జుట్టు రాలటాన్ని తగ్గించే సహజ పద్దతులు
జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవటం మీ భాద్యత. జుట్టు రాలటం వలన మానసిక స్థైర్యం కూడా దెబ్బతింటుంది. జుట్టు రాలటాన్ని తగ్గించి, వెంట్రుకల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. ఇలా జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ముందుగా తలపై చర్మం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి.
మీ జుట్టు పట్ల తగిన జాగ్రత్తల తీసుకొని ఎడల, వెంట్రుకలు పెళుసులుగా మారి, చుండ్రు ఏర్పడి, జుట్టు మధ్యలోనే తెగే అవకాశం కూడా ఉంది. జుట్టు రాలటానికి ముఖ్య కారణం-జన్యుపర సంక్రమణ అని చెప్పవచ్చు. అంతేకాకుండా, కొన్ని పద్దతులను పాటించటం వలన జుట్టు రాలటాన్ని తగ్గించి, ఆరోగ్యకరమైన మరియు మెరిసే జుట్టును పొందవచ్చు.
ఆరోగ్యకర జుట్టు కోసం ఆహారం
జుట్టు రాలకుండా ఉండటానికి గానూ, తీసుకునే ఆహారంలో కావలసిన విటమిన్ మరియు మినరల్ లు ఉండేలా చూసుకోవాలి. కావున, మీరు పాటించే ఆహార ప్రణాళికలో, పచ్చని ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు, ఓట్స్ మరియు హోల్ గ్రైన్స్, తృణధాన్యాలను కలుపుకోండి. విటమిన్ 'A', 'B', 'E', ప్రోటీన్ మరియు అయోడిన్ వంటి పోషకాలు జుట్టు ఆరోగ్యానికి తప్పని సరి.జుట్టును ఎలా కడగాలి
జుట్టు కావలసిన పోషకాలను అందించే ఆయిల్ లను రోజు వాడాలి మరియు రెండు రోజులకు ఒకసారి జుట్టును నీటితో కడగాలి. వేడి నీరు జుట్టును ప్రమాదానికి గురి చేస్తాయి, కావున జుట్టును కడగటానికి చల్లటి నీటిని వాడండి. మరీ చల్లటి నీరు కాకుండా, గోరు వెచ్చని నీటితో కడగండి. మీ తలపై చర్మానికి ఆయిల్ లేదా స్నానం చేసే సమయంలో చేతి గోళ్ళు తాకకుండా, కేవలం వెళ్ళు మాత్రమె తాకేలా చుడండి.జుట్టును ఆరబెట్టడం
తడిగా ఉన్న జుట్టును సహజంగా ఆరబెట్టండి. డ్రయర్ లను వాడటం వలన జుట్టు పాడయ్యే అవకాశం ఉంది. ఎక్కువ వేడితో డ్రయర్ ను వాడి జుట్టును ఆరబెట్టడం వలన జుట్టు బలహీనంగా, అనారోగ్యంగా మారుతుంది.జుట్టును ఎలా దువ్వటం
మీ జుట్టును దువ్వటానికి ఖాళీలు ఎక్కువగా ఉన్న దువ్వెనలను వాడండి. దువ్వెనను కూడా కింది వైపుగా దువ్వండి. జుట్టు తడిగా ఉన్నపుడు మాత్రం దువ్వకండి, ఫలితంగా, త్వరగా తెగిపోయే అవకాశం ఉంది.కండిషనర్ల వాడకం
జుట్టుకు కండిషనర్ల వాడకం తప్పని సరే అని చెప్పవచ్చు. కండిషనర్ ను వాడటం వలన వెంట్రుకలపై ఒక పొరలా ఏర్పడి క్లోరిన్ కలిగి ఉన్న నీటి నుండి మరియు హానికర సూర్యకిరణాల నుండి కాపాడుతుంది. హానికర సూర్య కిరణాల నుండి మీ జుట్టును కాపాడుకోవటానికి, రోజు క్యాప్ ను ధరించండి. కావున, కనీసం ప్రతి రెండు రోజులకు ఒకసారైన కండిషనర్ ను వాడండి.జుట్టు ఆరోగ్యానికి వ్యాయామాలు
శారీరక వ్యాయామాలు కూడా జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. వ్యాయామాల వలన ఒత్తిడి తగ్గి, తలపై చర్మానికి రక్త ప్రసరణను మెరుగుపరచి, జీర్ణాశయ విధిని మెరుగుపరచి మరియు ఆహారంలో ఉన్న పోషకాలను గ్రహించేలా ప్రోత్సహిస్తాయి. ఫలితంగా, జుట్టుకు కావలసిన పోషకాలు గ్రహించబడి, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.ఒకవేళ మీ జుట్టు ఆరోగ్యం గురించి పట్టించుకోవటం లేదా! జుట్టు పూర్తిగా రాలిపోయిన తరువాత జాగ్రత్తలు తీసుకోవటం కన్నా, ఇప్పటి నుండే జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. పైన తెలిపిన పద్దతులను పాటించటం వలన మీ జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఆరోగ్యకరమైన జుట్టు మరియు చర్మం కోసం స్నానానికి చల్లటి నీటిని ఎంచుకోండి
షవర్ కింద స్నానం చేయటం అనేది ఒక చికిత్సగా చెప్పవచ్చు. షవర్ కింద స్నానం చేయటం వలన మీ చర్మం శుభ్రపరచపడి, తాజాగా మారుతుంది. కానీ, చల్లటి నీటితో స్నానం చేయటం వలన చర్మం మరియు జుట్టు పొడిగా మార్చదు, వేడి నీరు చర్మాన్ని మరియు వెంట్రుకలను పొడిగా మార్చే అవకాశం ఉంది. వేడి నీటిని కాకుండా, చల్లటి నీటితో స్నానం చేయటం వలన కలిగే ప్రయోజనాలు గురించి కింద తెలుపబడింది.
చర్మానికి కలిగే ప్రయోజనాలు
చర్మ రంద్రాలను మూసివేస్తాయి
వేడి నీటితో చర్మాన్ని కడగటం వలన చర్మ రంద్రాలు తెరచుకుంటాయి. ఫలితంగా, చర్మ రంద్రాలు శుభ్రపరచబడతాయి. కానీ, చల్లటి నీటితో కడగటం వలన చర్మ రంద్రాలు మూసివేయబడతాయి. అంతేకాకుండా, ఇచి చర్మ రంద్రాలలో నూనెలు మరియు దుమ్ము, ధూళి వంటి నిల్వల ద్వారా బ్యాక్టీరియా వలన ఏర్పడే మొటిమలను కలగకుండా చేస్తాయి.చర్మం యొక్క సహజ నూనెలను సంరక్షిస్తాయి
వేడి నీరు చర్మంలో ఉండే సహజ నూనెలను తొలగించి చర్మాన్ని పొడిగా మారుస్తాయి. వేడి నీరు చర్మానికి తాకగానే చర్మ రంద్రాలు తెరచుకొని, వాటిలో ఉండే సహజ నూనెలు నీటి ద్వారా తొలగిపోతాయి. ఇలా చర్మాన్ని రక్షించే సహజ నూనెలు తొలగిపోవటం వలన చర్మం పొడిగా మరియు చర్మ కణాలు గణనీయంగా మరణానికి గురై, చర్మంపై గీతలు మరియు వలయాలు ఏర్పడతాయి. దీనికి బదులుగా చల్లటి నీటితో చర్మాన్ని కడగటం వలన సహజ నూనెలు చర్మంలోనే ఉండి, చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.నిర్జీవతలో తగ్గుదల
చల్లటి నీరు రక్తనాళాలను బిగుతుగా మార్చి, వాపులు మరియు కంటి కింద ఉండే నల్లటి వలయాలు ఏర్పడటాన్ని తగ్గిస్తుంది.వెంట్రుకలకు కలిగే ప్రయోజనాలు
సీబం సంరక్షణ
సీబం అనేది చర్మాన్ని మరియు వెంట్రుకలను సంరక్షించే సహజ నూనెలుగా చెప్పవచ్చు. వేడి నీటితో స్నానం చేయటం వలన ఈ సహజ నూనెలో తొలగించబడి, జుట్టు పొడిగా మరియు ప్రమాదానికి గురవుతాయి. చల్లటి నీటితో స్నానం చేయటం వలన సీబం కోల్పోయే ప్రక్రియ ఆగటమే కాకుండా, జుట్టుకు బలాన్ని చేకూర్చి, వెంట్రుకలు రాలటాన్ని తగ్గిస్తుంది.వెంట్రుకల క్యుటికల్ మూసివేత
చల్లటి నీటితో జుట్టును కడగటం వలన క్యుటికల్ మూసుకుపోతాయి. క్యుటికల్ మూసుకుపోయినపుడు, కాంతిని మరింత పరావర్తనం చెందిస్తాయి. ఫలితంగా, మీ జుట్టు ప్రకాశవంతంగా మరియు ఆరోగ్యంగా కనపడుతుంది.చిక్కుళ్ళను తగ్గిస్తాయి
చర్మానికి హాని కలిగించినట్టుగానే, వేడి నీరు వెంట్రుకలకు కూడా హాని కలిగిస్తుంది. జుట్టు నుండి ఒకసారి సహజ నూనెలు తొలగిపోయినట్లయితే, వెంట్రుకలు పొలుసులుగా మారి, ప్రమాదానికి గురవుతాయి. దీనికి బదులుగా వెంట్రుకలను చల్లటి నీటితో కడగటం వలన క్యుటికల్ లు మూసుకుపోతాయి. ఫలితంగా, జుట్టు చిక్కుళ్ళకు గురవకుండా, ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా కనపడతాయి.
కొన్ని నిమిషాల పాటు చల్లటి నీటిలో స్నానం చేయటం వలన జుట్టు మరియు చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
జుట్టు పెరుగుదలకు క్యాస్టర్ లేదా ఆముదము ఆయిల్ ఎలా సహాయపడుతుంది?
క్యాస్టర్ ఆయిల్ లేదా ఆముదము నూనె జుట్టు పొడవుగా పెరుగుటను మరియు మందంగా పెరగటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, జన్యుపర లోపల వలన, అనారోగ్యకర ప్రణాళికలను పాటించే వారిలో, ఒత్తిడి, మానసిక కారణాల మారియు జీవనశైలిలో లోపల వలన కలిగే బట్టతలను తగ్గించుటకు చికిత్సగా కూడా వాడతారు. క్యాస్టర్ ఆయిల్ ను ఆహార తయారీలో వాడటం వలన జుట్టు రాలటం తగ్గి, వత్తుగా మారుతుంది.
క్యాస్టర్ ఆయిల్ వలన కలిగే ప్రయోజనాలు
- జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
- వెంట్రుకలు పలుచగా మారటాన్ని నివారిస్తుంది.
- జుట్టు ప్రమాదానికి గురవటాన్ని తగ్గిస్తుంది.
- పొడి జుట్టుకు కావాల్సిన పోషకాలను అందించి మరియు ప్రకాశవంతంగా కనపడేలా చేస్తుంది.
- ప్రకాశవంతంగా మార్చి, జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
- జుట్టు మొదళ్ళ నుండి చివరి వరకు తేమను అందించి పరిస్థితిని మెరుగుపరుస్తుంది.
- తలపై చర్మం పొడిగా మారటాన్ని నివారిస్తుంది.
- జుట్టు యొక్క పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
అంతేకాకుండా, క్యాస్టర్ ఆయిల్ ను అప్లై చేయటం వలన ప్రమాదాలను మరియు జుట్టు చివరల తెగటాన్ని నివారిస్తుంది. జుట్టుకు గమనించదగిన బలాన్ని కూడా చేకూరుస్తుంది. జుట్టు రాలటాన్ని తగ్గించి, వెంట్రుకల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుటలో క్యాస్టర్ ఆయిల్ ను వాడే విధానాల గురించి కింద తెలుపబడింది:
వెంట్రుకల ఆరోగ్యానికి క్యాస్టర్ ఆయిల్ ను ఎలా వాడాలి?
- చేతి వెళ్ళ కొనల సహాయంతో, మంచి నాణ్యత గల క్యాస్టర్ ఆయిల్ ను వెంట్రుకల మొదళ్ళ నుండి చివరి వరకు అప్లై చేయండి.
- అప్లై చేసే క్యాస్టర్ ఆయిల్ తలపై చర్మానికి పూర్తిగా విస్తరించేలా చూడండి.
- క్యాస్టర్ ఆయిల్ ను వెంట్రుకలకు కావాల్సిన స్థాయిలో మాత్రమే వాడండి, ఎందుకంటే, ఎక్కువగా వాడటం వలన జుట్టు నుండి తొలగించటం కూడా కష్టమే.
- క్యాస్టర్ ఆయిల్ వెంట్రుకలకు అప్లై చేసిన తరువాత, ప్లాస్టిక్ క్యాప్ తో కప్పండి లేదా టవల్ తో చుట్టి ఉంచండి. ఇలా ఆయిల్ 15 నుండి 20 నిమిషాల పాటూ ఉంచండి లేదా పూర్తి రాత్రి వరకు అలానే ఉంచండి.
- తరువాత మంచి షాంపూతో జుట్టును కడిగి వేయండి.
- ఇలా 8 వారాల పాటూ, వారానికి ఒకసారి చేసి ఫలితాలను గమనించండి.
కేవలం క్యాస్టర్ ఆయిల్ మాత్రమేకాకుండా, దీనిని ఇతర నూనెలు అనగా ఆలివ్ ఆయిల్, గ్రేప్ సీడ్ లేదా కొబ్బరి నూనెలో కలిపి కూడా వాడవచ్చు. ఇతర ఆయిల్ లతో జోడించి వాడటం వలన మంచి ఫలితాలను పొందటమే కాకుండా, క్యాస్టర్ ఆయిల్ యొక్క మందపాటి అనుగుణ్యతను తేలికగా చేస్తాయి.
క్యాస్టర్ ఆయిల్ ను క్రమంగా వాడటమే కాకుండా, జుట్టు ఆరోగ్యానికి కావలసిన ఆరోగ్యకర ఆహారాలను మరియు పోషకాలు అధిక మొత్తంలో ఉన్న ఆహారాలను తినటం తప్పని సరి. వైద్యుడిని కలిసి, జుట్టు పెరుగుదలకు కావల్సిన విటమిన్ లను కలిగి ఉన్న ఉపభాగాలను కూడా వాడండి.
సరైన సమయం పాటూ విశ్రాంతి, రోజు వ్యాయామాలు మరియు ఒత్తిని అధిగమించే ధ్యానం వంటి వాటిని అనుసరించటం వలన జుట్టు పొడవుగా, మందగా మరియు బలంగా ఉంటుంది. మీ జుట్టు పలుచగా మారినట్టు అనిపిస్తే అద్దంలో చెక్ చేసుకోండి. ఇన్ని రకాలుగా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే క్యాస్టర్ ఆయిల్ ను వాడి, మంచి అందమైన శిరోజాలను పొందండి.
పొడి మరియు జిడ్డు కేశాల నివారణకు చిట్కాలు
మీ కేశాల సమస్యలను త్రోలగించటానికి మొదటగా వెంట్రుకల యొక్క పరిస్థితిని తెలుసుకోవాలి. సాధారణంగా వెంట్రుకల సమస్యలను బట్టి వాటిని మూడు రకాలుగా విభజించారు. మొదటిది-జిడ్డుగా ఉండే వెంట్రుకలు, రెండవది-పొడి వెంట్రుకలు మరియు చివరది-సాధారాణ వెంట్రుకలు, ఇక్కడ జిడ్డు మరియు పొడి వెంట్రుకల గురించి తెలుపబడింది.
జిడ్డుగా ఉండే వెంట్రుకలు
మీ తలపై చర్మంలో ఉండే గ్రంధులు ఉత్తేజానికి గురయ్యి, అధిక నూనెలను ఉత్పత్తి చేయటం వలన జుట్టు జిడ్డుగా మారుతుంది. జిడ్డుగా ఉండే కేశాలు అతుక్కుపోయినట్టుగా కనిపిస్తుంది. కొన్ని సార్లు అలా కనిపించదు కుడా, కానీ ఇది వాతావరణంలో ఉండే దుమ్ము, ధూళిని అధికంగా గ్రహిస్తుంది. కావున కేశాలు తొందరగా దుమ్ముపట్టి, తలపై చర్మానికి మరియు జుట్టుకి చాలా ఆరోగ్య సమస్యలను తెస్తుంది. ఈ విధంగా వెంట్రుకల మధ్య చుండ్రు ఏర్పడి జుట్టు రాలటానికి కారణం అవుతుంది.
నిర్వహణ
- క్రమంగా హెన్న ఉన్న షాంపూతో కడగాలి. దీని వలన వెంట్రుకల రంగు ప్రభావితం అవకుండా ఉంటుంది, అధికంగా ఉన్న ఆయిల్'ని గ్రహించుకుంటాయి, వెంట్రుకలకు తగినంత విధంగా పొడితత్వాన్ని చేకూరుస్తాయి.
- మీ వెంట్రుకలకు నూనెలను వాడకూడదు, వెంట్రుకలకు బలాన్ని అందించే టానిక్'లను వాడండి. ఇది మీ జుట్టుకి బలాన్ని చేకురుస్తుంది.
- మీ జుట్టు ఆరోగ్యంగా ఉండానికి హెన్నాని వాడండి.
పొడి వెంట్రుకలు
పొడిగా ఉండే జుట్టు, తలపై ఉండే చర్మ గ్రంధులు నూనెలను స్రవించక లేదా ఉత్పత్తి చేయకపోవటం వలన వెంట్రుకల పొడిగా మారతాయి. కావున జుట్టు రసాయనాల వలన, సూర్యకాంతి, దుమ్ము, ధూళి వలన జుట్టు పాడయిపోతుంది.
పొడి జుట్టు వలన సమస్యలు
- పొడిగా ఉండే జుట్టు వలన తలపై చర్మం కూడా చుండ్రుకి ప్రభావితం అవుతుంది. ఇది వెంట్రుకల మొత్తానికి విస్తరించి, చూడటానికి నాణ్యత రహితంగా కనపడుతుంది. అపుడపుడు చుండ్రు ధరించే దుస్తువుల పైన కూడా పడవచ్చు.
- వెంట్రుకల కణాలు గరుకుగా మారి, ప్రకాశరహితంగా మారుతుంది.
- వెంట్రుకలు ఎక్కువగా పొడిగా మారటం వలన జుట్టు పాడైపోయి మధ్యలో తెగిపోతుంది.