ఈ లాభాలు తెలిస్తే... సీతాఫ‌లాన్ని ఇప్పుడే తింటారు..!


http://andariki-ayurvedam99.blogspot.in/
custard-apple

సీజ‌న్‌లో మ‌న‌కు ల‌భించే అనేక ర‌కాల పండ్ల‌లో సీతాఫ‌లం కూడా ఒక‌టి. అత్యంత తియ్య‌ని రుచిని క‌లిగి ఉండ‌డ‌మే కాదు, ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. సీజ‌న‌ల్ ఫ్రూట్‌గా మ‌న‌కు ల‌భించే సీతాఫ‌లంలో విట‌మిన్ ఎ, మెగ్నిషియం, పొటాషియం, ఫైబ‌ర్‌, విట‌మిన్ బి6, కాల్షియం, విట‌మిన్ సి, ఐర‌న్ వంటి అత్యంత ముఖ్య‌మైన పోష‌కాలు ఎన్నో ఉన్నాయి. వీటిని ఈ కాలంలో ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 
  • సీతాఫ‌లాన్ని ఉద‌యాన్నే అల్పాహారంగా తీసుకుంటే దాంతో కండ‌రాలు, న‌రాల బ‌ల‌హీన‌త‌లు తొల‌గిపోతాయి. శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది. 
  • విట‌మిన్ ఎ ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల కంటి రోగాలు తొల‌గిపోతాయి. దృష్టి స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. 
  • సీతాఫ‌లంలో ఉండే మెగ్నిషియం గుండె జ‌బ్బులు రాకుండా చూస్తుంది. వీటిలో ఉండే పోష‌కాలు శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగిస్తాయి. 
  • సీతాఫ‌లాన్ని రోజూ తింటుంటే క‌డుపులో ఉండే నులిపురుగు చ‌నిపోతాయి. అల్స‌ర్లు న‌య‌మ‌వుతాయి. గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం, మ‌ల‌బ‌ద్దకం వంటి జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. 
  • ర‌క్తం త‌క్కువగా ఉన్న వారు సీతాఫ‌లాల‌ను తిన‌డం మంచిది. దీంతో ర‌క్తం త‌యార‌వుతుంది. 
  • శ‌రీరంలో బాగా వేడి ఉన్న వారు సీతాఫ‌లాల‌ను తింటే వెంట‌నే వేడి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 
  • చిన్నారులు, బాలింత త‌ల్లుల‌కు సీతాఫ‌లం చ‌క్క‌ని పోష‌కాల‌ను అందిస్తుంది. వారికి త‌గిన శ‌క్తి ల‌భిస్తుంది. 
  • ఎదుగుతున్న పిల్లలు నిత్యం సీతాఫ‌లాన్ని తింటుంటే దాంతో కాల్షియం వంటి పోష‌కాలు ఎక్కువ‌గా ల‌భిస్తాయి. దీని వ‌ల్ల ఎముక‌లు దృఢంగా ఉంటాయి. 
  • శ‌రీరంలో ఉన్న వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌టికి పంపించ‌డంలో సీతాఫ‌లం బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. రక్తం శుద్ధి కూడా అవుతుంది.
  • No comments:

    Post a Comment