జుట్టు నల్లగా నిగనిగలాడానికి చిట్కా:


కావలసిన పదార్దాలు:

1.  వెల్లుల్లి పొట్టు


 2. కొబ్బరి నునే.

జుట్టు నల్లగా నిగానిగాలాడానికి చిట్కా


తయారుచేయు విధానం:

వెల్లుల్లి పొట్టుని ఒక కడాయిలో వేసి వేడి చేస్తే ,  అది నల్లగా మసిల మారుతుంది .
దానిని మంచి కొబ్బరి నునే తో కలిపి ,  ఒక సీస లో బద్రపరుచు కోవాలి.

రోజు క్రమం తప్పకుండ తలకు మర్దన చేయాలి.  ఇలా చేస్తే తెల్ల జుట్టు రాకుండా నివారించవచ్చు.  

ఆరోగ్య చిట్కాలు:


 *  జీలకర్ర లైంగికారొగ్యన్ని అందిచడం లో భేషుగా పనిచేస్తుంది.

 *  జీలకర్ర పొడి రూపం లో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.

 *  జీలకర్ర ఏకాగ్రతను పెంచుతుంది.


ఆరోగ్య చిట్కాలు

 *  క్యాన్సర్ ప్రభావాన్ని తగిస్తుంది.

 *  రక్త పోటును,  గుండె కొట్టుకునే  వేగాన్ని సమతూకం లో ఉంచుతుంది.

 *  ఉబ్బసం , రక్తహీనత ,  జలుబు లాంటి వాటిని తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది.



**  ఇక యాలకులు జీవ క్రియల పని తీరు సరిగ్గా ఉండేలా చేస్తుంది.  కొద్దిగా వాడిన సరే  కొవ్వు కరిగేలచేసి .. బరువు పెరకుండా చూస్తాయి.  కాబట్టి తీసుకునే కాఫీ , టీ ల లో యాలకుల పొడిని కొద్దిగా చల్లుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వీర్యం వృద్ది మరియు లైంగిక శక్తి:


కావలసిన పదార్దాలు:

1. పచ్చ కర్పూరం - 5 గ్రాములు

2. జాజి కాయ - 5 గ్రాములు

3. జాపత్రి  - 5 గ్రాములు

4. ఎండు ద్రాక్ష  - 5 గ్రాములు


వీర్య కణం


తయారుచేయు  విధానం :
పచ్చ కర్పూరం,  జాజి కాయ  మరియు జాపత్రి ఈ మూడింటిని  తీసుకొని మెత్తగా నూరి,  దాంట్లో  ఎండు ద్రాక్ష వేసి మళ్ళి నూరి  ఆ తరువాత ఆ మిశ్రమాన్ని తీసుకోని వాటిని శనగ గింజంత మాత్రలుగా తయారు చేసుకోవాలి.  


ఉపయోగాలు:

రోజు పడుకోబోయే ముందు ఒక మాత్రను వేసుకొని పాలు తాగితే వీర్యం వృద్ది చెందడమే కాకుండా  లైంగిక  శక్తి కూడా పెరుగుతుంది.

జీలకర్ర తో షుగర్ మరియు హై బి.పి. నివారణ:


 కావలసిన పదార్దాలు:

1. జీలకర్ర. - 3 స్పూన్ల
2. మంచి నీరు తగినంత.


 
జీలకర్ర తో షుగర్ మరియు హై బి.పి. నివారణ


తయారు చేయు విధానం:

 రెండు గ్లాసుల నీటిని పోయి మీద వేడి చేయాలి. అవి బుడగలు రావడం మొదలుపెట్టినప్పుడు, 3 స్పూన్ల జీలకర్ర ను  వేసి , వెంటనే పోయి ఆపేయాలి.  గోరువెచ్చగా అయ్యేవరకు చలార్చి , ఆ నీటిని  త్రాగాలి.
వెంటనే 20 నిమిషాల వాకింగ్ చేయాలి.


ఉపయోగాలు:
ప్రతిరోజు ఇలా చేస్తే జీలకర్రలో ఉండే గుణాలు జీర్ణ వ్యవస్థను శుద్ధి చేసి, బరువు , షుగర్ లెవెల్స్ , అసిడిటీ , హై బి.పి. నియంత్రణలో ఉంటాయి.

నల్ల మచ్చలు మరియు గడ్డలకు నివారణ:


సమస్య:

శరీరంలో ఎక్కడైనా మొటిమల మాదిరిగా ఏర్పడి , అవి పెద్దవిగ మరి గట్టిగ అవుతాయి. కొన్ని రోజులకి ఆ గడ్డలు నల్ల మచ్చలుగ మారతాయి.  దీనికి కారణం రక్తం శుద్ధిగ  లేకపోవడం.

కావలసిన పదర్దాలు :

1. క్యారెట్  - 4

2. బీట్రూట్ - 2

4. టమాట -  3


నల్ల మచ్చలు మరియు గడ్డలకు నివారణ
తయారు చేయు విధానం:

క్యారెట్ మరియు బీట్రూట్ కి శుభ్రంగా కడిగి , చిన్న చిన్న ముక్కలుగా చేసి , తరువాత టమాట ను  చిన్న ముక్కలుగా చేసి , తగినంత నీరు పోసి మిక్సి పట్టాలి. 
మిక్సి చేయగా వచ్చిన  పదార్దాని వడపోయాలి, గట్టి పదార్ధాన్ని నల్ల మచ్చల చోట నెమ్మదిగా మర్దన చేయాలి , మిగిలిన జ్యూస్ లేదా ద్రవాన్ని తాగాలి.

ఇలా రోజు చేస్తే రక్తం శుద్దిగా మారి , గడ్డలు రాకుండా ఉంటాయి.


నల్ల మచ్చలు పోవడానికి నివారణ:

నాటు కోడి గుడ్డులోని తెల్లసోనని  తీసుకొని నల్ల మచ్చలు ఉన్న ప్రదేశం లో రోజుకు రెండు సార్లు మర్దన చేయాలి.  అరగంట ఆగి తలస్నానం చేయాలి.
రోజు ఇలా క్రమం తప్పకుండ చేస్తే మల్ల మచ్చలు పోయి ముఖం కాంతి వంతంగా అవుతుంది.

చుండ్రు నివారణ:


కావలసిన పదర్దాలు :
1). కల బంధ రెమ్మలు -3
2). కొబ్బరి నూనె. - 1/4  కే. జి.


చుండ్రు నివారణ
తయారు చేయు విధానం:
 కల బంధ రెమ్మల నుండి గుజ్జును తీసి, కొంచం మిక్స్ చేయాలి.  తరువాత ఒక గిన్నెలో కొబ్బరి నూనె మరియు కల బంధ గుజ్జు సమానంగా తీసుకొని పోయి మీద చిన్న మంటలో ఉంచి కొబ్బరి నూనె బంగారు రంగు లో వచెంత వరకు మెల్లిగా కలుపుతూ ఉండాలి.  కొబ్బరి నూనె బంగారు రంగు లో వచ్చిన తరువాత పోయి ఆపేసి, కొబ్బరి నూనె చల్ల బడినాక, ఒక సీస లో బద్ర పరుచు కోవాలి.

ఉపయోగాలు:
1. చుండ్రు నివారణ.
2. జుట్టు రాలడం దగ్గుతుంది.
3. తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది.


చుండ్రు నివారణకు మరి కొన్ని చిట్కాలు:

1.  మెంతులను రాత్రంత నానబెట్టి , వాటిని రుబ్బి పెరుగు తో కలిపి తలకు పట్టించి శీకాయి తోటి స్నానం చేయాలి.  ఇలా వారానికి 3 సార్లు చేయాలి.


2.  సొంటి కొమ్మును ఎండలో ఎండపెట్టి , దాన్ని మిక్సిలో పట్టి ,  వస్త్రదాలితం చేసి ,  ఆ పొడిని చుండ్రు ఉన్న చోట నెమ్మదిగా మర్దన చేయాలి. ఇలా వారానికి 2 సార్లు చేయాలి. చుండ్రు భాద నుండి విముక్తి లభిస్తుంది.