పప్పు ధాన్యాల జాతికి చెందిన పెసలను మనం అప్పుడప్పుడూ పెసర పప్పు రూపంలో వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాం. పెసరపప్పుతో పలు కూరలను కూడా మనం తింటుంటాం. అయితే పప్పే కాదు, పెసలను మొలకెత్తిన గింజల రూపంలో తింటుంటే పప్పు కన్నా ఇంకా ఎన్నో లాభాలు ఉంటాయి. ఆ లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మొలకెత్తిన పెసలలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొవ్వును కరిగించేందుకు, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.
2. మొలకెత్తిన పెసలను తింటే త్వరగా ఆకలి వేయదు. దీంతో ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా ఆహారాన్ని తగ్గించి బరువు కూడా తగ్గవచ్చు.
3. డైటరీ ఫైబర్ అధికంగా ఉన్న కారణంగా ఇవి మలబద్దకం సమస్యను పోగొడతాయి. తిన్నది సరిగ్గా జీర్ణం అయ్యేలా చూస్తాయి.
4. శరీరంలోని నొప్పులు, వాపులను తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఈ మొలకెత్తిన పెసలలో ఉన్నాయి.
5. విటమిన్ ఎ, బి, సి, డి, ఇ, కె, థయామిన్, రైబోఫ్లేవిన్, ఫోలిక్ యాసిడ్, నియాసిన్, విటమిన్ బి6, ఫాంటోథెనిక్ యాసిడ్ వంటివి మొలకెత్తిన పెసలలో సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి వీటిని పరిపూర్ణ పౌష్టికాహారంగా చెప్పవచ్చు.
6. మొలకెత్తిన పెసలను తీసుకోవడం వల్ల దృష్టి సంబంధ సమస్యలు పోతాయి. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. రక్తహీనత తొలగిపోతుంది.
7. రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. మధుమేహం ఉన్న వారికి మేలు జరుగుతుంది.
8. శరీరంలో ఏర్పడే ఇన్‌ఫెక్షన్లను తొలగించే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి.
9. వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వవు. గ్యాస్, అసిడిటీ వంటి జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి.
No comments:
Post a Comment