వయస్సు మీద పడుతోందని బాధగా ఉందా.. అంతేకాదు.. మీరు యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా.. అయితే ఈ కింది వివరాలు చదవాల్సిందే. వయస్సు మీద పడినా తెలియకుండా ఉండాలంటే ద్రాక్ష పండ్లను ప్రతిరోజూ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గ్రేప్స్ తీసుకోవడం ద్వారా యవ్వనంగా కనిపించడంతో పాటు స్కిన్ కేన్సర్‌కు కూడా చెక్ పెట్టవచ్చునని వారంటున్నారు.
సూర్యకిరణాల నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాల ప్రభావంతో కలిగే చర్మ వ్యాధులను నియంత్రించడంలో ద్రాక్ష పండ్లు ఎంతగానో ఉపయోగపడుతాయట. అల్ట్రా వెయొలెట్ (యూవీ) చర్మ కణాలను సత్తువ లేకుండా చేస్తాయి. తద్వారా చర్మం పాలిపోవడంతో పాటు వయస్సుమీద పడినట్లు స్కిన్ కనిపిస్తుందని చర్మ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ద్రాక్షపండ్లను తీసుకోవడం ద్వారా యూవీ ప్రభావాన్ని చర్మంపై సోకకుండా చాలావరకు నియంత్రిస్తుందని వారు చెప్పారు.
Click Here to See More
Click Here to See More
No comments:
Post a Comment