To Decrease Weight |
ధాన్యపు గింజలైన రాగుల్లో ఎన్నో రకాల పోషక పదార్థాలు ఉంటాయి. అవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే రాగులతో తయారు చేసే అంబలిని తాగడం వల్ల మనకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ప్రధానంగా బరువు తగ్గుతారు. ఇంకా చాలా లాభాలే ఉన్నాయి. ఈ క్రమంలో రాగి అంబలిని ఎలా తయారు చేయాలో, దాంతో మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగులను కొంత పరిమాణంలో తీసుకుని వాటిని కొన్ని గంటల పాటు నీటిలో నానబెట్టాలి. అనంతరం వాటిని శుభ్రమైన వస్త్రంలో కట్టి మళ్లీ కొన్ని గంటల పాటు ఉంచితే అవి మొలకెత్తుతాయి. కొన్ని సార్లు రాగులు మొలకెత్తడం ఆలస్యం కూడా అవచ్చు. అయినా కొంత సేపు నిరీక్షించి మొలకెత్తిన రాగులను సేకరించాలి. వాటిని బాగా ఎండబెట్టి దంచి పొడి చేయాలి. ఆ పొడిని కొంత నీటిలో వేసి బాగా ఉడికించాలి. దీంతో జావ తయారవుతుంది. ఇందులో అవసరం అయితే జీడిపప్పు, పల్లీలు, కిస్మిస్, తేనె వంటివి కలుపుకోవచ్చు. లేదంటే ఉప్పు, కారం కూడా కలపవచ్చు. అలా కలుపగా వచ్చేదే రాగి అంబలి. దీన్ని నిత్యం తాగితే మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.
1. రాగి అంబలి శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది. రోజంతా శరీరానికి కావల్సిన శక్తి, పోషకాలు రాగి అంబలి ద్వారా అందుతాయి. దీంతో ఎక్కువ సేపు పనిచేయవచ్చు. రోజంతా ఉత్సాహంగా ఉంటుంది.
2. ఎదిగే పిల్లలకు దీనిని ఇవ్వడం వల్ల శక్తివంతంగా తయారవుతారు. చదువుల్లో బాగా ప్రతిభను కనబరుస్తారు. మెదడు చురుగ్గా ఉంటుంది.
3. రాగి అంబలికి చలువ చేసే గుణం ఉంది. దీంతో శరీరంలో ఉండే అధిక వేడిని తగ్గించుకోవచ్చు.
4. ఒక గ్లాస్ రాగి అంబలి తాగినా చాలా సేపు ఆకలి వేయదు. దీంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆహారం ఎక్కువగా తినాలనిపించదు. ఇది బరువు తగ్గాలనుకునే వారికి మేలు చేస్తుంది. స్థూలకాయం ఉన్న వారు రాగి అంబలి తాగితే వేగంగా బరువు తగ్గవచ్చు.
5. ప్రతి రోజూ ఉదయం చేసే సాధారణ అల్పాహారానికి బదులుగా రాగి అంబలి తాగితే దాంతో మనం రోజంతా యాక్టివ్‌గా ఉండవచ్చు. శారీరక దృఢత్వం చేకూరుతుంది.
6. బీపీ, షుగర్ నియంత్రణలోకి వస్తాయి. రక్తస్రావం జరుగుతున్న వారికి రాగి అంబలి తాగిస్తే స్రావం ఆగిపోతుంది.
7. రాగి అంబలిని నిత్యం తాగుతుంటే పురుషుల్లో వీర్యం వృద్ధి చెందుతుంది.
0 comments:
Post a Comment