Cucumber Juice |
చాలా తక్కువ మొత్తంలో క్యాలరీలను కలిగి ఉండే వాటిలో కీరదోస కాయ కూడా ఒకటి. దీంట్లో పొటాషియం, విటమిన్ ఎ, సి, మెగ్నిషయం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని మనం తరచూ పలు ఆహార పదార్థాలతోపాటుగా తీసుకుంటూనే ఉంటున్నాం. అయితే కీరదోసతో తయారు చేసే ఓ జ్యూస్‌ను నిత్యం తీసుకోవడం వల్ల శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. దీంతో బరువు తగ్గవచ్చు. ఆ జ్యూస్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
1 లేదా 2 కీరదోసకాయలను, 1 నిమ్మకాయను, 10 పుదీనా ఆకులను, 1 లీటర్ నీటిని తీసుకోవాలి. కీరదోసకాయలను, పుదీనా ఆకులను, కొద్దిగా నీటిని కలిపి మెత్తని పేస్ట్‌లా చేయాలి. అనంతరం ఈ పేస్ట్‌ను 1 లీటర్ నీటిలో మిక్స్ చేయాలి. దానికి కొంత నిమ్మరసం కలపాలి. అంతే... కీరదోస జ్యూస్ తయారైనట్టే. దీన్ని రోజూ 2, 3 సార్లు తాగుతుంటే ఫలితం ఉంటుంది. దీంతో త్వరగా బరువు తగ్గవచ్చు. అయితే ఈ మిశ్రమం బరువు తగ్గించేందుకే కాదు, జీర్ణక్రియను పెంపొందించడంలోనూ ఉపయోగపడుతుంది. పొట్టలో ఏర్పడే అల్సర్లు కూడా తగ్గిపోతాయి. శరీరంలోని విష పదార్థాలు తొలగింపబడతాయి.
No comments:
Post a Comment