సహనం కోల్పోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. ఎందుకని?


సహనం జ్ఞానాన్ని పెంచేందుకు సహకరిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే సహనాన్ని కీలకమైన సమయంలో కోల్పోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పెద్దలు అంటుంటారు. అందుకే సహనంతో ఉండాలని మన పెద్దలు హితబోధ చేస్తుంటారు. 
అయితే, ఈ సహనాన్ని ఎలా పెంపొందించుకోవాలి, ఒకవేళ సహనం తక్కువగా ఉంటే ఏ విధంగా అలవర్చుకోవాలన్న దానికి కొన్ని సాధారణ నియమాలను పాటిస్తే సరిపోతుంది. ముఖ్యంగా, మహిళలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మరీ మంచిది. 
andariki-ayurvedam-sahanam-kolpothe
తరచూ సహనాన్ని కోల్పోతున్నట్టు అనిపిస్తే శారీరక వ్యాయామం ద్వారా సమస్యను అధిగమించటానికి ప్రయత్నించాలి. ఒక విషయంలో సహనం కోల్పోతున్నట్టు భావిస్తే మనలో మనమే నిగ్రహించుకునేందుకు ప్రయత్నించాలి. 
ముఖ్యంగా కీలక సమయాల్లో మన మాటకు ఎవరన్నా తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనే విషయం అర్థమైనప్పటికీ దాన్ని పెద్దగా తీసుకోకుండా ఉండటం ఎంతో మంచిది. తామరాకు మీద నీటిబొట్టులాగ భావోద్వేగాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. సహనం హద్దులు దాటుతున్నట్టు లేదా నోరు అదుపు జారుతుందని అనిపించినా వెంటనే పది నుంచి ఒకటి వరకు అంకెలు లెక్కిస్తే ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది. 

No comments:

Post a Comment