గోర్ల‌ను చూసి ఎలాంటి అనారోగ్యం క‌లిగిందో ఇలా తెలుసుకోవ‌చ్చు!

గోర్ల‌ను చూసి ఎలాంటి అనారోగ్యం క‌లిగిందో ఇలా తెలుసుకోవ‌చ్చు!


andariki-ayurvedam-nails-health



ఆరోగ్యం బాగా లేక‌పోతే డాక్ట‌ర్ దగ్గ‌రికి వెళ్ల‌డం, మందులు మింగ‌డం మ‌న‌కు ప‌రిపాటే. అయితే అనారోగ్య ల‌క్ష‌ణాలు బాగా ముదిరిన‌ప్పుడే జ‌బ్బు ఎక్కువై మ‌న‌కు తెలుస్తుంది. కానీ ముందుగా తెలియ‌దు. ఈ క్ర‌మంలో అస‌లు ఒంట్లో అనారోగ్యంగా ఉన్న‌ప్పుడే మ‌నం తెలుసుకోగ‌లిగితే అందుకు త‌గిన విధంగా ముందుగానే జాగ్ర‌త్త ప‌డి మ‌న ఆరోగ్యాన్ని సంర‌క్షించుకునేందుకు వీలుంటుంది. కానీ పైకి ఏ ల‌క్ష‌ణం క‌నిపించ‌కుండా ఒంట్లో అనారోగ్యంగా ఉంద‌ని మ‌న‌కు ఎలా తెలుస్తుంది..? అయితే అందుకు ఓ మార్గం ఉంది. ఏం, లేదు, మ‌న గోర్ల‌ను ప‌రీక్షించుకోవ‌డ‌మే. అవును, డాక్ట‌ర్ ద‌గ్గ‌రికి వెళ్లినా వారు మ‌న గోర్ల‌ను కూడా ఒక‌సారి ప‌రీక్ష‌గా చూస్తారు. అప్పుడే మ‌న శ‌రీరంలోని అనారోగ్యం గురించి వారికి తెలుస్తుంది. గోర్లు ఉన్న రంగు, ఆకారం, స్థితిని బ‌ట్టి మ‌నం ఏ అనారోగ్యంతో బాధ ప‌డుతున్నామో మ‌న‌మూ ఇలా తెలుసుకోవ‌చ్చు. అదెలాగంటే..! 

1. గోర్లు పాలిపోయి క‌నిపిస్తుంటే రక్తహీనత, గుండె జబ్బులు, లివర్ వ్యాధులున్న‌ట్టు తెలుసుకోవాలి. 

2. తెల్లని కొసల‌తో గోర్లు ఉంటే హెపటైటిస్ వ్యాధి ఉందని సంకేతం.

3. గోళ్లు పసుపు రంగులో ఉంటే తీవ్ర‌మైన ఇన్‌ఫెక్ష‌న్‌తో బాధ ప‌డుతున్న‌ట్టు తెలుసుకోవాలి. థైరాయిడ్‌, తీవ్ర‌మైన ఊపిరితిత్తుల స‌మ‌స్య‌, సోరియాసిస్‌, షుగ‌ర్ వ్యాధులు ఉన్న‌వారికి ఇలా క‌నిపిస్తుంటాయి. 

4. గోర్లు నీలి రంగులో ఉంటే శ‌రీరానికి స‌రిప‌డా ఆక్సిజ‌న్ ల‌భించ‌డం లేద‌ని అర్థం. అదేవిధంగా గుండె, ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు ఉన్నా గోర్లు ఈ రంగులో క‌నిపిస్తాయి. 

5. గోళ్ల కింద చ‌ర్మం ముదురు ఎరుపు రంగులోకి మార‌డం, గోళ్లు గ‌తుకులుగా ఉండ‌డం సోరియాసిస్‌ను సూచిస్తాయి. 

6. థైరాయిడ్, ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు ఉన్నవారికి గోళ్లు ప‌లుచ‌గా విరిగిపోయి, లేత పసుపు రంగును కలిగి ఉంటాయి.

7. గోళ్ల కింద మందంగా నల్లని గీతలు ఉంటే తక్షణం వైద్యుణ్ణి సంప్రదించాలి. మెలనోమియా అనే చర్మవ్యాధి లేదా చర్మ సంబంధిత క్యాన్సర్ ఉంటే ఇలా నల్లని గీతలు గోళ్ల కింద కనబడతాయి. అందుకే ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయక వైద్యుడి వద్దకు వెళ్లాలి.

8. ఎండిపోయి నిర్జీవంగా ఉన్న గోళ్లు శరీరంలో తేమశాతం తగ్గిందనడానికి సూచన. గోళ్లు కొరుక్కునే అలవాటున్నవారికి కూడా ఇలా జరగ‌వ‌చ్చు. అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అనే మానసిక వ్యాధి వల్ల కూడా ఇలా జరగొచ్చు. తగిన మోతాదులో నీరు తాగడంతో పాటు మానసిక వైద్యున్ని సంప్రదించాలి.

No comments:

Post a Comment