ప్లేట్‌లెట్స్... వీటి గురించి మీరు వినే ఉంటారు. ప్రధానంగా డెంగీ జ్వరం వచ్చినప్పుడు ఇవి ఎక్కువగా క్షీణిస్తాయి. అంటే రక్తంలో ఉన్న వాటి సంఖ్య ఒకేసారి పడిపోతుంది. దీంతో ఆరోగ్యం మరింత విషమించి ప్రాణాపాయ స్థితి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పవాల్సి వస్తుంది. అయితే అలాంటి జ్వరం వచ్చినప్పుడు వైద్యులు ఇచ్చే మందులతోపాటుగా కింద పేర్కొన్న పలు ఆహార పదార్థాలను తీసుకుంటే ప్లేట్‌లెట్ల సంఖ్యను బాగా పెంచుకోవచ్చు. దీంతో వ్యాధి నుంచి త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది.
1. బొప్పాయి పండ్లను తీసుకోవడం వల్ల డెంగీ వచ్చిన వారు త్వరగా కోలుకుంటారు. ప్లేట్‌లెట్ల సంఖ్య కూడా పెరుగుతుంది.
2. దానిమ్మ పండ్లను తిన్నా ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. ఇది రక్తం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేందుకు కూడా ఉపయోగపడుతుంది.
3. ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, కూరగాయలను ఎక్కువగా తినాలి. దీంతో వాటిలో ఉండే విటమిన్ కె ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచుతుంది.
4. వెల్లుల్లి రేకుల్ని ఆహారంలో భాగంగా తీసుకుంటే చాలా మంచిది. దీంతో ప్లేట్‌లెట్ల సంఖ్య వృద్ధి చెందుతుంది.
5. రక్తహీనతతో బాధపడేవారే కాదు, డెంగీ వచ్చిన వారు కూడా బీట్ రూట్ జ్యూస్‌ను తాగవచ్చు. దీంతో ప్లేట్‌లెట్లు పెరుగుతాయి.
6. క్యారెట్‌ను తరచూ తింటున్నా రక్తం వృద్ధి చెంది తద్వారా ప్లేట్‌లెట్లు పెరుగుతాయి.
7. ఎండు ద్రాక్షల్లో 30 శాతం ఐరన్ ఉంటుంది. ఇది ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచుతుంది.
8. ఆప్రికాట్ పండ్లను నిత్యం రెండు సార్లు తీసుకున్నా చాలు. రక్తం వృద్ధి చెంది ప్లేట్‌లెట్లు పెరుగుతాయి.
9. ఎండు ఖర్జూరం, కివీ పండ్లను తింటున్నా ప్లేట్‌లెట్లను బాగా పెంచుకోవచ్చు. దీంతో వ్యాధి తగ్గుముఖం కూడా పడుతుంది.
0 comments:
Post a Comment