గొంతు నొప్పి త‌గ్గాలంటే..?


andariki-ayurvedam-throat-pain

సీజ‌న్ మారిందంటే చాలు. చాలా మందికి జ‌లుబు, ద‌గ్గు వ‌స్తుంటాయి. దీంతోపాటు అనేక మందిని గొంతు నొప్పి కూడా బాధిస్తుంది. అయితే కింద ఇచ్చిన ప‌లు టిప్స్ పాటిస్తే గొంతు నొప్పిని సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

1. ఒక టేబుల్ స్పూన్ గ‌ళ్ళ ఉప్పు లేదా వంట సోడాను గ్లాస్ గోరువెచ్చని నీటిలో వేసి క‌లియ‌బెట్టాలి. ఆ నీటిని పుక్కిలించాలి. ఇలా రోజుకు నాలుగైదు సార్లు చేస్తే ఉప్పు యాంటిసెప్టిక్‌గా పనిచేసి గొంతును శుభ్రం చేసి నొప్పినుంచి ఉపశమనం కలిగిస్తుంది. బీపి ఉన్నవాళ్లు ఈ పని చేయరాదు.

2. వేడి నీటిలో కాస్త తేనె వేసి తీసుకుంటే గొంతునొప్పి నుంచి త్వర‌గా ఉపశమనం పొందవచ్చు.

3. ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం కలిపి రోజూ తీసుకుంటే గొంతు సమస్యలు తొలగిపోతాయి.

4. దాల్చిన చెక్క పొడి, తేనె కలిపిన మిశ్రమాన్ని తింటే దగ్గు, జలుబుతో కూడిన గొంతు నొప్పి నుంచి రిలీఫ్ లభిస్తుంది.

5. మిరియాల పొడిని కాస్త తేనెలో కలిపి తినటం లేదా పాలల్లో మిరియాలపొడి కలిపి తాగినా గొంతు సమస్యలు తగ్గుతాయి.

6. గొంతులో మంటగా ఉంటే వెల్లుల్లి రెబ్బను తింటే గొంతులో మంట తగ్గుతుంది.

7. గొంతులో గరగర వంటి సమస్యలు పోవాలంటే ఉల్లిపాయ రసం సేవించడం లేదా అల్లంతో చేసిన టీని గాని అల్లాన్ని నీటిలో ఉడికించి ఆ నీటిని గాని సేవిస్తే గొంతు సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

No comments:

Post a Comment