నీరు మన శరీరానికి ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. నీటిని రోజూ తగినంత మోతాదులో తాగడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అయితే నీటిని సాధారణ రూపంలో కాక వేడిగా ఉన్నప్పుడు తాగితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. అదే ఆ వేడి నీటిని పరగడుపున తాగితే దాంతో మనకు కలిగే అనేక అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పరగడుపున వేడి నీటిని తాగితే శరీరంలో రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. శరీరంలో ఉన్న మలినాలు, చెడు పదార్థాలు, వ్యర్థాలు బయటికి వెళ్లిపోతాయి.
2. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. మలబద్దకం దూరమవుతుంది. పైల్స్ ఉన్నవారికి వేడి నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది.
3. ఉదయాన్నే రెండు గ్లాసుల వేడి నీటిని తాగితే త్వరగా బరువు తగ్గుతారు. కొవ్వు వేగంగా కరిగిపోతుంది.
4. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. జ్వరం వంటి అనారోగ్యాలు రావు. ఇతర అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. ప్రధానంగా కిడ్నీలకు చాలా మంచిది.
5. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి అరగంట ముందు ఒక గ్లాస్ వేడి నీటిని తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. శరీర మెటబాలిజం వేగవంతమవుతుంది. ఇది క్యాలరీలను ఖర్చు చేసేందుకు ఉపయోగపడుతుంది.
6. దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి శ్వాస కోశ సమస్యలు దూరమవుతాయి. శ్వాస ప్రక్రియ మెరుగు పడుతుంది.
0 comments:
Post a Comment