వయస్సు మీద పడుతుందన్న బాధగా ఉందా.. అయితే ద్రాక్ష ఆరగించండి!


వయస్సు మీద పడుతోందని బాధగా ఉందా.. అంతేకాదు.. మీరు యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా.. అయితే ఈ కింది వివరాలు చదవాల్సిందే. వయస్సు మీద పడినా తెలియకుండా ఉండాలంటే ద్రాక్ష పండ్లను ప్రతిరోజూ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గ్రేప్స్ తీసుకోవడం ద్వారా యవ్వనంగా కనిపించడంతో పాటు స్కిన్ కేన్సర్‌కు కూడా చెక్ పెట్టవచ్చునని వారంటున్నారు.
andariki-ayurvedam-grapes

సూర్యకిరణాల నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాల ప్రభావంతో కలిగే చర్మ వ్యాధులను నియంత్రించడంలో ద్రాక్ష పండ్లు ఎంతగానో ఉపయోగపడుతాయట. అల్ట్రా వెయొలెట్ (యూవీ) చర్మ కణాలను సత్తువ లేకుండా చేస్తాయి. తద్వారా చర్మం పాలిపోవడంతో పాటు వయస్సుమీద పడినట్లు స్కిన్ కనిపిస్తుందని చర్మ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ద్రాక్షపండ్లను తీసుకోవడం ద్వారా యూవీ ప్రభావాన్ని చర్మంపై సోకకుండా చాలావరకు నియంత్రిస్తుందని వారు చెప్పారు.

 Click Here to See More

సహనం కోల్పోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. ఎందుకని?


సహనం జ్ఞానాన్ని పెంచేందుకు సహకరిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే సహనాన్ని కీలకమైన సమయంలో కోల్పోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పెద్దలు అంటుంటారు. అందుకే సహనంతో ఉండాలని మన పెద్దలు హితబోధ చేస్తుంటారు. 
అయితే, ఈ సహనాన్ని ఎలా పెంపొందించుకోవాలి, ఒకవేళ సహనం తక్కువగా ఉంటే ఏ విధంగా అలవర్చుకోవాలన్న దానికి కొన్ని సాధారణ నియమాలను పాటిస్తే సరిపోతుంది. ముఖ్యంగా, మహిళలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మరీ మంచిది. 
andariki-ayurvedam-sahanam-kolpothe
తరచూ సహనాన్ని కోల్పోతున్నట్టు అనిపిస్తే శారీరక వ్యాయామం ద్వారా సమస్యను అధిగమించటానికి ప్రయత్నించాలి. ఒక విషయంలో సహనం కోల్పోతున్నట్టు భావిస్తే మనలో మనమే నిగ్రహించుకునేందుకు ప్రయత్నించాలి. 
ముఖ్యంగా కీలక సమయాల్లో మన మాటకు ఎవరన్నా తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనే విషయం అర్థమైనప్పటికీ దాన్ని పెద్దగా తీసుకోకుండా ఉండటం ఎంతో మంచిది. తామరాకు మీద నీటిబొట్టులాగ భావోద్వేగాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. సహనం హద్దులు దాటుతున్నట్టు లేదా నోరు అదుపు జారుతుందని అనిపించినా వెంటనే పది నుంచి ఒకటి వరకు అంకెలు లెక్కిస్తే ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది. 

భోజనం వేళ ప్రకారం చేయడం లేదా..?!!


పని ఒత్తిడి కారణంగా నిర్ణీత వేళకు భోజనం చేయరు. ఒక సమయం సందర్భం అంటూ లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు భోజనం 

తీసుకుంటే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఒకసారి మనమూ తెలుసుకుందాం. ఒక 
క్రమం ప్రకారం భోజనం చేయకపోవడం వల్ల కడుపులో క్రమక్రమంగా గ్యాస్‌ (అసిడిటి) సమస్య పెరిగి, శరీర పటుత్వాన్ని 

కోల్పోవడం, జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయని చెపుతున్నారు.

అందానికి మేలు చేసే క్యారెట్...



 నిత్యం మన వంట గదిలో కనిపించే క్యారెట్ ఆరోగ్యానికే కాదు అందానికి ఉపకరిస్తుంది. శక్తిని ఇచ్చే క్యారెట్ సౌందర్య సాధనగా కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. క్యారెట్‌లో బీటా కెరోటిన్లూ, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తితో పాటు చర్మానికి మెరుపును కూడా ఇస్తాయి. నాలుగు స్పూన్ల క్యారెట్ జ్యూస్‌లో, రెండు స్పూన్ల బొప్పాయి జ్యూస్, అందులో కొద్దిగా పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి గంట సేపటి తర్వాత నీళ్లతో కడిగేస్తే చాలు మెరిసే ముఖ సౌందర్యం మీ సొంతం.

 
అదేవిధంగా క్యారెట్ యాంటీ ఏజింగ్ కారకంగా కూడా పనిచేస్తుంది. రెండు టీ స్పూన్ల క్యారెట్ రసంలో, కొంచెం అరటి పండు గుజ్జు, గుడ్డులోని తెల్లసొన, నాలుగు చుక్కల నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై వలయాకారంగా రుద్దుతూ 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఈ ప్యాక్ వల్ల ముఖం మీద ముడతలు మాయమవుతాయి.
 
ఇంకా ఒక టీస్పూన్ క్యారెట్ రసంలో, కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసి పావుగంట తర్వాత కడిగేయాలి. ఈ విధంగా వారానికి మూడు సార్లు చేస్తే ముఖం తాజాగా మారుతుంది. అదేవిధంగా ముఖంపై మొటిమలు ఉన్న వారు రెండు స్పూన్ల క్యారెట్ రసంలో ఒక స్పూన్ తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి కలపాలి. దీన్ని ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేయాలి. దీనివల్ల మొటిమలు మాయమవడమే కాకుండా ముఖ తేజస్సు మెరుగుపడుతుంది.

ఆయనకు ఒక్క నిమిషం కూడా ఉండటం లేదు... ఏంటి మార్గం...?


సమస్య చెప్పుకునేందుకు ఆయన చాలా సిగ్గుపడిపోతున్నారు. సెక్స్ చేసేందుకు ఎంతో ఉత్సాహం చూపించిన ఆయన ఒక్క నిమిషంలో శ్రీఘ్రస్ఖలనం చేసి ఆ తర్వాత మళ్లీ ఎంతో ప్రయత్నిస్తారు. కానీ నో యూజ్. సమస్యను వైద్యుల వద్ద చెప్పుకోమని బ్రతిమాలుతున్నా వినడంలేదు. ఆయుర్వేదంలో ఈ సమస్య నివారణకు ఏదైనా మార్గం ఉందా...?
andariki-ayurvedam99-sex-issues



శీఘ్ర స్ఖలనం సమస్యకు పూర్తి కారణం మానసిక ఒత్తిళ్లే కారణమని చాలామంది చెబుతుంటారు. పూర్తిస్థాయిలో మానసిక ఒత్తిళ్లును అధిగమించడం ఎప్పటికీ సాధ్యం కాదు కాబట్టి శీఘ్రస్ఖలన సమస్యను జీవిత కాలపు సమస్య అనుకోవాలా? వాస్తవానికి మానసిక కారణాలతో శీఘ్రస్ఖలన సమస్య రావడ అన్నది కేవలం 10 శాతం మందిలోనే. మిగతా 90 శాతం మందికి శారీరక కారణాలే ఉంటాయి. ఆయుర్వేద ఔషధాలతో ఆ 90 శాతం మంది తమ శీఘ్రస్ఖలన సమస్య నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. మిగతా 10 శాతం సమస్యలు కౌన్సెలింగ్‌తో తొలగిపోతాయి. అలా నూటికి నూరు శాతం మంది శీఘ్రస్ఖలన సమస్యనుంచి పూర్తిగా బయటపడవచ్చునంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 శాతం మంది పురుషులు నేడు ఈ శీఘ్రస్ఖలన సమస్యను ఎదురర్కొంటున్నట్లు శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. సుమారు 15 ఏళ్ల క్రితం కేవలం 5 శాతం మందిలోనే ఈ శీఘ్రస్ఖలన సమస్య ఉండేది. ఇప్పుడది 40 శాతం మందిలో ఉంటోంది. అలాగే ఒకప్పుడు 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కుల్లోనే ఈ సమస్య కనిపించేది. ఇప్పుడది 18 నుంచి 40 ఏళ్లలోపు వారిలో కూడా ఈ సమస్య ఉంటోంది.
అల్లోపతి వైద్య విధానం శీఘ్రస్ఖలన సమస్యకు మూలం మెదడులోనే ఉందని, మానసిక ఒత్తిళ్లే దానికి అతి పెద్ద కారణమని అదేపనిగా చెబుతూ ఉంటుంది. కానీ, అది నిజం కాదు. శీఘ్రసమస్య కారణాల్లో మెదడు కూడా ఒక భాగమే. కానీ, దానికి మించి హార్మోన్ సమస్యలు అతి పెద్ద కారణంగా ఉంటాయి. వాటితో పాటు కండరాలు, నరాలు, రక్తనాళాలు వీటన్నింటి భూమిక కీలకంగానే ఉంటుంది. వీటన్నిటితో పాటు ఇటీవల జరిపిన పరిశోదనల్లో శీఘ్రస్ఖలన సమస్యకు నాడీవ్యవస్థలో అంతటా ఉండే సెరటోనిన్ పరిమాణం తగ్గడం ఒక ప్రధాన కారణమని తేలింది. ఈ వాస్తవాల్ని విస్మరించి చాలా మంది శీఘ్రస్ఖలన సమస్యకు మానసిక ఒత్తిళ్లే కారణమని చెబుతూ వస్తున్నారు. నిజానికి ఈ సమస్యకు గల 80 శాతం కారణాలు శారీరకమైనవే మిగతా 20 శాతమే మానసికమైనవి.
ఇవీ కారణాలు
శీఘ్రస్ఖలన సమస్యకు హార్మోనల్ లెవెల్స్‌లో తేడాలు, కెమికల్ (సెరటోనిన్)లెవెల్స్‌లో తేడాలు, ఎజాకులేటరీ సిస్టమ్‌లోని లోపాలు ఒక ప్రధాన కారణమవుతాయి. అలాగే, వంశానుగతంగా, జన్యుపరంగా వచ్చే మూలాలు కూడా శీఘ్రస్ఖలనానికి కారణమవుతాయి.శారీరక కారణాల్లో అంగం శీర్షంలో అతిగా స్పందించే లక్షణం ఒక కారణం. ప్రొస్ట్రేట్ వ్యాధులు ఉన్నవారిలో కూడా ఈ సమస్య ఉంటుంది. యురెథ్రాలో వాపు గానీ, ఇన్‌ఫెక్షన్లు ఉన్నా ఈ సమస్య రావచ్చు. అంటే మూత్రాన్ని, శుక్రాన్ని తీసుకువచ్చే యూరేటరీ ట్యూబ్స్‌లో సమస్య ఉన్నా, యురెథ్రాలో సమస్య ఉన్నా ఈ సమస్య రావచ్చు. అలాగే బిపి, షుగర్, అతి మద్యపానం వీటివల్ల కూడా శీఘ్రస్ఖలన సమస్య రావచ్చు.
సరైన వైద్యం అందకపోతే...
శీఘ్రస్ఖలన సమస్య వల్ల ఆ సమస్యను అస్తమానం తలుచుకుంటూ ఉండడం వల్ల ఆందోళన మొదలవుతుంది. ఆందోళన వల్ల శృంగారం అంటేనే వెనుకంజ వేసే యాంగ్జయిటీ వస్తుంది. ఈ యాంగ్జయిటీ చివరికి డిప్రెషన్‌కు దారి తీస్తుంది. డిప్రెషన్ అంగస్తంభన లోపాలకు దారి తీస్తుంది. అంగస్తంభన లోపం చివరికి నపుంసకత్వానికి దారి తీస్తుంది. శీఘ్రస్ఖలన సమస్య మౌలికంగా రెండు ప్రధాన సమస్యలకు దారి తీస్తుంది. వాటిలో మొదటిది దాంపత్యబంధం భారంగానూ, బాధాకరంగానూ మారుతుంది. ఈ సమస్య అంతిమంగా సంతానలేమికి కూడా కారణమవుతుంది.
అల్లోపతి ఏం చేస్తుంది?
వీటితో పాటు అంగ శీర్షాన్ని మొద్దుబారేలా చేసేందుకు డి-సెన్సిటైజేషన్ క్రీములు, స్ప్రేలు సూచిస్తారు. దీనివల్ల పురుషుడికి కలిగే ప్రయోజనం అటుంచి, ఆ క్రీముతో స్త్రీ జననాంగం మొద్దుబారిపోయి అసలు ఆ శృంగారం తాలూకు అనుభూతే కలగకుండాపోతుంది. కొందరికి లాంగ్ లవ్ కాండోమ్స్ ఇస్తారు. ఆ కాండోమ్‌లో లోకల్ అనస్థిటిక్ డ్రగ్‌ను పెడతారు. మరికొందరికి ఒకేసారి రెండేసి కాండోమ్స్ వాడమంటారు. మరికొందరు అంగాన్ని బిగదీసే ఒక రింగ్‌ను రోజూ అరగంట సేపు ఉంచమంటారు. అలాగే కొందరు ముక్కులో వేసుకునే నాసల్- స్ప్రే సూచిస్తారు. ఇవన్నీ అల్లోపతి విధానంలో వారు చేసేవన్నీ తాత్కాలికంగా ఉపకరించేవే తప్ప సమస్యను శాశ్వతంగా తొలగించలేవు.
ఆయుర్వేదం ఓ అద్భుతం
అల్లోపతిలో శీఘ్రస్ఖలనం అన్నది ఎప్పటికీ తొలగిపోని శాశ్వత వ్యాధి. ఆయుర్వేదంలో అది సంపూర్ణంగా తొలగిపోయే సమస్య. మౌలికంగా శీఘ్రస్ఖలనం అన్నది వాత వికృతి వల్ల తలెత్తే సమస్య. అందుకే శీఘ్రస్ఖలన సమస్య నివారణకు ఆయుర్వేదంలో వాతహర చికిత్సలు చేస్తారు. వాతపిత్తకఫాలు సామ్యావస్థకు చేరుకునే వైద్యం చేస్తారు. ఆ పైన రసాయన, వాజీకరణ చికిత్సలు చేస్తారు. ఇందులో వీర్యకణాల సంఖ్యను పెంచే విధానం కూడా ఉంటుంది. వీటితో పాటు లైంగిక పటిమను పెంచేవి, మానసిక సమస్యలను తొలగించేవి, శుక్రాన్ని శక్తివంతం చేసేవి ఇలా పలురకాల ఔషధాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. 
ఈ చికిత్సలతో కావాలనుకున్నవారికి ఈ సమస్యలన్నీ తొలగిపోయి సంతానప్రాప్తి కూడా కలుగుతుంది. ఆయుర్వేద చికిత్సలతో సప్తధాతువుల్లోని చివరిదైన శుక్రం పరిపుష్టం కావడమే కాకుండా, ప్రాణవంతమైన ఓజస్సు కూడా వృద్ది చెందుతుంది. అయితే వాజీకరణాలు గానీ, రసాయనాలు గానీ తీసుకునే ముందు శరీరంలోని ఆమాన్ని, అంటే వ్యర్థ, విషపదార్థాలను సంపూర్ణంగా తొలగించుకోవాలి. అందుకు పంచకర్మ చికిత్సలు చేయించుకోవాలి. వీటన్నిటిద్వారా మొత్తంగా లైంగిక శక్తి, కండరాల వ్యవస్థ, నాడీ వ్యవస్థ సర్వశక్తివంతంగా మారి, అవి తమ సహజశైలిలో పనిచేయడం మొదలెడతాయి. పురుషత్వ లోపాలతో ఎవరూ సంపూర్ణ పురుషుడు కాలేడు. సకల ఐశ్వర్యాలను మించిన అలాంటి సంపూర్ణ పురుషత్వం సమగ్రమైన ఆయుర్వేద వైద్యంతోనే సాధ్యమవుతుంది.

ప్రపంచంలో మొదటి ఫాస్ట్‌ఫుడ్ ఏంటో తెలుసా....?


ప్రపంచంలోని మొదటి ఫాస్ట్‌ఫుడ్ అటుకులేనట. రకరకాల కూరగాయలూ పల్లీలతో కలిపి ఉప్మాలూ పులిహోరలూ పాయసాలూ ఇలా ఎన్నో చిటికెలో చేసుకోవచ్చు. నేరుగా పాలల్లో వేసుకునో కాస్త బెల్లంముక్క పెట్టుకునో తినడం మనకు ప్రాచీనకాలం నుంచీ అలవాటే. కానీ అటుకుల్ని పోషకాహారంగా గాక ఏదో చిరుతిండిలో భాగంగా భావిస్తాం. కానీ ఏ రకం ధాన్యంతో చేసిన అటుకుల్లోనయినా పిండిపదార్థాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఖనిజాలూ, విటమిన్లూ, ప్రొటీన్లూ కూడా ఎక్కువే. చిప్స్, బిస్కట్లతో పోలిస్తే మంచి స్నాక్‌ఫుడ్. ఉదాహరణకు వరి అటుకుల్నే తీసుకుంటే వీటిని రోజూ తినడం వల్ల ఐరన్ లోపం తలెత్తదు. 100 గ్రా. వరి అటుకుల్లో 20 మి.గ్రా. ఐరన్ ఉంటుంది. అందుకే పిల్లలకీ గర్భిణులకీ పాలిచ్చే తల్లులకీ ఇది మంచి ఆహారం.
andariki-ayurvedam-fast-food


• అటుకు(ఫ్లేక్స్)ల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోకి పిండిపదార్థాలు కొంచెం కొంచెంగా చేరేలా చేస్తాయి. అందుకే డయాబెటిస్ రోగులకూ ఇవి మంచివే. ఆకలేసినప్పుడు గుప్పెడు అటుకులు తింటే పొట్ట నిండినట్లుగానూ అనిపిస్తుంది.
 
• ఫ్లేక్స్‌లోని ఫైటో కెమికల్స్, యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి.
 
• అటుకులు ప్రొబయోటిక్ ఆహారం కూడా. ధాన్యాన్ని నానబెట్టి, వడేసి మిల్లు పడతారు. తరవాత ఆ నీరంతా ఇంకిపోయేలా ఎండబెడతారు. ఇలా చేయడంవల్ల అవి పులిసినట్లుగా అవుతాయి. ఆ సమయంలో వాటిల్లో ప్రొబయోటిక్ బ్యాక్టీరియా చేరుతుంది. వీటిల్లో ఉండే ఈ బ్యాక్టీరియా కారణంగానే కొన్ని ప్రాంతాల్లో వీటిని నీళ్లలో నానబెట్టుకుని మరీ తాగుతారు. గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉన్నా లేదా ఇతరత్రా ఏ కారణంతోనయినా పొట్ట అప్‌సెట్ అయినా అటుకుల టానిక్ ఔషధంలా పనిచేస్తుంది.
 
• గోధుమ అటుకుల్లో ఐరన్, పీచుతోపాటు కాల్షియం కూడా ఎక్కువ.బీ ఓట్స్‌మీల్ లేదా ఫ్లేక్స్‌ని అల్పాహారంగా తీసుకోవడంవల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.
 
• పిండిపదార్థాలు, ఐరన్, బి- కాంప్లెక్స్ సమృద్ధిగా ఉండే కార్న్‌ఫ్లేక్స్ అందరికీ మంచివే.
• అన్ని రకాల ధాన్యాల్లోని పోషకాలూ కావాలనుకుంటే నాలుగైదు రకాల ఫ్లేక్స్‌ని పాలల్లో వేసుకుని, వాటికి ఎండుద్రాక్ష, బాదం, మరేమైనా పండ్లూ కూడా కలిపి కూడా తీసుకోవచ్చు. పిల్లలకు ఎంతో శక్తినిస్తాయివి.

గుండె జబ్బులను తగ్గించే కొబ్బరి నీళ్ళు..!


కొబ్బరి నీళ్ళలో దివ్య ఔషధాలు ఉన్నాయి. దాహం తీర్చడమే కాకుండా, ఇందులో ఉండే మినరల్స్ శరీరానికి మేలు చేస్తాయి. అంతేగాకుండా కొబ్బరి నీళ్లలో శరీరానికి కావలసిన రోగనిరోధక శక్తి పుష్కలంగా దొరుకుతుంది. కొబ్బరి నీళ్ళు సేవించడం వల్ల అనేక రోగాలు మన దరికిచేరవు. వాతం, పిత్తం గుణాలను పూర్తిగా హరిస్తుంది. 
andariki-ayurvedam99-kobbari-neellu

 
వేడిని తగ్గిస్తాయి. విరేచనాలను అరికడుతుంది. గుండె జబ్బులను తగ్గిస్తాయి. అన్నింటికంటే శక్తిని, బలాన్నిచేకూరుస్తాయి. అందుచేత రోజూవారీగా ఓ కొబ్బరి బొండాంలోని నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే కొబ్బరి నీళ్లను తాగడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరగడంతో వ్యాధులు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఆయుర్వేద చిట్కాలు


* గుల్లసున్నం ను ఆముదం లో కలిపి నూరి ఒంటికి రాసుకుంటే నొప్పులు తగ్గుతాయి.

* ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ తేనె కలుపుకుని పరగడుపున తాగితే చర్మకాంతి మెరుగై, నునుపు దేలుతుంది.

* ప్రతి రోజు రెండు జమపూలు తింటే నేత్ర వ్యాదులు  దూరమువుతుంది.

* తరచుగా పచ్చికొబ్బరి  తింటూ ఉంటె గుండెకు బలం చేకూరుతుంది.
ayurvedam


* కొత్తిమీర ఆకులను నలిపి వాసన చూస్తుంటే తుమ్ములు ఆగిపోతాయి.

* ప్రసవానతరం పసిపిల్లల తల్లులు క్యాబేజీ తరుచుగా తీసుకుంటే పాలు పడతాయి.

* కరక్కాయ పొడితో పళ్ళు రుద్దుకుంటే పళ్ళు గట్టి పడతాయి.

* చామనచాయగా ఉండేవారు తరుచూ అనాసపండు తింటూ ఉంటే మేలు కలుగుతుంది.  

మొటిమలతో చికాకు... దూరం చేయడం ఎలా...?


ముఖంపై మొటిమలు బాధిస్తుంటే.. పుదీనా ఆకుల రసం మొటిమలపై రాసి రాత్రంతా వదిలేసి ఉదయాన్నే కడిగేయాలి. చెంచా చొప్పున బియ్యం, గసగసాలూ, బాదం గింజలను తీసుకుని మెత్తగా చేయాలి. ఈ మిశ్రమానికి రెండు చెంచాల
andariki-ayurvedam-pimples
పెరుగు కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాయాలి. పది నిమిషాల తర్వాత కడిగేస్తే మొటిమలతో పాటూ వాటి తాలూకు మచ్చలూ మాయమవుతాయి.
• సమపాళ్లలో సెనగపిండీ, పెరుగూ తీసుకుని మిశ్రమంలా చేసి ముఖానికి రాయాలి. ఇలా రెండ్రోజులకోసారి చేస్తే సరి. దాల్చిన చెక్క పొడిలో కాసిని నీళ్లు పోసి మొటిమలున్న చోట రాయాలి. ఇలా పదిరోజులకోసారి చేయాలి. సెనగపిండిలో కొంచెం తేనె వేసి కలిపి ముఖానికి రాయాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది.
• తులసి ఆకుల్ని మెత్తగా చేసి ముఖానికి పట్టించినా సరిపోతుంది. మెంతి ఆకుల్ని మెత్తగా నూరి రాత్రి పడుకునే ముందు మొటిమలపై రాసి ఉదయాన్నే కడిగేయాలి. నారింజ తొక్కల్ని ఎండబెట్టి పొడి చేయాలి. దీనికి కొన్ని నీళ్లు చేర్చి రాత్రిపూట మొటిమలపై రాయాలి. చెంచా నిమ్మరసానికి అరచెంచా పచ్చి పాలు చేర్చి ముఖంపై రాసి అరగంట తర్వాత కడిగేసినా మంచిదే.
• చెంచా కొత్తిమీర రసానికి చిటికెడు పసుపు చేర్చి సమస్య ఉన్నచోట రాయాలి. ఇలా వారం పాటు క్రమం తప్పకుండా చేయాలి. కీరదోస గుజ్జును ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత కడిగేసినా ఫలితం ఉంటుంది.

జీడిప‌ప్పు తింటే కలిగే ఫలితాలేంటి...?


మన శరీరంలో ఎక్కువగా ఉండే ఖనిజాల్లో మెగ్నీషియం కూడా ఒకటి. ఇది సుమారు 300 రకాల జీవ రసాయనిక చర్యల్లో పాలుపంచుకుంటుంది. ఇది మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో దీన్నిబట్టే అర్థమవుతుంది. మన శరీరంలోని మెగ్నీషియంలో సగం వరకు ఎముకల్లోనే ఉంటుంది. మిగతాది కణాల లోపల, కణజాలంలో, అవయవాల్లో ఉంటాయి. కండరాలు, నాడుల పనితీరు సక్రమంగా జరగాలంటే ఈ మెగ్నీషియం ఎక్కువగా తోడ్పడుతుంది. ఇది పక్షవాతం ముప్పునూ తగ్గిస్తున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది.
andariki-ayurvedam-jeedipappu

 
మెగ్నీషియం సమృద్ధిగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకునే వారిలో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం ద్వారా వచ్చే పక్షవాతం ముప్పూ తక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఆహారం ద్వారా తీసుకునే మెగ్నీషియంలో అదనంగా 100 మిల్లీగ్రాముల మోతాదు పెరుగుతున్నకొద్దీ పక్షవాతం ముప్పు తొమ్మిది శాతం తగ్గుతున్నట్టు కనుగొన్నారు.
 
పొట్టు తీయని ధాన్యాలు.. పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు, చిక్కుడు జాతి కూరగాయలు (బీన్స్), బాదం, జీడిపప్పు వంటి గింజపప్పుల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. కప్పు బీన్స్ లేదా ముడి బియ్యం, 30 గ్రాముల బాదం లేదా జీడిపప్పు, కప్పు ఉడికించిన పాలకూర తింటే సుమారు 100 గ్రాముల మెగ్నీషియం లభిస్తుంది. ఇవి గుండె ఆరోగ్యంగా ఉండేందుకూ దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని తరచుగా తినటం ద్వారా గుండెజబ్బుల బారినపడకుండా చూసుకోవచ్చు.

యవ్వనంగా ఉండాలంటే... వనమూలికలు వాడండి!


ఆధునిక యుగంలో నలుగురితో సమానంగా జీవించేందుకు ఉద్యోగాలు, వృత్తులపై దృష్టి సారించడం ఎక్కువైపోయింది. ఆదాయం కోసం ఆరోగ్యం, అందం గురించి ఏమాత్రం లెక్క చేయని ఎంతో మంది ఉన్నారు. అలాంటివారు మీరైతే.. ఈ కథనం చదవాల్సిందే. 

వాతావరణ కాలుష్యం మనిషిని పట్టిపీడిస్తోంది. ఇలాంటి తరుణంలో రసాయినాలు కలిపిన మందులు వాడకం మరింత ప్రమాదకరం. వైద్యం కూడా ఖరీదైపోయింది. వెంట్రుకలు రాలిపోవడం, చర్మం ఎండిపోవడం వంటి సమస్యలకు చెక్ పెట్టి, యవ్వనంగా కనిపించాలంటే.. మందు మొక్కలు (వనమూలికలు) తక్కువ ఖర్చుతో ఎక్కవ ఫలితాలనిస్తున్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

అశ్వగంది, రియోడియోలా రోసియా, రోకా వంటి మొక్కలు వయసుతో వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి ఉపకరిస్తున్నాయి. అశ్వగంధి అనే మొక్క ప్రకృతి ప్రసాదించిన వైద్య మొక్క. వయసును కప్పి పెట్టడానికి అవస్థలు పడేవారికి వరప్రసాదిని. సహజంగానే దీనికి మనిషిని యవ్వనంగా ఉంచే లక్షణాలు ఉంటాయి. 
andariki-ayurvedam99

ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుతాయి. మానసిక ఒత్తిడిని నియంత్రించే వ్యవస్థకు ఇతోధికంగా దోహద పడుతాయి. మనిషిలోని ఆందోళన, ఆత్రుత, మానసిక వైరాగ్యాలను తగ్గిస్తుంది. అక్షనాళము, డెనడ్రాన్లను పెంపొందించి ఆరోగ్యానికి మేలు చేకూర్చుతుంది. 

రోహాలియా రోసియా(గులాబీ) ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. మనిషిని మరింత ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఇందులోని ఔషద గుణాలు దివ్యంగా ఉంటాయి. ఒత్తిడి నుంచి వెసులుబాటు కలిగిస్తూ శరీరంలోని కణాలకు కొత్త శక్తిని ఇస్తాయి. ఈ మొక్క వ్యాధినిరోధకతను పెంచడంతోపాటు మానసిక స్థితిని మెరుగు పరుస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

గిన్సెంగ్‌ అనేది మంచి ఔషద మూలిక దీనిలో కూడా ఇదే విధంగా యవ్వనాన్ని పెంపొందించే లక్షణాలున్నాయి. ఈ మూలిక తీసుకున్న వారిలో ఉద్వేగం పెరగడంతోపాటు శారీరక దృఢత్వం పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గడం, రక్త ప్రసరణను పెంచడం, శరీరంలో కొలస్ర్టాల్‌ను నియంత్రించడానికి ఇది దోహద పడతుంది.