1. ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో కొంత నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఉదయాన్నే పరగడుపున ఈ మిశ్రమం తాగితే అధికంగా ఉన్న పొట్ట తగ్గిపోతుంది.
2. ఒక గ్లాస్ నీటిలో 2 టేబుల్ స్పూన్ల క్రాన్ బెర్రీ జ్యూస్‌ను వేసి బాగా కలపాలి. ఈ ద్రవాన్ని భోజనానికి ముందు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
3. ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో నువ్వుల నూనె 1 టీ స్పూన్, అల్లం రసం 1 టీస్పూన్ వేసి బాగా కలపాలి. ఈ ద్రవాన్ని రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
4. ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో అవిసె గింజల పొడి 1 టీ స్పూన్, తేనె ఒక టీస్పూన్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తాగితే పొట్ట దగ్గరి కొవ్వు చాలా త్వరగా తగ్గిపోతుంది.
5. ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో తేనె 2 టీస్పూన్లు, 1/4 టీస్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పొడిలను కలిపి అనంతరం వచ్చే ద్రవాన్ని వడకట్టి తాగితే మంచి ఫలితం ఉంటుంది. పొట్ట సులభంగా తగ్గిపోతుంది.
6. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 2 టేబుల్ స్పూన్ల తేనెను వేసి బాగా కలిపి ఆ ద్రవాన్ని ఉదయాన్నే పరగడుపున తాగితే పొట్ట దగ్గరి కొవ్వు కరిగిపోతుంది.
No comments:
Post a Comment