జుట్టు పెరుగుదలకు క్యాస్టర్ లేదా ఆముదము ఆయిల్ ఎలా సహాయపడుతుంది?



క్యాస్టర్ ఆయిల్ లేదా ఆముదము నూనె జుట్టు పొడవుగా పెరుగుటను మరియు మందంగా పెరగటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, జన్యుపర లోపల వలన, అనారోగ్యకర ప్రణాళికలను పాటించే వారిలో, ఒత్తిడి, మానసిక కారణాల మారియు జీవనశైలిలో లోపల వలన కలిగే బట్టతలను తగ్గించుటకు చికిత్సగా కూడా వాడతారు. క్యాస్టర్ ఆయిల్ ను ఆహార తయారీలో వాడటం వలన జుట్టు రాలటం తగ్గి, వత్తుగా మారుతుంది.

క్యాస్టర్ ఆయిల్ వలన కలిగే ప్రయోజనాలు


  • జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
  • వెంట్రుకలు పలుచగా మారటాన్ని నివారిస్తుంది.
  • జుట్టు ప్రమాదానికి గురవటాన్ని తగ్గిస్తుంది.
  • పొడి జుట్టుకు కావాల్సిన పోషకాలను అందించి మరియు ప్రకాశవంతంగా కనపడేలా చేస్తుంది.
  • ప్రకాశవంతంగా మార్చి, జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
  • జుట్టు మొదళ్ళ నుండి చివరి వరకు తేమను అందించి పరిస్థితిని మెరుగుపరుస్తుంది.
  • తలపై చర్మం పొడిగా మారటాన్ని నివారిస్తుంది.
  • జుట్టు యొక్క పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

అంతేకాకుండా, క్యాస్టర్ ఆయిల్ ను అప్లై చేయటం వలన ప్రమాదాలను మరియు జుట్టు చివరల తెగటాన్ని నివారిస్తుంది. జుట్టుకు గమనించదగిన బలాన్ని కూడా చేకూరుస్తుంది. జుట్టు రాలటాన్ని తగ్గించి, వెంట్రుకల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుటలో క్యాస్టర్ ఆయిల్ ను వాడే విధానాల గురించి కింద తెలుపబడింది:


andariki-ayurvedam99-castor




వెంట్రుకల ఆరోగ్యానికి క్యాస్టర్ ఆయిల్ ను ఎలా వాడాలి?


  • చేతి వెళ్ళ కొనల సహాయంతో, మంచి నాణ్యత గల క్యాస్టర్ ఆయిల్ ను వెంట్రుకల మొదళ్ళ నుండి చివరి వరకు అప్లై చేయండి.
  • అప్లై చేసే క్యాస్టర్ ఆయిల్ తలపై చర్మానికి పూర్తిగా విస్తరించేలా చూడండి.
  • క్యాస్టర్ ఆయిల్ ను వెంట్రుకలకు కావాల్సిన స్థాయిలో మాత్రమే వాడండి, ఎందుకంటే, ఎక్కువగా వాడటం వలన జుట్టు నుండి తొలగించటం కూడా కష్టమే.
  • క్యాస్టర్ ఆయిల్ వెంట్రుకలకు అప్లై చేసిన తరువాత, ప్లాస్టిక్ క్యాప్ తో కప్పండి లేదా టవల్ తో చుట్టి ఉంచండి. ఇలా ఆయిల్ 15 నుండి 20 నిమిషాల పాటూ ఉంచండి లేదా పూర్తి రాత్రి వరకు అలానే ఉంచండి.
  • తరువాత మంచి షాంపూతో జుట్టును కడిగి వేయండి.
  • ఇలా 8 వారాల పాటూ, వారానికి ఒకసారి చేసి ఫలితాలను గమనించండి.

కేవలం క్యాస్టర్ ఆయిల్ మాత్రమేకాకుండా, దీనిని ఇతర నూనెలు అనగా ఆలివ్ ఆయిల్, గ్రేప్ సీడ్ లేదా కొబ్బరి నూనెలో కలిపి కూడా వాడవచ్చు. ఇతర ఆయిల్ లతో జోడించి వాడటం వలన మంచి ఫలితాలను పొందటమే కాకుండా, క్యాస్టర్ ఆయిల్ యొక్క మందపాటి అనుగుణ్యతను తేలికగా చేస్తాయి.

క్యాస్టర్ ఆయిల్ ను క్రమంగా వాడటమే కాకుండా, జుట్టు ఆరోగ్యానికి కావలసిన ఆరోగ్యకర ఆహారాలను మరియు పోషకాలు అధిక మొత్తంలో ఉన్న ఆహారాలను తినటం తప్పని సరి. వైద్యుడిని కలిసి, జుట్టు పెరుగుదలకు కావల్సిన విటమిన్ లను కలిగి ఉన్న ఉపభాగాలను కూడా వాడండి.

సరైన సమయం పాటూ విశ్రాంతి, రోజు వ్యాయామాలు మరియు ఒత్తిని అధిగమించే ధ్యానం వంటి వాటిని అనుసరించటం వలన జుట్టు పొడవుగా, మందగా మరియు బలంగా ఉంటుంది. మీ జుట్టు పలుచగా మారినట్టు అనిపిస్తే అద్దంలో చెక్ చేసుకోండి. ఇన్ని రకాలుగా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే క్యాస్టర్ ఆయిల్ ను వాడి, మంచి అందమైన శిరోజాలను పొందండి. 


No comments:

Post a Comment