అతిమూత్రవ్యదికి - బిగువైన యోగాలు
* రోజుకు 24 మీ.లీ. మోతాదుగా పచ్చి నేరేడు గింజల రసమును లోపలి పుచ్చుకొంటుంటే అతిమూత్రవ్యది క్రమంగా తగ్గుతుంది.
* తంగేడు చెట్టు యొక్క విత్తనముల చూర్ణమును తేనెతో కలిపి సేవిస్తుంటే అతిమూత్రవ్యది క్రమంగా తగ్గును.
* ఓమ నువ్వులు, పేలాలు ఈ మూడింటిని సమానబగాలుగా తీసుకొని కలిపి చూర్ణములాగా చేసి సేవించిన అతిమూత్రవ్యది తగ్గిపోవును.
* తుమ్మ చెట్టు యొక్క పట్టాతో చేసిన కషాయమును 10 నుండి 20 గ్రాముల మోతాదుగా తాగుతున్నా కూడా అతిమూత్రవ్యది తగ్గును.
మధుమేహ వ్యాధికి చిట్కాలు:
* డయాబెటిస్ ను అరికట్టడంలో కరివేపాకు సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఫ్యామిలీ హిస్తోరీలో డయాబెటిస్ ఉన్నట్లయితే తప్పకుండా ప్రతిరోజు ఉదయం పరగడుపున గుప్పెడు కరివేపాకు తినాలి. ఇలా క్రమం తప్పకుండా వందరోజులు తింటే మంచి ఫలితం ఉంటుంది.
* ప్రతిరోజు నేరేడు పండు రసాన్ని తీసుకుంటే శరీరంలోని చెక్కర శాతం అదుపులో ఉంటుంది. కానీ నేరేడు పళ్ళు అన్ని కాలాల్లో దొరకవు కాబట్టి నేరేడు గింజలను ఎండబెట్టి కొద్దిగా వెఇంచి పొడిచేసి కొద్దిగా నీళ్ళలో ఉడికించి ప్రతి రోజు ఉదయం నిద్రలేవగానే ఇరవై ఒకరోజుల పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
* జీర్ణకోశంలో అల్సర్లు, దయబెటీస్, ఒబేసిటీ వంటి సమస్యలతో బాదపడేవారికి ద్రాక్ష రసం చక్కటి ఉపశమనం ఇస్తుంది.
* నేరేడు, వేపాకు, ఎండు కాకరకాయ, నల్లజీలకర్ర, మెంతులు మొదలైన వాటిని సమంగా తీసుకొని ఒపడి చేసుకొని ఈ చూర్ణాన్ని ఉదయం ఒక స్పూను, సాయంత్రం ఒక స్పూను నీళ్ళతో కలిపి తీసుకుంటే మధుమేహవ్యాధి చాలా వరకు తగ్గుతుంది.
* మామిడి ఆకులను నీడలో ఎండబెట్టి, పొడిచేసి నిలువ చేసుకొని అరస్పూను చొప్పున ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తింటే డయాబెటిస్ తగ్గుతుంది.
స్త్రీల కోసం చిట్కాలు:
* మెంతికూరను ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటే నెలసరి క్రమంగా వస్తుంది.
* ములగాకును బాలింతలకు రెండు రోజులకొకసారి పెడితే పాలు సమృద్ధిగా ఉత్పతి అవుతాయి.
* గర్బిణీ స్త్రీలు ప్రతి రోజు ఆహారంలో అరటిపండు తీసుకుంటే గర్భకోశానికి ఆరోగ్యం కలిగి శిశువు సుఖంగా ఉండి ప్రసవం తేలికగా జరుగుతుంది.
* ప్రసవం అయిన తరువాత ఆహారంలో ధనియాలు ఉపయోగిస్తుంటే గర్భకోశానికి మంచిది.
జుట్టు బాగా పెరగాలంటే చిట్కా:
* జుట్టు బాగా పెరగాలన్నా, మృదువైన కురులు కావాలన్నా, మెంతి కూర, పుదీనా రెండూ సమానభాగాలుగా తీసుకొని మెత్తగా రుబ్బి తలకు పెట్టుకోవాలి. ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇది 15 రోజులకొకసారి చేస్తుంటే పెనుకోరుకుడు పోతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
* సీతాఫలం గింజలను మెత్తగా పొడిచేసి తలకు పట్టించి అరగంట తరువాత స్నానం చేస్తే తలలో చుండ్రు తగ్గి, పేలుకూడా పోతాయి.
* పుదీనా ఆకుల్ని నీడలో ఎండబెట్టి చూర్ణం చేసి, తలకు నూనే రాసుకునేప్పుడు రెండు చిటికెడు ఈ చూర్ణాన్ని నూనెలో కలిపి తలకు బాగా మర్దనా చేయాలి.
ఇలా చేస్తే వెంట్రుకలు రాలిపోవడం తగ్గుడమే కాకుండా వెంట్రుకలు రాలిపొఇన చోట తిరిగి వెంట్రుకలు మొలుస్తాయి.