Breaking News
Loading...

Info Post

andariki-ayurvedam-green-tea

గ్రీన్ టీ... ఇప్పుడు చాలా మంది దీన్ని తమ నిత్యం జీవితంలో భాగం చేసుకుంటున్నారు. కార‌ణం, అది అందించే ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలే. సాధార‌ణ టీలు తాగేవారు కూడా దానికి బ‌దులుగా గ్రీన్ టీని తాగుతున్నారు. అయితే రోజులో ఎప్పుడైనా చాలా మంది గ్రీన్ టీ తాగుతారు. కానీ రాత్రి పూట నిద్రించ‌డానికి క‌నీసం గంట ముందు గ్రీన్ టీ తాగితే దాంతో కొన్ని ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎఫెక్టివ్‌గా దూరం చేసుకోవ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

1. రాత్రి పూట నిద్రించ‌డానికి గంట ముందు గ్రీన్ టీని తాగితే శ‌రీర మెటబాలిజం బాగా పెరుగుతుంది. దీంతో నిద్ర పోతున్నా కూడా శ‌రీరంలో ఉన్న కొవ్వు వేగంగా క‌రిగిపోతుంది. దీని వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారు. 

2. రాత్రి నిద్ర‌కు ముందు గ్రీన్ టీని తాగ‌డం వ‌ల్ల ఫ్లూ, జ‌లుబు, ద‌గ్గు వంటి శ్వాస కోశ స‌మ‌స్య‌లు చాలా వ‌ర‌కు దూరం అవుతాయ‌ని ఇటీవ‌ల చేసిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. 

3. నిద్రించ‌డానికి ముందు గ్రీన్ టీని తాగ‌డం వ‌ల్ల శ‌రీరం రిలాక్స్ అవుతుంది. మ‌న‌సంతా ప్ర‌శాంతంగా మారి చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంది. అంతేకాదు, మ‌రుస‌టి రోజు లేచే స‌రికి ఉల్లాసం, ఉత్తేజం క‌లుగుతాయి. 

4. రోజంతా మ‌నం తిన్న ప‌లు ఆహార ప‌దార్థాల కార‌ణంగా శ‌రీరంలో వ్య‌ర్థాలు పేరుకుపోతాయి. వాట‌న్నింటినీ క్లీన్ చేయాలంటే రాత్రి పూట నిద్ర‌కు ముందు గ్రీన్ టీని తాగాలి. 

5. కాటెచిన్ అని పిల‌వ‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు గ్రీన్ టీలో పుష్క‌లంగా ఉంటాయి. అయితే రాత్రి పూట నిద్ర‌కు ముందు గ్రీన్ టీని తాగ‌డం వ‌ల్ల ఈ యాంటీ ఆక్సిడెంట్లు త‌మ ప‌ని ప్రారంభిస్తాయి. దీంతో శ‌రీరంలో అంత‌ర్గ‌తంగా ఉన్న అనారోగ్య స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. అంతేకాదు రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డుతుంది. 

అయితే గ్రీన్ టీలో పాలు, చ‌క్కెర వంటివి క‌ల‌ప‌కుండా డైరెక్ట్‌గా తాగాలి. అలా తాగితేనే పైన చెప్పిన విధంగా అద్భుత‌మైన ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.

0 comments:

Post a Comment