సమస్య చెప్పుకునేందుకు ఆయన చాలా సిగ్గుపడిపోతున్నారు. సెక్స్ చేసేందుకు ఎంతో ఉత్సాహం చూపించిన ఆయన ఒక్క నిమిషంలో శ్రీఘ్రస్ఖలనం చేసి ఆ తర్వాత మళ్లీ ఎంతో ప్రయత్నిస్తారు. కానీ నో యూజ్. సమస్యను వైద్యుల వద్ద చెప్పుకోమని బ్రతిమాలుతున్నా వినడంలేదు. ఆయుర్వేదంలో ఈ సమస్య నివారణకు ఏదైనా మార్గం ఉందా...?
శీఘ్ర స్ఖలనం సమస్యకు పూర్తి కారణం మానసిక ఒత్తిళ్లే కారణమని చాలామంది చెబుతుంటారు. పూర్తిస్థాయిలో మానసిక ఒత్తిళ్లును అధిగమించడం ఎప్పటికీ సాధ్యం కాదు కాబట్టి శీఘ్రస్ఖలన సమస్యను జీవిత కాలపు సమస్య అనుకోవాలా? వాస్తవానికి మానసిక కారణాలతో శీఘ్రస్ఖలన సమస్య రావడ అన్నది కేవలం 10 శాతం మందిలోనే. మిగతా 90 శాతం మందికి శారీరక కారణాలే ఉంటాయి. ఆయుర్వేద ఔషధాలతో ఆ 90 శాతం మంది తమ శీఘ్రస్ఖలన సమస్య నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. మిగతా 10 శాతం సమస్యలు కౌన్సెలింగ్‌తో తొలగిపోతాయి. అలా నూటికి నూరు శాతం మంది శీఘ్రస్ఖలన సమస్యనుంచి పూర్తిగా బయటపడవచ్చునంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 శాతం మంది పురుషులు నేడు ఈ శీఘ్రస్ఖలన సమస్యను ఎదురర్కొంటున్నట్లు శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. సుమారు 15 ఏళ్ల క్రితం కేవలం 5 శాతం మందిలోనే ఈ శీఘ్రస్ఖలన సమస్య ఉండేది. ఇప్పుడది 40 శాతం మందిలో ఉంటోంది. అలాగే ఒకప్పుడు 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కుల్లోనే ఈ సమస్య కనిపించేది. ఇప్పుడది 18 నుంచి 40 ఏళ్లలోపు వారిలో కూడా ఈ సమస్య ఉంటోంది.
అల్లోపతి వైద్య విధానం శీఘ్రస్ఖలన సమస్యకు మూలం మెదడులోనే ఉందని, మానసిక ఒత్తిళ్లే దానికి అతి పెద్ద కారణమని అదేపనిగా చెబుతూ ఉంటుంది. కానీ, అది నిజం కాదు. శీఘ్రసమస్య కారణాల్లో మెదడు కూడా ఒక భాగమే. కానీ, దానికి మించి హార్మోన్ సమస్యలు అతి పెద్ద కారణంగా ఉంటాయి. వాటితో పాటు కండరాలు, నరాలు, రక్తనాళాలు వీటన్నింటి భూమిక కీలకంగానే ఉంటుంది. వీటన్నిటితో పాటు ఇటీవల జరిపిన పరిశోదనల్లో శీఘ్రస్ఖలన సమస్యకు నాడీవ్యవస్థలో అంతటా ఉండే సెరటోనిన్ పరిమాణం తగ్గడం ఒక ప్రధాన కారణమని తేలింది. ఈ వాస్తవాల్ని విస్మరించి చాలా మంది శీఘ్రస్ఖలన సమస్యకు మానసిక ఒత్తిళ్లే కారణమని చెబుతూ వస్తున్నారు. నిజానికి ఈ సమస్యకు గల 80 శాతం కారణాలు శారీరకమైనవే మిగతా 20 శాతమే మానసికమైనవి.
ఇవీ కారణాలు
శీఘ్రస్ఖలన సమస్యకు హార్మోనల్ లెవెల్స్‌లో తేడాలు, కెమికల్ (సెరటోనిన్)లెవెల్స్‌లో తేడాలు, ఎజాకులేటరీ సిస్టమ్‌లోని లోపాలు ఒక ప్రధాన కారణమవుతాయి. అలాగే, వంశానుగతంగా, జన్యుపరంగా వచ్చే మూలాలు కూడా శీఘ్రస్ఖలనానికి కారణమవుతాయి.శారీరక కారణాల్లో అంగం శీర్షంలో అతిగా స్పందించే లక్షణం ఒక కారణం. ప్రొస్ట్రేట్ వ్యాధులు ఉన్నవారిలో కూడా ఈ సమస్య ఉంటుంది. యురెథ్రాలో వాపు గానీ, ఇన్‌ఫెక్షన్లు ఉన్నా ఈ సమస్య రావచ్చు. అంటే మూత్రాన్ని, శుక్రాన్ని తీసుకువచ్చే యూరేటరీ ట్యూబ్స్‌లో సమస్య ఉన్నా, యురెథ్రాలో సమస్య ఉన్నా ఈ సమస్య రావచ్చు. అలాగే బిపి, షుగర్, అతి మద్యపానం వీటివల్ల కూడా శీఘ్రస్ఖలన సమస్య రావచ్చు.
సరైన వైద్యం అందకపోతే...
శీఘ్రస్ఖలన సమస్య వల్ల ఆ సమస్యను అస్తమానం తలుచుకుంటూ ఉండడం వల్ల ఆందోళన మొదలవుతుంది. ఆందోళన వల్ల శృంగారం అంటేనే వెనుకంజ వేసే యాంగ్జయిటీ వస్తుంది. ఈ యాంగ్జయిటీ చివరికి డిప్రెషన్‌కు దారి తీస్తుంది. డిప్రెషన్ అంగస్తంభన లోపాలకు దారి తీస్తుంది. అంగస్తంభన లోపం చివరికి నపుంసకత్వానికి దారి తీస్తుంది. శీఘ్రస్ఖలన సమస్య మౌలికంగా రెండు ప్రధాన సమస్యలకు దారి తీస్తుంది. వాటిలో మొదటిది దాంపత్యబంధం భారంగానూ, బాధాకరంగానూ మారుతుంది. ఈ సమస్య అంతిమంగా సంతానలేమికి కూడా కారణమవుతుంది.
అల్లోపతి ఏం చేస్తుంది?
వీటితో పాటు అంగ శీర్షాన్ని మొద్దుబారేలా చేసేందుకు డి-సెన్సిటైజేషన్ క్రీములు, స్ప్రేలు సూచిస్తారు. దీనివల్ల పురుషుడికి కలిగే ప్రయోజనం అటుంచి, ఆ క్రీముతో స్త్రీ జననాంగం మొద్దుబారిపోయి అసలు ఆ శృంగారం తాలూకు అనుభూతే కలగకుండాపోతుంది. కొందరికి లాంగ్ లవ్ కాండోమ్స్ ఇస్తారు. ఆ కాండోమ్‌లో లోకల్ అనస్థిటిక్ డ్రగ్‌ను పెడతారు. మరికొందరికి ఒకేసారి రెండేసి కాండోమ్స్ వాడమంటారు. మరికొందరు అంగాన్ని బిగదీసే ఒక రింగ్‌ను రోజూ అరగంట సేపు ఉంచమంటారు. అలాగే కొందరు ముక్కులో వేసుకునే నాసల్- స్ప్రే సూచిస్తారు. ఇవన్నీ అల్లోపతి విధానంలో వారు చేసేవన్నీ తాత్కాలికంగా ఉపకరించేవే తప్ప సమస్యను శాశ్వతంగా తొలగించలేవు.
ఆయుర్వేదం ఓ అద్భుతం
అల్లోపతిలో శీఘ్రస్ఖలనం అన్నది ఎప్పటికీ తొలగిపోని శాశ్వత వ్యాధి. ఆయుర్వేదంలో అది సంపూర్ణంగా తొలగిపోయే సమస్య. మౌలికంగా శీఘ్రస్ఖలనం అన్నది వాత వికృతి వల్ల తలెత్తే సమస్య. అందుకే శీఘ్రస్ఖలన సమస్య నివారణకు ఆయుర్వేదంలో వాతహర చికిత్సలు చేస్తారు. వాతపిత్తకఫాలు సామ్యావస్థకు చేరుకునే వైద్యం చేస్తారు. ఆ పైన రసాయన, వాజీకరణ చికిత్సలు చేస్తారు. ఇందులో వీర్యకణాల సంఖ్యను పెంచే విధానం కూడా ఉంటుంది. వీటితో పాటు లైంగిక పటిమను పెంచేవి, మానసిక సమస్యలను తొలగించేవి, శుక్రాన్ని శక్తివంతం చేసేవి ఇలా పలురకాల ఔషధాలు ఆయుర్వేదంలో ఉన్నాయి.
ఈ చికిత్సలతో కావాలనుకున్నవారికి ఈ సమస్యలన్నీ తొలగిపోయి సంతానప్రాప్తి కూడా కలుగుతుంది. ఆయుర్వేద చికిత్సలతో సప్తధాతువుల్లోని చివరిదైన శుక్రం పరిపుష్టం కావడమే కాకుండా, ప్రాణవంతమైన ఓజస్సు కూడా వృద్ది చెందుతుంది. అయితే వాజీకరణాలు గానీ, రసాయనాలు గానీ తీసుకునే ముందు శరీరంలోని ఆమాన్ని, అంటే వ్యర్థ, విషపదార్థాలను సంపూర్ణంగా తొలగించుకోవాలి. అందుకు పంచకర్మ చికిత్సలు చేయించుకోవాలి. వీటన్నిటిద్వారా మొత్తంగా లైంగిక శక్తి, కండరాల వ్యవస్థ, నాడీ వ్యవస్థ సర్వశక్తివంతంగా మారి, అవి తమ సహజశైలిలో పనిచేయడం మొదలెడతాయి. పురుషత్వ లోపాలతో ఎవరూ సంపూర్ణ పురుషుడు కాలేడు. సకల ఐశ్వర్యాలను మించిన అలాంటి సంపూర్ణ పురుషత్వం సమగ్రమైన ఆయుర్వేద వైద్యంతోనే సాధ్యమవుతుంది.
0 comments:
Post a Comment