్లుల్లి కూడా బాగానే ఉప‌యోగ‌ప‌డుతుంది. దీంట్లో యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉన్నాయి. రోజుకు 2, 3 వెల్లుల్లి రేకుల్ని తింటున్నా సైన‌స్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. 

3. ఒక టీస్పూన్ వాము తీసుకుని నూనె లేకుండా పెనం మీద కొద్దిగా వేయించాలి. దాన్ని బాగా న‌లిపి ఒక శుభ్ర‌మైన వ‌స్త్రంలో పెట్టి బాగా వాస‌న పీల్చాలి. దీంతో ముక్కు లోపలి రంధ్రాలు బాగా తెరుచుకుంటాయి. ఈ క్ర‌మంలో త‌ల‌నొప్పి త‌గ్గిపోతుంది. సైన‌స్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 

4. ప్రాణాయామం వంటి శ్వాస‌క్రియ వ్యాయామాల‌ను చేసిన‌ట్టియ‌తే సైన‌స్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 

5. ఒక టీస్పూన్ జీల‌క‌ర్ర‌ను బాగా వేయించి పొడి చేయాలి. దాంట్లో రెండు టీస్పూన్ల తేనె క‌లిపి రోజుకు 2 సార్లు తీసుకుంటే సైన‌స్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 

6. క్యారెట్ జ్యూస్ 300 ఎంఎల్‌, పాల‌కూర ర‌సం 200 ఎంఎల్ మోతాదులో తీసుకుని రోజుకు ఒక సారి తాగాలి. దీని వ‌ల్ల సైన‌స్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. 

7. ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని బాగా మరిగించాలి. దాంట్లో కొన్ని చుక్క‌ల యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ వేసి ఆ నీటి నుంచి వ‌చ్చే ఆవిరిని పీల్చాలి. దీంతో ముక్కులోని రంధ్రాలు తెరుచుకుని గాలి బాగా ఆడుతుంది. స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 

8. విట‌మిస్ సి ఎక్కువ‌గా ఉండే నిమ్మ‌, ఉసిరి, కివీ పండ్లను త‌ర‌చూ తీసుకుంటుంటే సైన‌స్ నుంచి విముక్తి పొంద‌వచ్చు. 

9. ట‌మాటా ర‌సంతో చేసిన టీ తాగుతున్నా సైన‌స్ త‌గ్గిపోతుంది.

No comments:

Post a Comment