ప్రపంచంలో మొదటి ఫాస్ట్‌ఫుడ్ ఏంటో తెలుసా....?


ప్రపంచంలోని మొదటి ఫాస్ట్‌ఫుడ్ అటుకులేనట. రకరకాల కూరగాయలూ పల్లీలతో కలిపి ఉప్మాలూ పులిహోరలూ పాయసాలూ ఇలా ఎన్నో చిటికెలో చేసుకోవచ్చు. నేరుగా పాలల్లో వేసుకునో కాస్త బెల్లంముక్క పెట్టుకునో తినడం మనకు ప్రాచీనకాలం నుంచీ అలవాటే. కానీ అటుకుల్ని పోషకాహారంగా గాక ఏదో చిరుతిండిలో భాగంగా భావిస్తాం. కానీ ఏ రకం ధాన్యంతో చేసిన అటుకుల్లోనయినా పిండిపదార్థాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఖనిజాలూ, విటమిన్లూ, ప్రొటీన్లూ కూడా ఎక్కువే. చిప్స్, బిస్కట్లతో పోలిస్తే మంచి స్నాక్‌ఫుడ్. ఉదాహరణకు వరి అటుకుల్నే తీసుకుంటే వీటిని రోజూ తినడం వల్ల ఐరన్ లోపం తలెత్తదు. 100 గ్రా. వరి అటుకుల్లో 20 మి.గ్రా. ఐరన్ ఉంటుంది. అందుకే పిల్లలకీ గర్భిణులకీ పాలిచ్చే తల్లులకీ ఇది మంచి ఆహారం.
andariki-ayurvedam-fast-food


• అటుకు(ఫ్లేక్స్)ల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోకి పిండిపదార్థాలు కొంచెం కొంచెంగా చేరేలా చేస్తాయి. అందుకే డయాబెటిస్ రోగులకూ ఇవి మంచివే. ఆకలేసినప్పుడు గుప్పెడు అటుకులు తింటే పొట్ట నిండినట్లుగానూ అనిపిస్తుంది.
 
• ఫ్లేక్స్‌లోని ఫైటో కెమికల్స్, యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి.
 
• అటుకులు ప్రొబయోటిక్ ఆహారం కూడా. ధాన్యాన్ని నానబెట్టి, వడేసి మిల్లు పడతారు. తరవాత ఆ నీరంతా ఇంకిపోయేలా ఎండబెడతారు. ఇలా చేయడంవల్ల అవి పులిసినట్లుగా అవుతాయి. ఆ సమయంలో వాటిల్లో ప్రొబయోటిక్ బ్యాక్టీరియా చేరుతుంది. వీటిల్లో ఉండే ఈ బ్యాక్టీరియా కారణంగానే కొన్ని ప్రాంతాల్లో వీటిని నీళ్లలో నానబెట్టుకుని మరీ తాగుతారు. గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉన్నా లేదా ఇతరత్రా ఏ కారణంతోనయినా పొట్ట అప్‌సెట్ అయినా అటుకుల టానిక్ ఔషధంలా పనిచేస్తుంది.
 
• గోధుమ అటుకుల్లో ఐరన్, పీచుతోపాటు కాల్షియం కూడా ఎక్కువ.బీ ఓట్స్‌మీల్ లేదా ఫ్లేక్స్‌ని అల్పాహారంగా తీసుకోవడంవల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.
 
• పిండిపదార్థాలు, ఐరన్, బి- కాంప్లెక్స్ సమృద్ధిగా ఉండే కార్న్‌ఫ్లేక్స్ అందరికీ మంచివే.
• అన్ని రకాల ధాన్యాల్లోని పోషకాలూ కావాలనుకుంటే నాలుగైదు రకాల ఫ్లేక్స్‌ని పాలల్లో వేసుకుని, వాటికి ఎండుద్రాక్ష, బాదం, మరేమైనా పండ్లూ కూడా కలిపి కూడా తీసుకోవచ్చు. పిల్లలకు ఎంతో శక్తినిస్తాయివి.

No comments:

Post a Comment