జుట్టు రాలటాన్ని తగ్గించే సహజ పద్దతులు


జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవటం మీ భాద్యత. జుట్టు రాలటం వలన మానసిక స్థైర్యం కూడా దెబ్బతింటుంది. జుట్టు రాలటాన్ని తగ్గించి, వెంట్రుకల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. ఇలా జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ముందుగా తలపై చర్మం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి.

మీ జుట్టు పట్ల తగిన జాగ్రత్తల తీసుకొని ఎడల, వెంట్రుకలు పెళుసులుగా మారి, చుండ్రు ఏర్పడి, జుట్టు మధ్యలోనే తెగే అవకాశం కూడా ఉంది. జుట్టు రాలటానికి ముఖ్య కారణం-జన్యుపర సంక్రమణ అని చెప్పవచ్చు. అంతేకాకుండా, కొన్ని పద్దతులను పాటించటం వలన జుట్టు రాలటాన్ని తగ్గించి, ఆరోగ్యకరమైన మరియు మెరిసే జుట్టును పొందవచ్చు.







ఆరోగ్యకర జుట్టు కోసం ఆహారం

జుట్టు రాలకుండా ఉండటానికి గానూ, తీసుకునే ఆహారంలో కావలసిన విటమిన్ మరియు మినరల్ లు ఉండేలా చూసుకోవాలి. కావున, మీరు పాటించే ఆహార ప్రణాళికలో, పచ్చని ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు, ఓట్స్ మరియు హోల్ గ్రైన్స్, తృణధాన్యాలను కలుపుకోండి. విటమిన్ 'A', 'B', 'E', ప్రోటీన్ మరియు అయోడిన్ వంటి పోషకాలు జుట్టు ఆరోగ్యానికి తప్పని సరి.

జుట్టును ఎలా కడగాలి

జుట్టు కావలసిన పోషకాలను అందించే ఆయిల్ లను రోజు వాడాలి మరియు రెండు రోజులకు ఒకసారి జుట్టును నీటితో కడగాలి. వేడి నీరు జుట్టును ప్రమాదానికి గురి చేస్తాయి, కావున జుట్టును కడగటానికి చల్లటి నీటిని వాడండి. మరీ చల్లటి నీరు కాకుండా, గోరు వెచ్చని నీటితో కడగండి. మీ తలపై చర్మానికి ఆయిల్ లేదా స్నానం చేసే సమయంలో చేతి గోళ్ళు తాకకుండా, కేవలం వెళ్ళు మాత్రమె తాకేలా చుడండి.

జుట్టును ఆరబెట్టడం

తడిగా ఉన్న జుట్టును సహజంగా ఆరబెట్టండి. డ్రయర్ లను వాడటం వలన జుట్టు పాడయ్యే అవకాశం ఉంది. ఎక్కువ వేడితో డ్రయర్ ను వాడి జుట్టును ఆరబెట్టడం వలన జుట్టు బలహీనంగా, అనారోగ్యంగా మారుతుంది.


జుట్టును ఎలా దువ్వటం

మీ జుట్టును దువ్వటానికి ఖాళీలు ఎక్కువగా ఉన్న దువ్వెనలను వాడండి. దువ్వెనను కూడా కింది వైపుగా దువ్వండి. జుట్టు తడిగా ఉన్నపుడు మాత్రం దువ్వకండి, ఫలితంగా, త్వరగా తెగిపోయే అవకాశం ఉంది.

కండిషనర్ల వాడకం

జుట్టుకు కండిషనర్ల వాడకం తప్పని సరే అని చెప్పవచ్చు. కండిషనర్ ను వాడటం వలన వెంట్రుకలపై ఒక పొరలా ఏర్పడి క్లోరిన్ కలిగి ఉన్న నీటి నుండి మరియు హానికర సూర్యకిరణాల నుండి కాపాడుతుంది. హానికర సూర్య కిరణాల నుండి మీ జుట్టును కాపాడుకోవటానికి, రోజు క్యాప్ ను ధరించండి. కావున, కనీసం ప్రతి రెండు రోజులకు ఒకసారైన కండిషనర్ ను వాడండి.

జుట్టు ఆరోగ్యానికి వ్యాయామాలు

శారీరక వ్యాయామాలు కూడా జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. వ్యాయామాల వలన ఒత్తిడి తగ్గి, తలపై చర్మానికి  రక్త ప్రసరణను మెరుగుపరచి, జీర్ణాశయ విధిని మెరుగుపరచి మరియు ఆహారంలో ఉన్న పోషకాలను గ్రహించేలా ప్రోత్సహిస్తాయి. ఫలితంగా, జుట్టుకు కావలసిన పోషకాలు గ్రహించబడి, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.

ఒకవేళ మీ జుట్టు ఆరోగ్యం గురించి పట్టించుకోవటం లేదా! జుట్టు పూర్తిగా రాలిపోయిన తరువాత జాగ్రత్తలు తీసుకోవటం కన్నా, ఇప్పటి నుండే జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. పైన తెలిపిన పద్దతులను పాటించటం వలన మీ జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.



No comments:

Post a Comment