Acidity Problem |
సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, స్థూలకాయం, తిండి ఎక్కువగా తినడం, ఒత్తిడి... ఇలా కారణాలు ఏమున్నా నేడు చాలా మంది కడుపులో గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఏవేవో మందులను వాడుతున్నారు. వాటితో అప్పటికప్పుడు సమస్య తగ్గినా దాంతో ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి. అయితే అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే కింద ఇచ్చిన కొన్ని సహజ సిద్ధమైన చిట్కాలను పాటించి చూడండి. దీంతో గ్యాస్ సమస్య కూడా తగ్గిపోతుంది.
1. చక్కెర కలపకుండా బాగా చల్లగా ఉన్న పాలను ఒక గ్లాస్ మోతాదులో తాగాలి. దీంతో కడుపులో చల్లబడుతుంది. గ్యాస్, అసిడిటీ, మంట తగ్గిపోతాయి. పాలలో ఎక్కువగా ఉండే కాల్షియం కడుపులో ఉన్న ఆమ్లాలను పీల్చుకుని గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
2. రెండు, మూడు యాలకులను తీసుకుని బాగా నలిపి పొడి చేయాలి. ఈ పొడిని ఒక గ్లాస్ నీటిలో మరిగించాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని వడకట్టి చల్లార్చి తాగాలి. దీంతో గ్యాస్ సమస్య పోతుంది.
3. ఒక టీస్పూన్ తేనెను తాగాలి. దీంతో కేవలం 5 నిమిషాల్లోనే అసిడిటీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కడుపులోని మ్యూకస్ పొరను రక్షించే ఔషధంగా తేనె పనిచేస్తుంది.
4. అసిడిటీ, గ్యాస్ సమస్యల నుంచి వెంటనే ఉపశమనం లభించాలంటే ఒక గ్లాస్ కొబ్బరి నీటిని తాగాలి. దీంతో ఆ సమస్యలు తొలగిపోతాయి.
No comments:
Post a Comment