Breaking News
Loading...

Info Post



* అరటిపండు ఆరోగ్యకరమే, కానీ దీని కాడ తినదగినది కాదని అందరి భావన.
* అరటిపండు కాడ అధిక మొత్తంలో పోషకాలను, మినరల్ లను కలిగి ఉంటుంది.
* సలాడ్ & సూప్స్ లలో అరటిపండు బెరడును కలుపుకోండి.
* లేతగా ఉండే అరటిపండు కాడలకు దూరంగా ఉండండి.




andariki-ayurvedam-arati-kaada




చాలా మంది అరటిపండు తినటాన్ని ఉత్సాహంగా భావిస్తుంటారు మరియు రోజు పాటించే ఆహార ప్రణాళికలో కూడా కలుపుకొంటారు. కానీ, చాలా తక్కువ మంది మాత్రమే అరటికాడను తింటూ ఉంటారు. అరటిపండు కాడ చాలా మందికి ఒక వ్యర్థ పదార్థంగా భావిస్తారు. ఒకసారి చెట్టు నుండి అరటిపండు గెలను వేరు చేసిన తరువాత, పండ్లను వేరు చేయగానే, కాడను వ్యర్థ పదార్థంగా భావించి భయట పడేస్తారు. కానీ, ఈ కాడ అనేక పోషకాలను కలిగి ఉండి, ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. అరటిపండు కాడను మీ ఆహరంలో భాగంగా కలుపుకోటానికి గల కారణాల గురించి కింద పేర్కొనబడింది.


అరటి కాడతో బరువు తగ్గుదల

అరటి కాడ అధిక మొత్తంలో ఫైబర్ లను కలిగి ఉండి, ఎక్కువ సమయం పాటు ఆకలి అవకుండా ఉంచుతుంది. అనారోగ్యకర మరియు అధిక క్యాలోరీలను అందించే ఆహార పదార్థాలకు బదులుగా, అరటికాడను కలుపుకోవటం వలన క్రమక్రమంగా శరీర బరువు కూడా తగ్గుతుంది. అరటి కాడను జ్యూస్ రూపంలో లేదా లేదా వేడి చేసిన సారాన్ని కూడా తాగవచ్చు.



మినరల్

అరటి కాడ కూడా పొటాషియం మరియు విటమిన్ 'B6'లను కలిగి ఉంటుంది. విటమిన్ 'B6' హిమోగ్లోబిన్మరియు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి, శరీరంలో చేరే ఇన్ఫెక్షన్ లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. దీనిలో ఉండే పొటాషియం, శరీర కండరాల పనితీరును పెంచటమేకాకుండా, అధిక రక్తపీరనాన్ని అదుపులో ఉంచి, నాడీ ప్రచోదనాలలో సహాయపడి మరియు శరీరంలో ద్రావణాల స్థాయిలను మెరుగుపరుస్తుంది.


సహజ నిర్విషీకరణ

అరటికాడ సహజ డైయూరేటిక్ గుణాలను కలిగి ఉండి, శరీరాన్ని నిర్విషీకరణకు గురి చేస్తుంది. అంతేకాకుండా, మూత్రపిండాలలో తయారయ్యే రాళ్ళను కూడా తగ్గించుటలో సహాయపడుతుంది. అరటికాడను పాటించే ఆహార ప్రణాళికలో కలుపుకోవటం వలన పూర్తి ఆరోగ్యంతో పాటు, మూత్ర పిండాల పనితీరు కూడా అన్ని విధాల మెరుగుపడుతుంది.

అంతేకాకుండా, ఇది మలబద్దకానికి లాక్సైటీవ్ గా పని చేస్తుంది. వీటితో పాటుగా, అరటికాడలో ఉండే ఫైబర్ లు మలబద్దకాన్ని నివారించి, శరీరంపై సానుకూల ప్రభావాలను కలుగచేస్తాయి.

అరటికాడ మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అనేది సత్యం. కావున, దీనిని తినటానికి ఏ మాత్రం బిడియానికి గురవకండి. రోజు తాగే సూప్ లలో లేదా తినే సలాడ్ లలో లేదా నీటిలో కలిపి మరిగించి తినటం వలన అన్ని రకాలుగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

0 comments:

Post a Comment